Switch to English

బోయపాటి అండ్ టీమ్ కు భారీ సమస్యే వచ్చి పడిందే

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ ఒక షెడ్యూల్ పూర్తయింది. రెండో షెడ్యూల్ మొదలుపెట్టాలి అని భావించగా లాక్ డౌన్ కారణంగా రెండు నెలల నుండి వాయిదా పడుతూ వస్తోంది. మరో రెండు నెలల పాటు షూటింగ్ లకు అనుమతి రావడం కష్టమే. అయితే అనుమతులు ఎప్పుడు వస్తే అప్పుడు షూటింగ్ కు రెడీ అంటూ చిత్ర టీమ్స్ కొన్ని ఇప్పటికే ప్రకటించాయి. బోయపాటి అండ్ టీమ్ కు కూడా ఇలానే ఉన్నా కానీ వారికి ఆ అవకాశం ఉండకపోవచ్చు.

ఎందుకంటే ఈ సినిమా రాయలసీమ – వారణాసి నేపథ్యంలో సాగే కథ. మెజారిటీ షూటింగ్ భాగాన్ని వారణాసి తదితర నార్త్ ఇండియా ప్రాంతాల్లో తెరకెక్కించాలని ప్లాన్ చేసారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా నార్త్ ఇండియాలో షూటింగ్ చేసుకోవడానికి పెర్మిషన్ రావడం అంత సులువు కాకపోవచ్చు. దీంతో ఏం జరుగుతుందోనని, ఎప్పటినుండి షూటింగ్స్ కు అనుమతి లభిస్తుందోనని టీమ్ ఎదురుచూస్తోంది.

ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ రెండు విభిన్న గెటప్స్ లో కనిపించనున్న విషయం తెల్సిందే. అందులో ఒకటి అఘోరా పాత్ర అని ఇప్పటికే కన్ఫర్మేషన్ వచ్చేసింది. బోయపాటి శ్రీను ఈ విషయంలో ధ్రువీకరణ ఇచ్చేసాడు కూడా. ఈ పాత్ర కోసం బాలయ్య ఏకంగా గుండు చేయించుకోవడం విశేషం. థమన్ సంగీత దర్శకుడు. బాలయ్య సరసన నటించనున్న హీరోయిన్స్ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

సినిమా

తన పిరియడ్స్ ఎక్స్ పీరియన్స్ ను చెప్పిన అనసూయ

జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా టీవీలో.. రంగస్థలం సినమా ద్వారా సినిమాల్లో చాలా పాపులర్ అయిన నటి అనసూయ. నటిగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా అంతే...

‘ఓటీటీ’ దుమ్ము దులిపే ‘సినిమా’ కావాలి

లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా థియేటర్లు మూతబడ్డాయి. ఇప్పటికీ థియేటర్ల పునఃప్రారంభంపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఒకవేళ తెరిచినప్పటికీ ప్రేక్షకులు మునుపటిలా థియేటర్లకు వస్తారో,...

‘కరోనా వైరస్’ సినిమా ఓటీటీ కోసమే..

ప్రపంచమంతా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అంటూ కూర్చుంటే వర్మ మాత్రం అదే ‘కరోనా వైరస్’ నేపధ్యంలో సినిమా తీసేసాడు. లాక్ డౌన్ సమయంలో...

జుంబారే ..జుజుంబరే… తాతకి మనవడి బర్త్ డే గిఫ్ట్

అమరరాజా ఎంటర్టైన్మెంట్ పతాకంపై గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో ఒక చితం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో...

పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్న చిరంజీవి ఫ్యామిలీ

మెగాస్టార్ చిరంజీవి తేనెటీగల దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా దోమకొండలో ఈ ఘటన జరిగింది. ఇటివల రామ్ చరణ్ భార్య ఉపాసన...

రాజకీయం

‘సుమోటో’ అంటూ ఈ కెలుకుడేంది ‘రెడ్డి’గారూ.!

