తెలుగు హీరోలు పాన్ ఇండియా సినిమాలు తీయాలంటే తమ సినిమాల్లో కచ్చితంగా బాలీవుడ్ హీరోయిన్లు ఉండాల్సిందే అన్నట్టు ఫిక్స్ అయిపోతున్నారు. ఇది ఒకరకమైన మార్కెట్ ఐడియా. ఎందుకంటే బాలీవుడ్ హీరోయిన్లు ఉంటే ఆటోమేటిక్ గా హిందీలో తమ సినిమాకు హైప్ పెరుగుతుందని.. బిజినెస్ జరుగుతుందని వారు భావిస్తున్నారు. అయితే బాలీవుడ్ హీరోయిన్లు ఎన్నో ఆశలు పెట్టుకుని పాన్ ఇండియా సినిమాల్లో చేస్తుంటే.. తెలుగు హీరోల హీరోయిజం ముందు వారు తేలిపోతున్నారు. వారి పాత్రలు అత్యంత తేలికగా ఉంటున్నాయి.
ఆ నడుమ త్రిబుల్ ఆర్ లాంటి పెద్ద సినిమాలో నటించింది ఆలియాభట్. రాజమౌళి కావడంతో ఎగిరి గంతేసింది. కానీ అంత పెద్ద సినిమాలో ఆమెకు పట్టుమని నాలుగు సీన్లు కూడా లేవు. అసలు ఆమెను ఎందుకు పెట్టారో అర్థం కానట్టు ఆమె పాత్ర ఉంది. దాంతో సీత పాత్ర దారుణంగా అట్టర్ ప్లాప్ అయింది. త్రిబుల్ ఆర్ తో ఆలియా భట్ కు ఏ మాత్రం పేరు కూడా దక్కలేదు. ఇక ఇప్పుడు దేవర సినిమాతో జాన్వీ కోటి ఆశలు పెట్టుకుని సౌత్ కు ఎంట్రీ ఇస్తే.. ఆమె తంగం పాత్ర కూడా తుస్సుమంది. జాన్వీ పాత్ర అత్యంత ఇంపార్టెన్స్ అని కొరటాల ఊదరగొట్టినా.. సినిమా చూస్తే అసలు ఆమె పాత్ర అతిథి పాత్రనా అనిపించకమానదు.
ఎందుకంటే తంగం పాత్రలో అసలు బలమే లేదు. సినిమా మొత్తం ఎన్టీఆర్ చుట్టూనే ఉంది. దాంతో జాన్వీ ఆశలు అడియాశలు అయ్యేలా కనిపిస్తున్నాయి. ఇక దీపికా పదుకొణె మాత్రమే కల్కి సినిమాతో బలమైన పాత్ర పోషించింది. ఈ లెక్కన ఇక నుంచి టాలీవుడ్ హీరోల పాన్ ఇండియా సినిమా ఆఫర్లు వస్తే మాత్రం బాలీవుడ్ భామలు భయపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి.