ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందాన్ని హాస్య బ్రహ్మ అని పిలుచుకుంటుంటాం. ఎన్నో దశాబ్దాలుగా బ్రహ్మానందం మనకు నవ్వులు పంచుతూనే ఉన్నారు. ఎన్నో మరపురాని పాత్రలు తన సుదీర్ఘమైన కెరీర్ లో పోషించారు బ్రహ్మానందం. ఎలాంటి పాత్రనిచ్చినా అవలీలగా పోషించేయడం బ్రహ్మానందం స్పెషలిటీ. బ్రహ్మానందం కామెడీ గురించి చెప్పుకోవాలంటే ఒకరోజు సరిపోదు. బెస్ట్ బ్రహ్మి కామెడీ సీన్స్ అని కొడితే యూట్యూబ్ లో వందల కొద్దీ వీడియోలు మనకు దర్శనమిస్తాయి.
అయితే కొత్త నీరు వస్తుంటే పాత నీరు వెళ్లిపోవడం చాలా సహజం. దశాబ్దాలుగా తన స్థానాన్ని పదిలపరుచుకున్న బ్రహ్మీకి గత కొన్నేళ్లుగా అవకాశాలు సన్నగిల్లాయి. కామెడీ కొంత పుంతలు తొక్కడం. యంగ్ కమెడియన్లు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడంతో బ్రహ్మీకి కెరీర్ పరంగా గడ్డు కాలం ఎదురైంది. గత రెండు, మూడేళ్ళ నుండి బ్రహ్మానందం సినిమాల్లో కనిపించడం చాలా అరుదైపోయింది. ఆయన మీద గౌరవంతో ఏదో అతిథి పాత్రకు ఆహ్వానిస్తే తప్ప బ్రహ్మానందానికి ప్రస్తుతం ఆఫర్లు రావడం లేదు.
ఈ రియాలిటీ బ్రహ్మానందానికి కూడా అర్ధమైంది. అందుకే సినిమాలను పక్కనపెట్టి బుల్లితెరపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గతేడాది ఒక బుల్లితెర కామెడీ షోకు హోస్ట్ గా వ్యవహరించినా అది ప్లాపైంది. అందుకే ఈసారి పక్కా ప్లానింగ్ తో బుల్లితెర యాంకర్ అవ్వాలనుకుంటున్న బ్రహ్మి. అలాగే సీరియల్స్ లో నటించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రేక్షకులతో టచ్ లో ఉండడానికి బ్రహ్మానందం ఈ తరహా నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఈ సరికొత్త ప్రయాణంలో బ్రహ్మానందం ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తారో.
292843 581609Youve actually written a extremely excellent quality write-up here. Thank you extremely considerably 695762