బాలీవుడ్ ఫేమస్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ గుండె పోటుతో నేడు తెల్లవారు జామున ముంబయిలోని ఆమె ఇంట్లో మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కొన్ని రోజుల క్రితం అనారోగ్యం బారిన పడ్డ ఆమెకు కరోనా టెస్టులు నిర్వహించారు. ఆమెకు వైరస్ నెగటివ్ రావడంతో ఇటీవలే ఆమెను డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఆమె ఆరోగ్యం కుదుట పడ్డట్లుగా వైధ్యులు కూడా ప్రకటించారు.
గత నెల శ్వాససంబంధిత సమస్యతో హాస్పిటల్లో జాయిన్ అయ్యి కొన్ని రోజుల క్రితం డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన ఆమెకు గుండె పోటు రావడంతో మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. 71 ఏళ్ల సరోజ్ ఖాన్ దాదాపు 40 ఏళ్ల పాటు సినిమా పరిశ్రమలో కొనసాగారు. ఆమె దాదాపుగా 200 సినిమాలకు పని చేశారు. ఎన్నో అద్బుతమైన పాటలకు కొరియోగ్రఫీ అందించారు. అప్పటి బాలీవుడ్ స్టార్స్ అందరికి కూడా ఈమె కొరియోగ్రఫీ చేశారు. బాలీవుడ్ సినీ ప్రముఖులు సరోజ్ ఖాన్ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు.
446301 442009As I web site possessor I believe the topic material here is rattling amazing , appreciate it for your efforts. 5225
811263 511135Shame on the seek Google for now not positioning this put up higher! Come on over and consult with my web site. 409733