Brahmaji: మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఉద్దేశిస్తూ సినీ నటుడు బ్రహ్మాజీ చేసిన సోషల్ మీడియా పోస్ట్ తీవ్ర దుమారం రేపుతోంది. దీంతో ఆయనపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. అయితే.. తాను ఆ పోస్టు చేయలేదని.. తన అకౌంట్ హ్యాక్ కు గురైందని బ్రహ్మాజీ క్లారిటీ ఇచ్చారు. విజయవాడను వరదలు ముంచెత్తిన పరిస్థితిపై ప్రస్తుత పోస్టు వైరల్ అయింది. వివరాల్లోకి వెళ్తే..
వరదలు వచ్చి ఎనిమిది రోజులైనా ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం సాయం చేయడంలో విఫలమైందని జగన్ పోస్ట్ పెట్టారు. దీనికి బ్రహ్మాజీ అకౌంట్ నుంచి.. ‘మీరు కరెక్ట్ సార్. వాళ్లు చేయలేరు. ఇకనుంచి మనం చేద్దాం. ఫస్ట్ మనం రూ.1000కోట్లు విడుదల చేద్దాం. మన వైసీపీ కేడర్ మొత్తాన్ని రంగంలోకి దింపుదాం. మనకి జనాలు ముఖ్యం. ప్రభుత్వం కాదు. మనం చేసి చూపిద్దాం సార్, జై జగన్ అన్నా’ అంటూ పోస్ట్ వచ్చింది.
పోస్ట్ వైరల్ కావడంతోనే బ్రహ్మాజీ.. తాను ఆ పోస్ట్ చేయలేదని.. తనకు సంబంధంలేదని పేర్కొన్నారు.
Very soon this site will be famous amid all blogging people,
due to it’s fastidious articles