Bobby deol: ‘యానిమల్ సినిమాలో నన్ను ఎంచుకుని కూడా ఏడాదినరైనా పిలవలేదు. నన్ను తీసేసారేమో అనుకున్నా.. ఏడాదిన్నరపాటు ఒత్తిడికి లోనయ్యాన’ని బాబీ డియోల్ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..
‘సినిమా విడుదల సమయంలో మా అత్త చనిపోయారు. దీంతో నేను సక్సెస్ ఎంజాయ్ చేయలేకపోయాను. కానీ, నా పాత్రకు అంత పేరు రావడం సంతోషాన్నిచ్చింది. ఓరోజు సందీప్ నుంచి మెసేజ్ వస్తే నమ్మలేదు. ఫోన్ చేసి మాట్లాడుకుని కలుద్దామనుకున్నాం. ఓ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో నా ఫొటో తీసుకుని వచ్చాడు. అక్కడ నేనిచ్చిన స్టిల్ ఆధారంగానే నన్ను ఎంచుకున్నానని చెప్పాడు. నా గొంతే నాకు బలం. కానీ.. మాటలుండవని చెప్పినా పాత్ర నచ్చి నటించేందుకు ఒప్పుకున్నా’.
సినిమాలో నాకూ రణబీర్ కు మధ్య సన్నివేశాలు తెరకెక్కించింది కేవలం 12 రోజులే. పెద్ద సూపర్ స్టార్ అయినా కూడా చాలా వినయంగా ఉంటాడు. రణబీర్ నాకు చిన్నప్పటి నుంచీ తెలుసు కాబట్టి సెట్లో సరదాగా గడిచిపోయింది. నాకిష్టమైన జంట రణబీర్-అలియా’ అని చెప్పుకొచ్చాడు బాబీ.