Switch to English

పవన్ కళ్యాణ్‌ని నిద్ర లేపుతున్నారట.. తన్నించుకోవాలి కదా మరి.!

లేపి తన్నించుకోవడమంటే ఇదే మరి.! ‘వకీల్ సాబ్’ సినిమా విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి కుట్రలు చేసిందో అందరికీ తెలిసిందే. టిక్కెట్ రేట్లను ‘వకీల్ సాబ్’ సినిమా కోసం గణనీయంగా తగ్గించింది వైఎస్ జగన్ ప్రభుత్వం. అప్పట్లో ఈ విషయమై పెద్దయెత్తున విమర్శలొస్తే, సామాన్యుడికి సినిమాని దూరం చేస్తారా.? టిక్కెట్ల రేట్లు పెంచి, ప్రేక్షకుల్ని దోచుకుంటారా.? అని వైసీపీ నేతలు ప్రశ్నించారు.

కరోనా నేపథ్యంలో ఆ తర్వాత సినిమాలేవీ విడుదల కాలేదు. మళ్ళీ ఇప్పుడు సినిమాల విడుదలకు రంగం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమలో టిక్కెట్ల రేట్ల అంశం అలజడి రేపుతోంది. ఓ ఎగ్జిబిటర్ పేరుతో ఓ బులుగు మీడియా కథనం తెరపైకొచ్చింది. పవన్ కళ్యాణ్ నిద్రపోతున్నారా.? అని ప్రశ్నించేశాడా పేరు చెప్పుకోవడానికి భయపడే ఎగ్జిబిటర్. పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడట. 50 కోట్ల పైన రెమ్యునరేషన్ పుచ్చుకునే స్టార్ హీరో పవన్ కళ్యాణ్ అట.

పవన్ కళ్యాణ్ స్టార్ హీరో అన్నది నిజం. జనసేన పార్టీ అధినేత అన్నదీ నిజమే. కానీ, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఇక్కడ. ఆ తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా తెలుగు సినీ పరిశ్రమలో ఓ అగ్రహీరో. పరిశ్రమకి పెద్ద దిక్కు అంటే తమ కుటుంబమే.. అంటారాయన. కానీ, బాలకృష్ణని నిద్ర లేపాలంటే, బులుగు మీడియాకి భయం. ఎక్కడ చాచి చెంప ఛెళ్ళు మనిపించేస్తాడోనని.

నిజానికి, పవన్ కళ్యాణ్.. ఈ టిక్కెట్ల గొడవలో బాధితుడు. పవన్ సినిమాని వైసీపీ దెబ్బకొట్టింది. పవన్ తరఫున మొత్తం సినీ పరిశ్రమ మాట్లాడాల్సి వుంది. కానీ, మాట్లాడలేదు. అప్పట్లో ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన బులుగు మీడియానే, ఇప్పుడు మొత్తం సినీ పరిశ్రమ తరఫున వకాల్తా పుచ్చుకుని, పవన్ కళ్యాణ్‌ని ప్రశ్నిస్తోంది. సిగ్గు.. శరం.. అనేవి ఏమన్నా వుంటే, ప్రశ్నించాల్సింది ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మాత్రమే.

అంత సీన్ ఎటూ బులుగు మీడియాకి వుండదు. ఇక్కడ ఓ విషయం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. ఏ సమస్య అయినా, పవన్ కళ్యాణ్ నిలబడితే.. ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుందని బులుగు మీడియా కూడా భావిస్తుండడం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

బిగ్ బాస్: షన్ను ఎందుకు సిరిని దూరం పెడుతున్నాడు!!

బిగ్ బాస్ సీజన్ 5 ప్రస్తుతం ఫుల్ హవాలో ముందుకు సాగుతోంది. మూడో వారంలోకి ఎంటర్ అయింది బిగ్ బాస్. లగ్జరీ బడ్జెట్ టాస్క్ సరదా...

వంశీ స్క్రిప్ట్ విజయ్ కు నచ్చలేదా?

మహర్షితో సూపర్ డూపర్ హిట్ కొట్టిన వంశీ పైడిపల్లి కొంత బ్రేక్ తర్వాత మహేష్ కోసం ఒక స్క్రిప్ట్ రెడీ చేయగా అది తనకు నచ్చలేదు....

మరోసారి ఫ్యామిలీ మ్యాన్ గా మారనున్న రవితేజ

మాస్ మహారాజా రవితేజ క్రాక్ చిత్రంతో బౌన్స్ బ్యాక్ అయిన విషయం తెల్సిందే. కరోనా నేపథ్యంలో విడుదలైనా కూడా క్రాక్ అద్భుతమైన కలెక్షన్స్ ను సాధించింది....

