Switch to English

బొత్స లీకులు.. వైసీపీ వ్యూహమేనా?

ఏదైనా విషయంపై ప్రజా అభిప్రాయం ఏమిటో తెలుసుకునేందుకు ఒక్కో పార్టీ ఒక్కో విధమైన వైఖరి అవలంభిస్తుంటుంది. సాధారణంగా ఇందుకు ఏ పార్టీ అయినా మీడియానే ఉపయోగించుకుంటుంది. తెలుగుదేశం పార్టీ అయితే, ఏదైనా కీలక అంశానికి సంబంధించి నిర్ణయం తీసుకునే ముందు తన అనుకూల మీడియాకు లీకు ఇచ్చి వార్త రాయిస్తంది. అది ప్రజల్లోకి వెళ్లి చర్చ జరిగిన తర్వాత దానిపై ముందుకెళ్లాలా వద్దా అనే నిర్ణయం తీసుకునేది.

తాజాగా ఏపీలో అధికార వైఎస్సార్ సీపీ ఈ విషయంలో తనదైన వ్యూహం అవలంభిస్తోంది. కీలక అంశాలపై ఏ విషయాన్నైనా మంత్రి బొత్స సత్యనారాయణ ద్వారానే లీకుల రూపంలో వెల్లడిస్తోంది. ఏపీ కేబినెట్ లోని సీనియర్ మంత్రుల్లో ఒకరైన బొత్స.. అతి తక్కువ కాలంలోనే వైసీపీలో కీలక నేతగా ఎదిగారు. వైఎస్ కేబినెట్ లో పనిచేసిన ఆయన.. ఇప్పుడు జగన్ కేబినెట్ లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు.

పార్టీకి సంబంధించిన కీలక విషయాలు తెలిసే అతి తక్కువ మందిలో బొత్స ఒకరు. ఈ నేపథ్యంలో కొన్ని కీలక విషయాలకు ఆయనే కేంద్ర బిందువుగా ఉంటున్నారు. రాజధాని విషయంలో తొలుత తేనె తుట్టెను కదిలించింది బొత్సనే. అమరావతి రాజధానిగా పనికిరాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకటికి రెండుసార్లు బొత్స ఈ అంశంపై మాట్లాడిన తర్వాత మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చింది.

తాజాగా బీజేపీతో పొత్తు విషయంలోనూ బొత్సే అత్యుత్సాహం ప్రదర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే ఎన్డీఏలో చేరతామని స్పష్టంచేశారు. దీనిపై పార్టీ వైఖరి ఏమిటో ప్రకటించక ముందే బొత్స తన అభిప్రాయం వెల్లడించారు. దీనిపై ఒక్కసారిగా దుమారం రేగింది. బీజేపీ, వైసీపీ మధ్య పొత్తు కుదిరితే తాను అందులో ఉండనంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టంచేశారు. ఇక పలువురు బీజేపీ నేతలు సైతం ఈ విషయాన్ని తోసిపుచ్చారు. తాము వైసీపీ, టీడీపీకి సమానదూరమని.. జనసేనతోనే కలిసి సాగుతామని ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జి సునీల్ ధియోదర్ పేర్కొన్నారు.

ఇలా ఏ అంశమైనా బొత్సే ముందుగా మీడియాతో పిచ్చాపాటీ మాట్లాడుతూ వెల్లడించడం వైసీపీ వ్యూహమేనని చెబుతున్నారు. రాజధాని విషయంలోగానీ, బీజేపీతో పొత్తు విషయంలోగానీ బొత్స వ్యాఖ్యలను పార్టీ ఖండించే ప్రయత్నం చేయకపోవడం.. పైగా బొత్సపై ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం వంటి అంశాలు ఇదంతా అధికార పార్టీ వ్యూహంలో భాగమేనన్న సంగతి నిర్ధారిస్తోందని పేర్కొంటున్నారు.

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

ఎక్కువ చదివినవి

రంజాన్‌ స్పెషల్‌: ఇండియాలో ఈద్‌ అల్‌ ఫితర్‌ ఎప్పుడంటే..

పవిత్ర రమదాన్‌ మాసం కొనసాగుతోంది. గతంలో కన్పించిన సందడి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడా రమదాన్‌ సందర్భంగా కన్పించడంలేదంటే దానికి కారణం కరోనా వైరస్‌. ప్రపంచంలో చాలా దేశాలు లాక్‌ డౌన్‌ని పాటిస్తున్న...

క్రైమ్ న్యూస్: మృతదేహాల పోస్టుమార్టంలో కీలక సమాచారం లభ్యం.!

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామంలో జరిగిన ఆత్మహత్యల ఉదంతం ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. బావిలో బయటపడిన 9 మృతదేహాలు ఒకే కుటుంబానికి చెందినవి కావడంతో మరింత ప్రకంపనలు రేపింది....

లాక్ డౌన్ లో కూడా రెండు చేతులా సంపాదిస్తున్న ముద్దుగుమ్మలు

ప్రస్తుతం లాక్ డౌన్ 4.0 కొనసాగుతోంది. గత 60 రోజుల నుండి భారతదేశం లాక్ డౌన్ లో ఉండగా ఇప్పుడిప్పుడే ప్రభుత్వం కొన్ని అనుమతులను మంజూరు చేసింది. అయితే సినిమా షూటింగ్ లకు...

తారక్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ పై మళ్ళీ వార్తలు

నందమూరి తారక రామారావు ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెల్సిందే. ఈ సందర్భంగా తన ఫ్యాన్స్ అంతా చాలా ఉత్సాహంగా సోషల్ మీడియాలో పుట్టినరోజు హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు....

ఫ్లాష్ న్యూస్: ఎమ్మెల్సీ కొడుకుని అని గృహినికి టోకరా

భరత్ కుమార్ అనే వ్యక్తి తనకు తానుగా ఎమ్మెల్సీ కొడుకుగా పరిచయం చేసుకుని ఒక గృహిణిని మోసం చేసిన సంఘటన వెలుగు చూసింది. ఈ కేసును ఘట్కేసర్ పోలీసులు నమోదు చేసి విచారణ...