Switch to English

జనసేనను విస్మరించిన ఏపీ బీజేపీ డైవర్షన్ రాజకీయం.!

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా ఎదగాలనకుంటోంది రాజకీయంగా.? అన్నప్రశ్నకు బీజేపీ నేతల దగ్గరే సరైన సమాధానం లేదు. మిత్రపక్షం జనసేనతో కలిసి 2024 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తామని మాత్రమే చెబుతోంది బీజేపీ. నిరుద్యోగ సమస్యలు సహా, ప్రజల తరఫున పోరాటం చేయడంలో జనసేన పార్టీ ఎప్పుడూ ముందుంటోంది. మరి, బీజేపీ ఏం చేస్తోంది.? దేవాలయాల సందర్శనతో బిజీగా వుంది.

మొన్న పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో పర్యటించి మమ అనిపించేసిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఇప్పుడు దేవాలయాల సందర్శనలో బిజీగా వున్నారు. మరోపక్క, ‘గో హత్యకు’ నిరసనగా ఉద్యమాల్లో బీజేపీకి చెందిన ఇతర ముఖ్య నేతలు బిజీగా వున్నారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో, మిత్రపక్షం జనసేనతో కలిసి బీజేపీ, రాష్ట్రంలో ప్రజల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది పోయి, ఈ డైవర్షన్ పాలిటిక్స్ ద్వారా బీజేపీ ఏం చేయాలనుకుంటోంది.? ఎవరికి సహకరించాలనుకుంటోంది.?

ఏపీ బీజేపీ, విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకమని చెబుతోంది. కానీ, కేంద్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ స్టీలు ప్లాంటుని ప్రైవేటీకరిస్తామంటోంది. కేంద్రంలో బీజేపీ ఒకలా, ఏపీలో బీజేపీ ఇంకోలా.. వెరసి, మిత్రపక్షం జనసేన, బీజేపీ వైపు చూడలేని పరిస్థితి. బీజేపీ అయితే, జనసేనను పూర్తిగా పక్కన పెట్టేసినట్లే కనిపిస్తోంది తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక తర్వాత.

ఇక, రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం పైనా, తాడేపల్లిలో పేదల గూడు కొల్లగొడుతున్న అధికార పార్టీ, ప్రశ్నిస్తున్నవారిపై కేసులు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలున్నాయి.. బీజేపీ, జనసేన కలిసి ప్రభుత్వంపై పోరాడేందుకు. ఓ వైపు నిరుద్యోగులు, జగన్ సర్కార్ తెచ్చిన జాబ్ క్యాలెండర్ మీద అలుపెరగని పోరాటం చేస్తున్నారు. వారికి అండగా జనసేన నిలబడుతోంది.. కానీ, బీజేపీ ఇక్కడ గాయబ్ అవుతోంది.

చూస్తోంటే, అసలు ఏపీ రాజకీయాలపై బీజేపీకి పెద్దగా ఆసక్తి లేనట్లే కనిపిస్తోంది. అయినాగానీ, 2024లో జనసేనతో కలిసి ఏపీలో అధికారంలోకి వస్తామని బీజేపీ చెబుతోంది. ఎలా.? ఎలా సాధ్యమవుతుందది రాష్ట్ర స్థాయిలో ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో పోరాడకుండా.?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

బిగ్ బాస్: షన్ను ఎందుకు సిరిని దూరం పెడుతున్నాడు!!

బిగ్ బాస్ సీజన్ 5 ప్రస్తుతం ఫుల్ హవాలో ముందుకు సాగుతోంది. మూడో వారంలోకి ఎంటర్ అయింది బిగ్ బాస్. లగ్జరీ బడ్జెట్ టాస్క్ సరదా...

వంశీ స్క్రిప్ట్ విజయ్ కు నచ్చలేదా?

మహర్షితో సూపర్ డూపర్ హిట్ కొట్టిన వంశీ పైడిపల్లి కొంత బ్రేక్ తర్వాత మహేష్ కోసం ఒక స్క్రిప్ట్ రెడీ చేయగా అది తనకు నచ్చలేదు....

మరోసారి ఫ్యామిలీ మ్యాన్ గా మారనున్న రవితేజ

మాస్ మహారాజా రవితేజ క్రాక్ చిత్రంతో బౌన్స్ బ్యాక్ అయిన విషయం తెల్సిందే. కరోనా నేపథ్యంలో విడుదలైనా కూడా క్రాక్ అద్భుతమైన కలెక్షన్స్ ను సాధించింది....

