సినిమా అంటే వ్యాపారం.. విజయవంతమైన సినిమాల విషయానికొస్తే, 2 శాతం వరకు మాత్రమే వుంటుంది.. అలాంటప్పుడు, నష్టాల్లో సినిమా వ్యాపారమెందుకు చెయ్యాలి.? అంటూ బులుగు జర్నలిజం ఓ అద్భుతమైన ప్రశ్న సంధించేసింది. దాంతో, ఒక్కసారిగా సినీ పరిశ్రమ షాక్‌కి గురయ్యింది.
ప్రశ్నిస్తోన్న బులుగు జర్నలిజం కూడా సినిమా రంగం నుంచి వచ్చే ఆదాయం మీదనే ఆధారపడి వుంది మరి.! సినిమా పబ్లిసిటీ కోసం మీడియాపై ఆధారపడటం కొత్తేమీ కాదు. కానీ, ఇటీవలి కాలంలో బ్లాక్‌మెయిలింగ్ జర్నలిజం ఎక్కువైపోయింది. సినిమా మీద అడ్డగోలు పుకార్లు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నాయి కొన్ని మీడియా సంస్థలు.
సినిమా పరిశ్రమపై మీడియా చల్లుతున్న బురద గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కరోనా కారణంగా సినిమా పరిశ్రమ ఎలాగైతే నష్టపోయిందో, మీడియా రంగం కూడా అలాగే నష్టపోయింది. కొన్ని మీడియా సంస్థలు ప్రింట్ ఎడిషన్లను ఎత్తేశాయి. కొన్ని మీడియా సంస్థలు.. రకరకాల మార్పులు చేసుకున్నాయి.. సిబ్బందిని తగ్గించుకున్నాయి.
నష్టాల్లోనూ మీడియా సంస్థలెందుకు నడుస్తున్నాయి.? మనుగడ కోసం ఎందుకు ఆరాటపడుతున్నాయి. సినిమా రంగం కూడా అంతే. ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో లక్షల రూపాయల జీతం తీసుకునే ఓ యువకుడు లేదా యువతి సినీ రంగం పట్ల ఆసక్తితో రెండు పడవల ప్రయాణం చేయడం చూస్తున్నాం. సినిమా అంటే ప్యాషన్. బులుగు మీడియా భావిస్తున్నట్లు అది ఫ్యాషన్ కానే కాదు.
ఒక్క సినిమా సంచలన విజయం సాధిస్తే, ఆ కోవలో వంద సినిమాలొస్తాయ్.. అదీ సినిమా అంటే. సినిమా రంగం కూడా సమాజంలో భాగమే. అక్కడా కొన్ని అక్రమాలు వుండొచ్చుగాక. వాటిని ప్రశ్నించడం తప్పు కాదు. నష్టమొస్తే సినిమాలెందుకు తియ్యాలి.? అన్న ప్రశ్న సంధించడం మూర్ఖత్వం.
221306 392254This weblog really is excellent. How was it created ? 592105
826463 817133you use a great blog here! do you wish to earn some invite posts on my small blog? 6364
630755 610922This internet page is often a walk-through for all of the details it suited you with this and didnt know who to ask. Glimpse here, and youll definitely discover it. 256776
86226 634085I always go to your blog and retrieve everything you post here but I never commented but today when I saw this post, I couldnt stop myself from commenting here. Great write-up mate! 689323