ప్రజారోగ్యానికి అనారోగ్యశ్రీ.! ‘వైద్యం’ ముసుగులో బ్లాక్‌మెయిలింగ్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,098FansLike
57,764FollowersFollow

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తెరపైకొచ్చింది ఆరోగ్యశ్రీ పథకం.! పేదవాడికీ, అత్యాధునిక వైద్యం అందించాలన్న సదుద్దేశ్యంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టి వుండొచ్చు. కానీ, ప్రజారోగ్యం కోసం ప్రభుత్వాలు వేల కోట్లు ఖర్చు చేస్తున్నాయి కదా.? అలాంటప్పుడు, కొత్తగా ప్రైవేటు ఆసుపత్రులు బాగుపడేందుకోసం ఈ ఆరోగ్యశ్రీ ఎందుకు.?

నిజమే, పేదవాడికి కూడా అత్యాధునిక వైద్య సౌకర్యాలు అందుబాటులో వుండాలి. అది, ప్రభుత్వాసుపత్రుల్లో అందినప్పుడే పేదలకు ప్రయోజనం. ప్రైవేటు ఆసుపత్రుల్లో పేదల్ని ఎలా చూస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

చిన్న చిన్న అనారోగ్య సమస్యలకీ సర్జరీల వరకూ తీసుకెళ్తాయి చాలా ప్రైవేటు ఆసుపత్రులు. ఆరోగ్యశ్రీ ముసుగులో ప్రైవేటు దోపిడీ గురించి ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోనూ చాలా చర్చ జరిగింది. రాజకీయ నాయకుల కనుసన్నల్లో నడుస్తున్న ప్రైవేటు ఆసుపత్రులైతే, ఆరోగ్యశ్రీ కారణంగా చాలా బాగుపడ్డాయ్.
ఆరోగ్యశ్రీ పథకం కింద జరిగిన చాలా శస్త్ర చికిత్సలు, ప్రజారోగ్యాన్ని దెబ్బ తీశాయన్నది నిర్వివాదాంశం. ‘ఆరోగ్యశ్రీ వర్తించాలంటే, సర్జరీ తప్పనిసరి’ అనే ‘తప్పనిసరి సూచన’ ప్రైవేటు ఆసుపత్రుల నుంచి చాలామంది రోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఎదురవుతోందన్నది కాదనలేని వాస్తవం.

ప్రతి యేటా వందల కోట్లు, వేల కోట్లు.. ఆరోగ్యశ్రీ పథకం కింద, ప్రైవేటు ఆసుపత్రులకు వెళుతున్నాయ్. మరి, ఇన్ని వందల వేల కోట్లతో ఎన్ని ఆసుపత్రుల్ని కొత్తగా నిర్మించొచ్చు.? ప్చ్.. ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచనే చేయడంలేదు.

వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఆరోగ్యశ్రీ వల్ల వృధా అవుతోంటే, అవన్నీ మింగేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులు తిరిగి అప్పుడప్పుడూ ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్ చేస్తుండడం ఆశ్చర్యకరం. నెట్‌వర్క్ ఆసుపత్రులు సూది, సిరెంజిలకు కూడా డబ్బుల్లేక విలవిల్లాడుతున్నాయంటూ తాజాగా, ప్రభుత్వానికి నెట్‌వర్క్ ఆసుపత్రులు లేఖాస్త్రం సంధించాయ్. మరి, వేల కోట్లు ఏమైపోతున్నట్టు.?

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. ఆరోగ్యశ్రీ అంటే, ప్రజారోగ్యానికి అనారోగ్యశ్రీ అనే అర్థం. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి ప్రైవేటు ఆసుపత్రులు ఎదిగాయంటే, ఆ పాపం ఆరోగ్యశ్రీ పథకాన్ని కొనసాగిస్తున్న పాలకులదే.

ప్రభుత్వాసుపత్రుల్లో జెనెరిక్ మందులకు అధిక ప్రాధాన్యతనిస్తుంటారు. అదే ప్రైవేటు ఆసుపత్రులైతే అత్యంత ఖరీదైన మందుల వైపే మొగ్గు చూపుతారు. ఇవన్నీ ప్రభుత్వానికి తెలియనివేమీ కావు. కానీ, ప్రభుత్వాసుపత్రులపై పాలకులకు మమకారం వుండటంలేదు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. ఆరోగ్యశ్రీ అనే అనారోగ్యానికి సరైన మందు కనిపెట్టి, ప్రజారోగ్యానికి సరైన చికిత్సని ప్రభుత్వాలు చేయలేకపోతే.. నష్టం అంచనాలకు అందదు.!

764 COMMENTS

సినిమా

రష్మిక ‘కాక్టెయిల్ 2’ అప్‌డేట్: సిసిలీలో ఫుల్ జోష్ షూట్!

నటి Rashmika Mandanna తన కొత్త సినిమా కాక్టెయిల్ 2 గురించి ఆసక్తికరమైన అప్‌డేట్ ఇచ్చారు. తన పాత్ర ‘దియా’ డైరీ నుంచి ఒక భాగాన్ని...

