Switch to English

బొత్స చెప్పింది నిజమే.! రాజకీయ కుట్ర వుందిగానీ, ఎవరిది.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

కోనసీమ జిల్లా విషయంలో జరిగిన అల్లర్లకు సంబంధించి ‘రాజకీయ కుట్ర వుంది’ అంటూ అధికార వైసీపీ చెబుతోంది. మంత్రులు ఈ విషయమై విపక్షాలపై ఆరోపణలు చేస్తున్నారు. బాధ్యతగల పదవుల్లో వున్నవాళ్ళు ఆరోపణలతో సరిపెట్టడమేంటి.? చంద్రబాబునాయుడి హస్తం వుందా.? పవన్ కళ్యాణ్ హస్తం వుందా.? ఇంకెవరి హస్తం అయినా వుందా.? అన్నదానిపై ఆధారాలు కదా చూపించాల్సింది.?

అధికారంలో వున్నోళ్ళు ఆధారాలు చూపించకుండా ఉత్త ఆరోపణలతో సరిపెడితే, జనం నవ్విపోతారన్న కనీస ఇంగితం లేకపోతే ఎలా.? తుని ఘటన విషయమై ఏం జరిగిందో చూశాం. అప్పట్లో వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధమే జరిగింది. రైలు కాలింది నిజం.. దాన్ని కాల్చిందీ నిజం. ఆ ఘటనకు కారణమైన అసాంఘీక శక్తువేవన్నది మాత్రం తేలలేదు.

ఇప్పుడు కోనసీమ అల్లర్ల వ్యవహారంలోనూ అదే జరగబోతోందా.? అంటే, పోలీసులైతే కొందర్ని అరెస్టు చేశారు. తుని ఘటనలోనూ అరెస్టులు జరిగాయి. అప్పట్లో కొందరి మీద పెట్టిన కేసుల్ని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక కొట్టేశారు. ఇప్పుడు వైసీపీ హయాంలో నమోదవుతున్న కేసులు, రేప్పొద్దున్న ప్రభుత్వం మారితే కొట్టివేయబడతాయి. ఈమాత్రందానికి టీడీపీ కుట్ర, జనసేన కుట్ర, వైసీపీ కుట్ర.. అని ఆరోపణలెందుకు.?

మరీ ముఖ్యంగా అధికారంలో వున్న పార్టీలు ఆరోపణలు చేయకూడదు. చేతనైతే, బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలి. కానీ, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దోషులకు శిక్ష పడలేదు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద కోడి కత్తితో హత్యాయత్నం జరిగితే.. ఆ కేసులోనూ దోషులకు శిక్ష పడలేదు.

వ్యవస్థలో మార్పు రావాలంటే.. ముందు రాజకీయం మారాలి. ఆ రాజకీయాల్లో మార్పు ఖచ్చితంగా వచ్చి తీరాలి. పవన్ కళ్యాణ్ కోరుతున్నది అదే. దురదృష్టమేంటంటే, పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తోంటే, అధికార పార్టీ తన బాధ్యతను విస్మరించి రాజకీయ పరమైన ఎదురుదాడితో సరిపెడుతోంది. ఆఖరికి తీసేసిన తాసీల్దారు లాంటి మాజీ మంత్రి కొడాలి నాని కూడా, జనసేన అధినేత మీద విమర్శలు చేసెయ్యడం హాస్యాస్పదం కాక మరేమిటి.?

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

Raghu Rama Krishna Raju: రాజుగారి రివర్స్ గేర్.! ఎవరికి నష్టం.?

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రివర్స్ గేర్ వేసేశారు. బీజేపీ నుంచి టిక్కెట్ రాదని తేలిపోయాక, టీడీపీ మీద ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు రఘురామకృష్ణరాజు చిత్రంగా.! ‘టీడీపీ నాకు నర్సాపురం టిక్కెట్ ఇచ్చి తీరాలి..’...

కవిత, కేజ్రీవాల్.. తర్వాత అరెస్టయ్యేదెవరు.?

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు.. ఇంకో సంచలనం. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీయార్ కుమార్తె కవిత...

Ram Charan Birthday special: మెగా కోటపై సగర్వంగా ఎగురుతున్న జెండా.. రామ్ చరణ్

Ram Charan: కుటుంబం పేరు నిలబెట్టాలంటే వారి గౌరవం కాపాడటమే కాదు.. తనకు తాను ఎదగాలి.. ఉన్నత స్థానం పొందాలి.. పేరు గడించాలి. ఫలానా వారి అబ్బాయి అనేకంటే.. ఈ అబ్బాయి తండ్రి...

Chandrababu Naidu: పిఠాపురం కోసం చంద్రబాబు మాస్టర్ ప్లాన్.!

కుప్పం నియోజకవర్గాన్ని గెలవడం ఎంత ముఖ్యమో, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలవడం కూడా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి అంతే ముఖ్యం.! ‘వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్’ అనే...

Chiranjeevi: బెంగళూరు నీటి సమస్యపై చిరంజీవి స్పందన.. ఫొటోలు వైరల్

Chiranjeevi: 40ఏళ్లలో బెంగళూరువాసులు ఎప్పుడూ ఎదుర్కోనంత నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. సర్వత్రా ఆందోళన కలిగిస్తోన్న సమస్యకు ప్రాంతాలతో సంబంధంలేదని.. నీటి వాడకం, పొదుపుపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అనేకమంది సూచిస్తున్నారు. ఈక్రమంలో మెగాస్టార్...