బాలీవుడ్ “రామాయణ” గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వైరల్ అవుతూ వస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి ఆమధ్య కొన్ని ఫోటోలు కూడా లీక్ అయ్యాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు నితీష్ తివారి దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా “రామాయణ” తెరకెక్కనుంది. రావణుడి పాత్రను కోలీవుడ్ స్టార్ హీరో యష్ పోషించనున్నారు. కైకేయి గా లారా దత్త, శూర్పనఖ గా రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనున్నారు.
ఈ సినిమా రెండు భాగాలుగా రానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. మొదటి భాగం 2026 దీపావళి సందర్భంగా విడుదల కానుంది. రెండో భాగం 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మ్యూజిక్ డైరెక్టర్లు, విఎఫ్ఎక్స్ సంస్థలు ఈ సినిమా కోసం పని చేయనున్నాయి. తెలుగు వెర్షన్ డైలాగ్స్ బాధ్యతలు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రెహమాన్ తో పాటు, ఫేమస్ హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హన్స్ జిమ్మెర్ పని చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాను బాలీవుడ్ అగ్ర నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.