అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్ నగరం వరుస పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల రెండు చోట్ల జరిగిన జంట పేలుళ్లు ప్రజలను తీవ్ర భయాందోళనకి గురి చేశాయి. అఫ్గాన్ నుంచి పలు దేశాలు తమ దేశ పౌరులను తరలిస్తూండగా గురువారం సాయంత్రం ఈ దారుణం జరిగింది. ఈ దాడిలో 13మంది ప్రాణాలు కోల్పోయారు. వీరి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారని సమాచారం.
ఇది ఆత్మాహుతి దాడి అయ్యుండొచ్చని అమెరికా భావిస్తోంది. ఈఘటనలో అమెరికా, అఫ్గాన్ పౌరులు గాయపడ్డారు. కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద అబే గేటు వద్ద తొలి పేలుడు చోటుచేసుకోగా.. కొద్దిసేపటికే విమానాశ్రయం సమీపంలోని ఓ హోటల్ వద్ద రెండో పేలుడు సంభవించింది. దీంతో ఆ పరిసర ప్రాంతాల్లో భీతావహ వాతావరణం నెలకొంది. రక్తమోడుతూ ప్రాణాలు రక్షించుకొనేందుకు క్షతగాత్రులు ఆసుపత్రికి పరుగులు పెడుతున్న దృశ్యాలు కలవరం రేపాయి.
కాబుల్ విమానాశ్రయం వెలుపల ఆత్మాహుతి దాడులు జరగొచ్చని అమెరికా రక్షణ శాఖ హెచ్చరించిన కొన్ని గంటల్లోనే ఈ ఘటన జరగడం గమనార్హం. బ్రిటన్, ఆస్ట్రేలియా సైతం ఆత్మాహుతి దాడి జరగోచ్చని అనుమానిస్తూనే ఉన్నాయి.
702845 28549Any way Im going to be subscribing for a feed and I hope you write-up once more soon 719757
885324 492061Aw, this was a really good post. In thought I want to put in writing like this moreover ?taking time and actual effort to make a really good article?nonetheless what can I say?I procrastinate alot and certainly not appear to get one thing done. 782469
469439 930994Excellently written write-up, doubts all bloggers offered the same content because you, the internet is really a greater place. Please maintain it up! 422464