దర్శకుడు బోయపాటి శ్రీను ఇప్పుడు అర్జెంట్ గా ఓ సూపర్ హిట్ సినిమా చేయాలన్న ఆలోచనలో ఉన్నాడు. దానికి పెద్ద కారణమే ఉంది. ఇటీవలే రామ్ చరణ్ తో అయన చేసిన వినయ విధేయ రామ భారీ పరాజయం పాలవడంతో ఆ ఎఫెక్ట్ అయన నెక్స్ట్ సినిమా పై పడింది. అదే బాలకృష్ణ సినిమా. బోయపాటి శ్రీను చాలా రోజులుగా బాలయ్యతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. బాలయ్య అటు ఎన్టీఆర్ సినిమాల విషయంలో బిజీగా ఉండడంతో వాటి తరువాత చేద్దామని చెప్పడంతో, ఈ లోగా బోయపాటి రామ్ చరణ్ సినిమాను పట్టాలు ఎక్కించాడు. ఆ సినిమా తరువాత కథ రెడీ చేసుకుని బాలయ్యను అడిగితె తూచ్ .. మనం ఇప్పుడు సినిమా చేయడం లేదని, ఇంకొన్న్ని రోజులు ఆగాలని చెప్పాడట బాలయ్య. దాంతో షాక్ తిన్న బోయపాటి ఎందుకు బాలయ్య ఇలా మాట్లాడాడు అన్న సందేహంలో పడిపోయాడట!!
దానికి కారణం తాను చేసిన లేటెస్ట్ సినిమా ప్లాప్ కారణంగానే బాలయ్య ఇలా అన్నాడు. అందుకే హిట్ సినిమా చేసి మళ్ళీ అయన ముందుకు వద్దామన్న కసితో ఓ యువ హీరోతో సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే పలువురు హీరోలకోసం ప్రయత్నించినా ఎవరు ఖాళీగా లేరు .. పైగా బోయపాటికి ప్లాప్ ఉంది కాబట్టి .. ఎవరు టైం కూడా ఇవ్వరు. అందుకే అయన యంగ్ హీరోలతో అయినా సరే సినిమా చేయాలన్న ఆలోచనలో పడ్డాడు.
తాజాగా బోయపాటి ఓ యంగ్ హీరోతో సినిమా చేయాలనీ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఆ యంగ్ హీరో ఎవరో కాదు లేటెస్ట్ గా ఆర్ ఎక్స్ 100 సినిమాతో సంచలన హీరోగా మారిన కార్తికేయ. ప్రస్తుతం రెండు సినిమాలను చేస్తున్న కార్తికేయ అయితే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నాడట. ఇంతకు ముందే యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ని హీరోగా పెట్టి జయ జానకి నాయక అంటూ ఓ 40 కోట్ల భారీ బడ్జెట్ సినిమా చేసాడు. ఆ సినిమా ప్లాపై .. నిర్మాత తలకు పెద్ద తలనొప్పిలా మారింది. మరి కార్తికేయను హీరోగా పెట్టి అలాంటి భారీ బడ్జెట్ సినిమా అంటే ప్రొడ్యూసర్ దొరకొద్దూ ? ప్రస్తుతం బోయపాటి శ్రీనులో అదే టెన్షన్ కనిపిస్తుంది. తాను ఎలాగైనా హిట్ సినిమా తీయాలన్న ఆలోచన బాగానే ఉంది కానీ, దాన్ని నిలబెట్టే నిర్మాత దొరకాలిగా !!