ఆంధ్రప్రదేశ్ లో బలోపేతం కావాలని యోచిస్తున్న భారతీయ జనతాపార్టీ రూటు మార్చింది. తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేసి ఆ స్థానంలోకి వెళ్లాలని భావిస్తున్న కమలం పార్టీ.. ప్లాన్ బి అమల్లోకి తెచ్చింది. టీడీపీ ఎమ్మెల్యేలను తన పార్టీలోకి చేర్చుకోవడానికి ప్రధాన అడ్డంకిగా ఉన్న ఏపీ సీఎం జగన్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తోంది. ప్రభుత్వ నిర్ణయాలు టార్గెట్ గా ఆ పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం బీజేపీ ప్రయత్నాలు సాగిస్తున్న సంగతి తెలిసిందే.
వాస్తవానికి ఆ పార్టీకి తెలంగాణలో ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉండగా.. ఏపీలో ఒక్కరూ లేరు. అయినప్పటికీ ఇతర పార్టీల నేతలను ఆకర్షించడం ద్వారా తన లక్ష్యం నెరవేర్చుకునే దిశగా కాషాయదళం కదులుతోంది. 2022లోనే దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు జరుగుతాయనే ఊహాగానాల నేపథ్యంలో ఏపీలో బీజేపీ తన దూకుడు పెంచింది. తొలుత టీడీపీని నిర్వీర్యం చేసి, తర్వా వైఎస్సార్ సీపీ సంగతి చూద్దామని భావించిన కమలనాథులు.. తాజాగా వ్యూహం మార్చారు.
ఇప్పటివరకు వైఎస్సార్ సీపీతో సత్సంబంధాలు మెయింటైన్ చేసిన కాషాయ నేతలు.. ఆ పార్టీతో ఢీ అంటే ఢీ అంటున్నారు. ఈ మేరకు కేంద్ర పెద్దల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర బీజేపీ నేతలు వైఎస్సార్ సీపీ నిర్ణయాలను విమర్శిస్తున్నారు. కరకట్టపై నిర్మించిన ప్రభుత్వం భవనం ప్రజావేదిక కూల్చివేత తొందరపాటు నిర్ణయంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శ చేయడంతో బీజేపీ లక్ష్యం ఏమిటో అర్థమైంది. అప్పటినుంచి క్రమంగా విమర్శల వేడి మరింత పెంచారు.
కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి సైతం జగన్ తీరును తూర్పారబట్టారు. ఇక బీజేపీ సీనియర్ నేత రాంమాధవ్ కూడా జగన్ పాలనను విమర్శించారు. టీడీపీ అరాచకాలకు జనం విసిగిపోయి వైఎస్సార్ సీపీకి అధికారం అప్పగిస్తే, ఇప్పుడు కూడా అలాంటి పాలనే సాగుతోందంటూ వీరంతా విమర్శలు చేస్తున్నారు. వీటన్నింటినీ చూస్తే కేంద్ర పెద్దల ఆదేశంతోనే వీరు ఇలా మాట్లాడుతున్నారని అంటున్నారు. టీడీపీ నేతలు బీజేపీలో చేరడానికి జగన్ తీసుకున్న నిర్ణయం అడ్డంకిగా మారిన నేపథ్యంలోనే బీజేపీ తన రూటు మార్చిందని చెబుతున్నారు.
తొలుత టీడీపీ, తర్వాత వైఎస్సార్ సీపీ సంగతి చూద్దామని భావించినా.. పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో వైఎస్సార్ సీపీని కూడా లక్ష్యంగా చేసుకోవాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు జగన్ సైతం కేంద్రంతో ఢీకొట్టే యోచనలో ఉన్నారనే టాక్ వినపడుతోంది. అయితే, ఆయనపై కేసులు ఉన్న విషయంలో కేంద్రంపై దూకుడు ప్రదర్శించే అవకాశం లేదనే ప్రచారం కూడా సాగుతోంది. మొత్తమ్మీద రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా మారే అవకాశం కనిపిస్తోంది.
2789 615319Thank you a lot for sharing this with all folks you truly recognize what you are speaking about! Bookmarked. Please moreover speak more than with my web web site =). We could have a hyperlink alternate arrangement among us! 471444
587698 559484But a smiling visitor here to share the enjoy (:, btw wonderful pattern . 641214
78370 455791hey there i stumbled upon your web site looking about the internet. I wanted to tell you I enjoy the look of things about here. Keep it up will bookmark for certain. 637905
703269 807000Thanks for some other great post. Exactly where else may possibly just anyone get that type of info in such an ideal indicates of writing? Ive a presentation next week, and Im at the search for such info. 965221
268568 935525I used to be recommended this web site by my cousin. Im no longer confident whether this put up is written by way of him as nobody else know such exact approximately my difficulty. You are remarkable! Thank you! 841744
596307 796132I love your writing style truly enjoying this web site . 581874