రుషికొండ బీచ్.. విశాఖపట్నంలో అత్యంత సుందరమైన బీచ్‌లలో ఇది కూడా ఒకటి.! గతంలో, ఈ రుషికొండ బీచ్‌లో పర్యాటకుల కోసం పలు సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రుషికొండ బీచ్‌కి ప్రతిష్టాత్మకమైన ‘బ్లూ ఫ్లాగ్’ గుర్తింపు దక్కింది. అంతర్జాతీయ సంస్థ ఒకటి ఈ గుర్తింపుని ఇస్తుంటుంది.
అయితే, కొద్ది రోజుల క్రితం బీచ్‌లో సౌకర్యాల లేమి.. అంటూ, కొందరు సదరు సంస్థకు ఫిర్యాదులు చేశారు. దాంతో, తాత్కాలికంగా బ్లూ ఫ్లాగ్‌ని రద్దు చేస్తున్నట్లు సదరు సంస్థ ప్రకటించింది. ఇంకేముంది, ఈ విషయమై రాజకీయ రాద్ధాంతం జరిగింది. మరీ ముఖ్యంగా వైసీపీ, సోషల్ మీడియా వేదికగా కూటమిపై చేసిన దుష్ప్రచారం అంతా ఇంతా కాదు.
నిజానికి, బీచ్‌లో సౌకర్యాల లేమి.. అంటూ ఫొటోలు తీసి, సదరు సంస్థకు ఫిర్యాదు చేసింది వైసీపీ మద్దతుదారులేనన్న విమర్శలున్నాయి. కారణాలేవైతేనేం, బీచ్‌కి వున్న బ్లూ ఫ్లాగ్ రద్దయ్యింది. దాంతో, ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
మంత్రి కందుల దుర్గేష్, వీలైనంత త్వరగా బ్లూ ఫ్లాగ్‌ని పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు. అధికారులు, మంత్రి ఆదేశాలతో హుటాహుటిన, బీచ్‌లో సౌకర్యాల్ని మెరుగు పరిచేందుకు చర్యలు చేపట్టారు.
కట్ చేస్తే, నెల రోజుల వ్యవధిలోనే, బ్లూ ఫ్లాగ్‌ని రిషికొండ బీచ్‌లో పునరుద్ధరించగలిగింది కూటమి ప్రభుత్వం. దాంతో, పర్యాటకులు కూటమి ప్రభుత్వం పని తీరు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క, సుందర విశాఖ తీరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్ది, పర్యాటకులకు స్వర్గధామంలా మార్చేందుకు, కూటమి ప్రభుత్వం మాస్టర్ ప్లాన్‌ని సిద్ధం చేస్తోంది.
రిషికొండ బీచ్‌కి ఆనుకునే, వైసీపీ హయాంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం కోసం సుమారు 500 కోట్ల రూపాయలతో ప్యాలెస్ నిర్మించిన సంగతి తెలిసిందే. కొండని తొలిచి మరీ తవ్విన రిషికొండ ప్యాలెస్ చుట్టూ వున్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు.