Bollywood: ‘ముక్కూ, మొహం తెలీని దక్షిణాది హీరో సినిమాలకు ఇక్కడ రూ.600-700కోట్లు వస్తున్నాయి. మన ప్రేక్షకులకు ఏమైంది..? ఏటా కొత్త హిందీ సినిమాలు వస్తున్నా మనవాళ్లని అలరించలేకపోతున్నాయి. కారణమేంట’ని ప్రముఖ హిందీ గీత రచయిత జావెద్ అక్తర్ హీరో అమీర్ ఖాన్ ను అడిగారు. ఓ చిత్రోత్సవంలో ఆయన వేసిన ప్రశ్నకు అమీర్ స్పందించారు.
‘నేడు సినిమాలు, దర్శకులకు దక్షిణాది, ఉత్తరాది అనే పరిమితుల్లేవు. మన సినిమాల్ని మనోళ్లే చూడకపోవడానికి ఉన్న కారణాల్లో ఒకటి మనం పాటించే బిజినెస్ సూత్రమే అనుకుంటా. సినిమాలు ధియేటర్లతో చూడండని మనమే అడుగుతాం. ఎనిమిది వారాల్లో మనమే ఇంటికి తీసుకెళ్లి మరీ సినిమా చూడమని ఓటీటీలో ఇస్తాం. ఆర్ధికశాస్త్రంలో డిమాండ్ సప్లై అనే సూత్రానికి ఇది వర్తిస్తుంది’.
‘ఒకే ఉత్పత్తిని ఎలా విక్రయిస్తున్నామో మనకే తెలీదు. ఒకప్పుడు నేనైతే ఖచ్చితంగా ధియేటర్లోనే సినిమా చూసేవాడిని. ఇప్పుడు ఎక్కడ వీలుంటే అక్కడ చూడొచ్చు. మనం అనుసరిస్తున్న విచిత్రమైన వ్యాపార సూత్రాలతో మనమే సినిమాని చంపుకుంటున్నా’మని అన్నారు.