రాజకీయ నాయకులు మాట్లాడిన మాటలకు సంబంధించి మీడియాలో రకరకాల కథనాలు వస్తుంటాయి. చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లో ఐటీ సోదాలు జరిగితే, ఏకంగా 2 వేల కోట్లు ఆయన ఇంట్లోనే దొరికాయని కొందరు వైసీపీ నేతలు మాట్లాడుతోన్న విషయం విదితమే. రాజకీయాలు ఇంతలా దిగజారిపోయాక.. మీడియాలో వచ్చే వార్తల్ని, కథనాల్ని పట్టుకుని రాజకీయ నాయకులు గింజుకోవడమేంటట.?
అసలు విషయానికొస్తే, మంత్రి బొత్స సత్యనారాయణ, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుకి ఓ లేఖాస్త్రం సంధించారు. ‘ఎన్డీయేలో చేరతాం..’ అంటూ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారనంటూ ఈనాడులో ఈ రోజు ఓ కథనం వచ్చిన విషయం విదితమే. ‘నేను అనని మాటల్ని అన్నానని ఎలా రాస్తారు.? ఇది నేరం..’ అంటూ ఓ సుదీర్ఘమైన లేఖ రాశారాయన.
కాస్త చరిత్రలోకి తొంగి చూస్తే, బొత్స సత్యనారాయణకి ఈనాడు పత్రిక అంటే ఒకింత ‘ఇది’. గతంలో ‘డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం..’ అంటూ ఈనాడులో బొత్స వ్యాఖ్యలపై బీభత్సమైన హెడ్డింగ్ పెట్టి వార్త రాస్తే, ‘ఉత్తరాంధ్ర యాసని అవమానిస్తారా.?’ అంటూ బొత్స అంతెత్తున లేచారు. మళ్ళీ ఇప్పుడు, ఇదిగో ఇన్నాళ్ళకి రామోజీరావుపై మండిపడుతూ బహిరంగ లేఖ రాశారు బొత్స సత్యనారాయణ.
ఢిల్లీలో ఏం జరుగుతోందో అందరికీ తెలుస్తోంది. బీజేపీ – వైసీపీ మధ్య బంధం ఎలా బలపడుతున్నదీ అందరూ చూస్తున్నారు. సరే, ఈ బంధం అధికారికంగా కొనసాగుతుందా.? లేదంటే అనధికారికంగానే ఇకపైనా కొనసాగుతుందా.? అన్నది వేరే చర్చ. ఆ వార్తని ఖండించడానికి వైసీపీ అనుకూల మీడియా ఎలాగూ బొత్సకి వుండనే వుంది. కానీ, అలా ఖండిస్తే.. బీజేపీకి కోపం వస్తుందట. ఇది బొత్స, తన లేఖాస్త్రంలో పేర్కొన్న మరో ఆణిముత్యం.
‘రెండు వైపులా పదునున్న కత్తిని మాపై వాడారు’ అని బొత్స వాపోయారు. మొత్తమ్మీద, తెరవెనుక ఏదో జరిగింది.. అదీ చాలా గట్టిగానే జరిగింది. అందుకే, బొత్స ఇంత సీరియస్‌గా రామోజీరావుకి లేఖాస్త్రం సంధించేశారు. పైగా, ఈనాడు స్పందనని బట్టి తదుపరి చర్యలుంటాయనీ సెలవిచ్చారు.
655414 501327Hey! Do you know if they make any plugins to assist with SEO? Im trying to get my weblog to rank for some targeted keywords but Im not seeing very very good outcomes. Should you know of any please share. Thanks! 54875
309180 51061Really informative post. Your current Website style is awesome as effectively! 812530
120597 458009What a lovely blog. Ill certainly be back. Please preserve writing! 747224
971110 419011Oh my goodness! an remarkable write-up dude. A lot of thanks Even so My business is experiencing trouble with ur rss . Do not know why Struggle to sign up to it. Can there be everybody acquiring identical rss dilemma? Anyone who knows kindly respond. Thnkx 833311
914773 595735Wow, wonderful weblog layout! How long have you been blogging for? you make blogging look easy. The overall appear of your web web site is great, let alone the content material! 252696