Switch to English

‘బాయ్స్‌ రూమ్’లో అసలేం జరిగిందంటే..

‘బాయ్స్‌ రూమ్’.. ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తోన్న అంశమిది. కరోనా వైరస్‌ కంటే అత్యంత ప్రమాదకరమైన విషయంగా దీన్ని పరిగణిస్తున్నారు చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు. ఓ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్ పై ‘సెక్సువల్‌ అసాల్ట్‌’కి సంబంధించిన చర్చ, విద్యార్థుల మధ్య జరిగింది. ఈ క్రమంలో ఓ విద్యార్థి పేరు తెరపైకొచ్చింది. అంతే, ఆ విద్యార్థి అవమాన భారం భరించలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు.

అసలు విషయాన్ని ఆరా తీస్తే, సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే విషయం వెలుగు చూసింది. ఓ బాలిక, బాలుడి పేరుతో ఛాట్‌ సెషన్‌ని స్టార్ట్‌ చేసింది. అందులో పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. ‘సెక్సువల్‌ అస్సాల్ట్‌’ అంటే లైంగిక వేధింపులకు ఎలా పాల్పడతారు.? ఎలా రేప్‌ చేస్తారు.? వంటి అంశాలపై ప్రశ్నలు, సమాధానాలు, ఫాంటసీలు.. అబ్బో పెద్ద కథే నడిచింది. ‘అబ్బాయిలు చెడిపోతున్నారు.. వారిని తల్లిదండ్రులు అదుపు చేయడంలేదు.. ఇలాంటివారి వల్లనే దేశం చెడిపోతుంది..’ అంటూ తొలుత ‘సోకాల్డ్‌ మేధావి వర్గం’ నోరు పారేసుకుంది.

చివరికి, దీనంతటికీ కారణం ఓ అమ్మాయి అని తేలేసరికి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.. సోకాల్డ్‌ మేధావి వర్గం అయితే, ఒక్కసారిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. నేరం ఎవరు చేసినా అది నేరమే. ఎవరు నేరం చేశారు.? అన్నది తేలకుండా, అబ్బాయి కాబట్టి నిందించడం మొదలు పెడితే ఇలాగే వుంటుంది. ఓ తల్లి తన బిడ్డను కోల్పోయిందిప్పుడు. ఆ తల్లికి సమాధానం చెప్పేదెవరు.? తప్పు జరిగిపోయింది.. కాదు కాదు, పెద్ద నేరమే జరిగిపోయింది.

పిల్లల్లో ఈ తరహా పెడధోరణలు ఎందుకు పుట్టుకొస్తున్నాయి.? అంటే, మనల్ని మనం నిందించుకోక తప్పదు. ఇంటర్నెట్‌ విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చేశాక, ఎవర్నీ కంట్రోల్‌ చేసే పరిస్థితి లేదు. ఆన్‌లైన్‌ క్లాసులు, ఇంకోటి.. వెరసి, ఇంటర్నెట్‌ని రకరకాలుగా పిల్లలు వాడేందుకు ఆస్కారమేర్పడుతోంది. ఒక్కసారి ఇంటర్నెట్‌లోకి ఎంటర్‌ అయితే, అంతా వాళ్ళిష్టమే. పిల్లల్ని అదుపు చేయడం తల్లిదండ్రులకి కష్టమే.

సినిమా

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

రాజకీయం

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...

ఎక్కువ చదివినవి

ఫ్లాష్ న్యూస్: ఏపీలో విమానం దిగాలంటే ఈ కండీషన్స్‌ తప్పనిసరి

నిన్నటి నుండి దేశీయ విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. అయితే కొన్ని కారణాల వల్ల ఏపీలో విమానాలు మొదలు కాలేదు. ఏపీకి రావాలంటే కొన్ని కండీషన్స్‌ ను పెడుతున్న నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య...

కరోనా అలర్ట్‌: ఇండియాలో లాక్‌డౌన్‌ అట్టర్‌ ఫ్లాప్‌.. అంతేనా.?

‘ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్లు నటించాయి.. ప్రజలు లాక్‌ డౌన్‌ పాటిస్తున్నట్లు నటించారు..’ అంటూ సోషల్‌ మీడియాలో కుప్పలు తెప్పలుగా మీమ్స్ కనిపిస్తున్నాయి. దేశంలో కరోనా తీవ్రతపై సెటైర్లు వేసుకునే సమయమా ఇది.?...

ఎన్టీఆర్‌ బర్త్‌డే.. నారా లోకేష్‌ రికార్డ్‌.!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ పుట్టినరోజునాడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్‌ సరికొత్త రికార్డులు సృష్టించారు.. అదీ సోషల్‌ మీడియాలో. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌ ప్రస్తుతం హీరోయిన్‌ పూజా కుమార్‌ తో...

గుడ్ న్యూస్: జూన్ నుంచి షూటింగ్స్ కి గ్రీన్ సిగ్నల్.!

నిన్ననే(మే 21న) సినిమాటోగ్రఫీ మినిస్టర్ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సినీ ప్రముఖులంతా కలిసి సినిమా షూటింగ్ ఎప్పటి నుంచి ప్రారంభించాలి, అలాగే థియేటర్స్ పరిస్థితిపై...