Meenakshi Seshadri: ‘ఆపద్భాంధవుడు’ పాట మీద ఇష్టం తో రీల్ చేసిన...

Meenakshi Seshadri: మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఒక ఆణిముత్యం ‘ఆపద్భాంధవుడు’. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలో చిరంజీవి పాత్ర పల్లెల్లో అందమైన పొలాల మధ్య పారే...

“గాయాల మచ్చలతోనే గ్లామర్… నభా నటేష్ న్యూ స్టిల్స్ వైరల్!”

తన అందం, నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన Nabha Natesh తాజాగా విడుదల చేసిన స్టిల్స్‌తో మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా, గతంలో ఎదుర్కొన్న...

Peddi: మరోసారి ‘పెద్ది’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ పై మేకర్స్...

Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా ‘పెద్ది’. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా విడుదల...

‘హుషారు 2’లో అశోక్ గల్లా… హైదరాబాద్‌లో షూటింగ్ జోరుగా

యువ హీరో Ashok Galla ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం “హుషారు 2” ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారుతోంది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా...

రాజకీయం

“కంపెనీలను తరిమేస్తారా?”: లోకేష్ ఫైర్, జగన్‌పై తీవ్ర విమర్శలు

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల వాతావరణంపై మంత్రి Nara Lokesh తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశ రక్షణకు అవసరమైన అధునాతన బోట్లు తయారు చేసే కంపెనీ రాష్ట్రానికి రావాలనుకుంటే స్వాగతించాల్సింది పోయి, అడ్డుకుంటామని చెప్పడం...

జనసేన స్పోక్స్‌పర్సన్స్‌కు స్పెషల్ ట్రైనింగ్… వర్క్‌షాప్ ముగింపు

విజయవాడలో రెండు రోజుల పాటు నిర్వహించిన జనసేన పార్టీ అధికార ప్రతినిధుల శిక్షణ వర్క్‌షాప్ విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి అధికార ప్రతినిధులు, ఔత్సాహిక నాయకులు పాల్గొని...

వైఎస్ జగన్ మకాం హైద్రాబాద్‌కి.! సూచించిన ‘పండితుడు’ ఎవరో.?

మొన్నీమధ్యనే ఓ పండితుడు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఉత్తరాదికి చెందిన ఆ పండితుడ్ని, వైసీపీకి గతంలో ‘సలహాదారు’గా పని చేసిన ‘పీకే’ అలియాస్ ప్రశాంత్ కిషోర్...

“ఈ పదవి అదృష్టం కాదు… కృషి ఫలితం”: లోకేష్ వ్యాఖ్యలు

చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో Nara Lokesh కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి స్థానిక కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన,...

“కార్యకర్త నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ వరకు… లోకేష్ ప్రయాణం”

తెలుగుదేశం పార్టీలో సాధారణ కార్యకర్తగా ప్రారంభమైన ప్రయాణం అత్యున్నత స్థాయికి ఎలా తీసుకెళ్లగలదో నేటి పరిస్థితులు స్పష్టంగా చూపిస్తున్నాయి. ఆ ఉదాహరణగా నిలిచిన పేరు Nara Lokesh. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి...

ఎక్కువ చదివినవి

నాగార్జున 100వ చిత్రం ‘లాటరీ కింగ్’.. దసరాకు గ్రాండ్ రిలీజ్!

టాలీవుడ్ కింగ్ నాగార్జున తన 100వ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి లాటరీ కింగ్ అనే టైటిల్ ఖరారైనట్టు సమాచారం. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉండగా,...

Daily Horoscope: వృషభం వారికి ఆర్థిక లాభాలు… ధనుస్సు వారికి కొత్త అవకాశాలు

ఏప్రిల్ 15 , 2026 బుధవారం రాశిఫలాలు ఈ రోజు చాంద్రమాన పంచాంగం ప్రకారం గ్రహస్థితులు కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ జీవితం వంటి విషయాల్లో మార్పులు కనిపించవచ్చు....

రోడ్డు కట్‌పై రచ్చ… నాణ్యతా పరీక్షలే అంటూ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వివరణ

రాష్ట్రంలో రహదారుల నిర్మాణంపై జరుగుతున్న ప్రచారాలపై ఉప ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టత ఇచ్చింది. కొన్ని వర్గాలు, అనుకూల మీడియా సంస్థలు రోడ్లలో కనిపిస్తున్న కట్‌లను నిర్మాణ లోపాలుగా చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని...

Ram Charan: “బాలీవుడ్‌లోకి రామ్ చరణ్..! భన్సాలీ ప్రొడక్షన్‌లో భారీ ప్లాన్..!”

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో భారీ ప్రాజెక్టులో భాగమవుతున్నారా..? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. భారీ చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో రామ్ చరణ్...

“యుద్ధానికి సన్నద్ధం… హార్ముజ్‌లో దిగ్బంధం” : Donald Trump తాజా హెచ్చరికలు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి

అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump తాజాగా యుద్ధ పరిస్థితులపై చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. తన సోషల్ మీడియా వేదిక ద్వారా ఆయన వెల్లడించిన సమాచారం ప్రకారం, ఇరాన్‌తో జరిగిన...