సోషల్‌ మీడియాలో వైఎస్సార్సీపీ ముఖ్య నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చాలా యాక్టివ్‌గా వుంటారన్నది అందరికీ తెల్సిన విషయమే. కుప్పలు తెప్పలుగా ట్వీట్స్‌ వేస్తుంటారాయన. ప్రత్యర్థులపై ఎడాపెడా సెటైర్లు వేయడంలో...

జనసేనాని ప్రశ్న: లాక్‌డౌన్‌లో ‘ఇసుక’ మాయమైందెందుకు.?

‘లాక్‌డౌన్‌లోనూ ఇసుక లారీలు తిరిగాయి.. కానీ, డంపింగ్‌ యార్డులకి చేరలేదని భవన నిర్మాణ రంగ కార్మికులు చెబుతున్నారు. మరి, ఇసుక ఏమయినట్లు.? చంద్రబాబు హయాంలో ఎలాగైతే ఇసుక పేరుతో దోపిడీ జరిగిందో.. ఇప్పుడే...

కృష్ణాజిల్లా నందిగామలో చంద్రబాబు పై కేసు నమోదు

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై నందిగామ పోలీస్ స్టేషను లో కేసు నమోదు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో హైదరాబాదు నుండి విజయవాడ కు రోడ్డు మార్గాన వస్తూ జగ్గయ్యపేట, నందిగామ,కంచికచర్ల...

సుధాకర్ కు వైద్యం అందిస్తున్న డాక్టర్ మార్పు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డా.సుధాకర్ కేసును హైకోర్టు ఆదేశాలతో సీబిఐ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకీ ఈ కేసు కీలక మలుపులు తీసుకుంటోంది. ఇప్పుడు సుధాకర్ విషయంలో మరో అంశం సంచలనమైంది....

కరోనా వైరస్‌.. జనానికి ఇకపై ఆ దేవుడే దిక్కు.!

కరోనా వైరస్‌ విషయంలో కేంద్రం చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయడానికేమీ లేదు. దశలవారీగా లాక్‌డౌన్‌ని ఎత్తేవేసేందుకు ప్రణాళికని కూడా కేంద్రం ప్రకటించేసింది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందాల్సిన స్థాయిలో ఆర్థిక అండదండలు...

ఎక్కువ చదివినవి

ఫ్లాష్ న్యూస్: మానవత్వానికే మచ్చ.. కరోనా భయంతో నర్సును అలా వదిలేశారు

కరోనా బారిన పడిన వారిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు వైద్యులు. వారితోపాటు నర్సులు, పారా మెడికల్ సిబ్బంది కూడా తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. ప్రజల మన్ననలు పొందుతున్నారు. కానీ.. అదే పారా...

మిడతల దండుతో విమానాలకూ ప్రమాదమే.. ఎలాగంటే

కరోనాతో దేశం ఎదుర్కొంటున్న సమస్యలు సరిపోలేదన్నట్టు ఇప్పుడు మరో కొత్త సమస్య భయపెడుతోంది. దేశం యావత్తూ చర్చనీయాంశమైన ఆ అంశమే ‘మిడతల దండు’. ఇప్పటికే మహారాష్ట్ర, హర్యానా.. వంటి రాష్ట్రాల్లో వీటితో పంట...

‘కరోనా వ్యాక్సీన్’ తయారు చేస్తున్న అ! దర్శకుడు

యువదర్శకుడు ప్రశాంత్ వర్మ మూడో సినిమాతో రాబోతున్నాడు. మొదరి చిత్రం అ! తో విమర్శకుల మెప్పు సాధించిన ప్రశాంత్ రెండో ప్రయత్నంగా సీనియర్ హీరో రాజశేఖర్ తో ‘కల్కి’ అనే చిత్రం తెరకెక్కించాడు....

పిక్ ఆఫ్ ది డే: అన్నగారు – మెగాస్టార్ @ ఓ మధుర జ్ఞాపకం.!

నేడు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి జయంతి. ఈ సందర్భంగా తెలుగు వారందరూ ఆయనకి సోషల్ మీడియా ద్వారా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమా పెద్దగా అన్నీ తానై, అందరి...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...