ఎన్టీఆర్-కొరటాల శివ చిత్రానికి ముహూర్తం కుదిరిందిగా!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్ లో చిత్రం అనౌన్స్ అయిన విషయం తెల్సిందే. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్...

మహేష్ చిత్రం కోసం త్రివిక్రమ్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడే

మహేష్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ కు స్పెషల్ క్రేజ్ ఉంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు కల్ట్ క్లాసిక్స్ స్టేటస్ ను అందుకున్నాయి....

రాజకీయం

బాలయ్యా.. రాజీనామా చెయ్.! వైసీపీ బస్తీ మే సవాల్.!

హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యాలట. తద్వారా ఏర్పడే ఉప ఎన్నికల్లో బాలయ్య గెలిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ వైసీపీ నేత, ఎమ్మెల్సీ...

ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైఎస్సార్సీపీది అదే వ్యూహమా.?

2019 ఎన్నికల సమయంలో అప్పటి అధికార తెలుగుదేశం పార్టీ నుంచి టిక్కెట్లు ఖరారైన అభ్యర్థులు, సొంత పార్టీని కాదనుకుని.. వైసీపీలోకి దూకేసిన విషయం విదితమే. చివరి నిమిషంలో ఈ గోడ దూకుడు వ్యవహారాలు...

60 – 40: పచ్చ మీడియాకి బులుగు కామెర్లు.!

అది పచ్చ మీడియాకి చెందిన ఓ ప్రముఖ మీడియా సంస్థ. బులుగు రంగు అంటే అస్సలు గిట్టదు ఆ పార్టీకి. కానీ, ఇదంతా పైకి కనిపించే వ్యవహారం. తెరవెనుకాల అసలు కథ వేరే...

దండయాత్రకీ.. వినతి పత్రానికీ తేడా తెలియట్లేదా.?

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఇంటిపై ‘దండయాత్ర’ కోసం వెళ్ళారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. ఈ ఘటన వెనుక ‘పొలిటికల్ స్కెచ్’ ఏంటి.? అన్నది వేరే చర్చ. కానీ, ఆ దాడినీ.. దండయాత్రనీ,...

ప్రభుత్వ విక్రయం: నెయ్యి ఇడ్లీ, గట్టి చట్నీ, చేపల పులుసు.!

‘చిత్ర నిర్మాణం కోసం హీరో హీరోయిన్లు మొదలుకుని, ఆఖరి వ్యక్తి వరకూ చెల్లించే మొత్తాన్ని నిర్మాత నుంచి ప్రభుత్వం జమ చేయించుకుని, ఆన్‌లైన్‌లో టిక్కెట్ల మాదిరిగా వారి బ్యాంకు ఖాతాలోకి వెళ్ళేలా చూస్తే...

ఎక్కువ చదివినవి

బాలయ్యా.. రాజీనామా చెయ్.! వైసీపీ బస్తీ మే సవాల్.!

హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యాలట. తద్వారా ఏర్పడే ఉప ఎన్నికల్లో బాలయ్య గెలిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ వైసీపీ నేత, ఎమ్మెల్సీ...

రోహిత్‌ వైస్‌ కెప్టెన్ గా వద్దన్న కోహ్లీ

టీమ్‌ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అతి త్వరలో టీ20 ఫార్మట్ కెప్టెన్సీ నుండి తప్పకుంటాడనే వార్తలు వస్తున్నాయి. ఆయన కూడా ఆ వార్తలను నిర్థారించాడు. అయితే టీ20 వరల్డ్‌ కప్ ముగిసిన...

జ్యూడీషియల్ విచారణ..! నిందితుడు రాజు మృతిపై హైకోర్టు ఆదేశం

సైదాబాద్ ఆరేళ్ల చిన్నారి హత్యాచార ఘటనలో నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై జ్యూడీషియల్ విచారణకు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. ఈమేరకు వరంగల్ మూడో మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కు...

మరోసారి ఫ్యామిలీ మ్యాన్ గా మారనున్న రవితేజ

మాస్ మహారాజా రవితేజ క్రాక్ చిత్రంతో బౌన్స్ బ్యాక్ అయిన విషయం తెల్సిందే. కరోనా నేపథ్యంలో విడుదలైనా కూడా క్రాక్ అద్భుతమైన కలెక్షన్స్ ను సాధించింది. క్రాక్ ఇచ్చిన ఉత్సాహంతో రవితేజ వరసగా...

చిన్నారిని హింసించిన వ్యక్తికి శిక్షపడేలా చేసిన హరీష్ శంకర్

దర్శకుడు హరీష్ శంకర్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. సినిమాలకు సంబంధించి మాత్రమే కాకుండా సమాజంలో జరిగే విషయాలపై కూడా స్పందిస్తుంటారు. రీసెంట్ గా వెలుగులోకి వచ్చిన ఒక ఘటనపై హరీష్...