ఎన్టీఆర్-కొరటాల శివ చిత్రానికి ముహూర్తం కుదిరిందిగా!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్ లో చిత్రం అనౌన్స్ అయిన విషయం తెల్సిందే. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్...

మహేష్ చిత్రం కోసం త్రివిక్రమ్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడే

మహేష్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ కు స్పెషల్ క్రేజ్ ఉంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు కల్ట్ క్లాసిక్స్ స్టేటస్ ను అందుకున్నాయి....

రాజకీయం

బాలయ్యా.. రాజీనామా చెయ్.! వైసీపీ బస్తీ మే సవాల్.!

హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యాలట. తద్వారా ఏర్పడే ఉప ఎన్నికల్లో బాలయ్య గెలిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ వైసీపీ నేత, ఎమ్మెల్సీ...

ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైఎస్సార్సీపీది అదే వ్యూహమా.?

2019 ఎన్నికల సమయంలో అప్పటి అధికార తెలుగుదేశం పార్టీ నుంచి టిక్కెట్లు ఖరారైన అభ్యర్థులు, సొంత పార్టీని కాదనుకుని.. వైసీపీలోకి దూకేసిన విషయం విదితమే. చివరి నిమిషంలో ఈ గోడ దూకుడు వ్యవహారాలు...

60 – 40: పచ్చ మీడియాకి బులుగు కామెర్లు.!

అది పచ్చ మీడియాకి చెందిన ఓ ప్రముఖ మీడియా సంస్థ. బులుగు రంగు అంటే అస్సలు గిట్టదు ఆ పార్టీకి. కానీ, ఇదంతా పైకి కనిపించే వ్యవహారం. తెరవెనుకాల అసలు కథ వేరే...

దండయాత్రకీ.. వినతి పత్రానికీ తేడా తెలియట్లేదా.?

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఇంటిపై ‘దండయాత్ర’ కోసం వెళ్ళారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. ఈ ఘటన వెనుక ‘పొలిటికల్ స్కెచ్’ ఏంటి.? అన్నది వేరే చర్చ. కానీ, ఆ దాడినీ.. దండయాత్రనీ,...

ప్రభుత్వ విక్రయం: నెయ్యి ఇడ్లీ, గట్టి చట్నీ, చేపల పులుసు.!

‘చిత్ర నిర్మాణం కోసం హీరో హీరోయిన్లు మొదలుకుని, ఆఖరి వ్యక్తి వరకూ చెల్లించే మొత్తాన్ని నిర్మాత నుంచి ప్రభుత్వం జమ చేయించుకుని, ఆన్‌లైన్‌లో టిక్కెట్ల మాదిరిగా వారి బ్యాంకు ఖాతాలోకి వెళ్ళేలా చూస్తే...

ఎక్కువ చదివినవి

శంషాబాద్ ఓఆర్ఆర్ పై కారు దగ్దం..! వ్యక్తి సజీవ దహనం

హైదరాబాద్ లోని శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. శనివారం జరిగిన ఈ సంఘటన వివరాల్లోకి వెళ్లే.. ఓఆర్ఆర్ రెండో లైనులో...

కౌంటింగ్ వేళ ప్రభుత్వానికి షాక్..! ఫోన్ సర్వీస్ ఆపేసిన ప్రొవైడర్లు

ఓపక్క ఏపీలో పరిషత్ ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంటే.. మరోపక్క సమాచార శాఖ ఫోన్లు కనెక్షన్లు కట్ చేసి సర్వీస్ ప్రొవైడర్లు ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సమాచార శాఖ ఫోన్లు పని...

“గుడికి వచ్చి… బుద్దుందా?” సమంత ఫైర్

ప్రముఖ నటి సమంతకు దైవ భక్తి ఎక్కువే. గతంలో చాలా సార్లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమంత మరోసారి ఈరోజు తిరుమల వెళ్ళింది. అయితే అక్కడ రిపోర్టర్లు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు....

చరణ్, మహేష్ బాటలో ఎన్టీఆర్ కు ప్రభాస్?

యంగ్ టైగర్ ఎన్టీఆర్  హోస్ట్ చేస్తోన్న ఎవరు మీలో కోటీశ్వరులు షో విజయవంతంగా కొనసాగుతోన్న విషయం తెల్సిందే. ఈ షో మొదటి ఎపిసోడ్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విచ్చేయగా...

‘డేగల బాబ్జీ’గా బండ్ల గణేశ్..! అదరగొడుతున్న ఊరమాస్ లుక్

బండ్ల గణేశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ‘డేగల బాబ్జి’ అనే టైటిల్, బండ్ల గణేశ్ ఫస్ట్ లుక్ ను...