Switch to English

బీజేపీనా.? వైసీపీనా? జెడి లక్ష్మినారాయణ చేరేది ఏ పార్టీలో.?

అసలు పేరు వివి లక్ష్మినారాయణ అయినా, సీబీఐ జేడీగా పనిచేసినందున ఆ ‘జెడి’ అలా ఇంటి పేరులా మారిపోయిందాయనకి. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున విశాఖపట్నం నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయిన లక్ష్మినారాయణ, ఎక్కువ కాలం జనసేన పార్టీలో వుండలేకపోయారు. ‘ఫుల్‌ టైమ్ పాలిటిక్స్‌ చేయాలనుకున్నాను.. కానీ, అక్కడ కుదరలేదు..’ అంటూ జనసేన నుంచి బయటకు రావడానికి ‘కారణాన్ని’ తనదైన స్టయిల్లో వెతుక్కున లక్ష్మినారాయణ, ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేకపోయినా, ప్రజలకు దగ్గరగానే వున్నానని చెబుతుండడం గమనార్హం.

ప్రధాని నరేంద్ర మోడీ, ప్రపంచ పటంలో భారతదేశానికి ప్రత్యేక స్థానం కల్పించారన్నది లక్ష్మినారాయణ అభిప్రాయం. మరోపక్క, కరోనా వైరస్‌ వేళ రాష్ట్ర ప్రభుత్వం (వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం)తో అన్ని రాజకీయ పార్టీలూ కలిసి పనిచేయాలని పిలుపునిస్తున్నారు. అదే సమయంలో విపక్షాలు ఇచ్చిన సూచనలు, సలహాల్ని ప్రభుత్వం స్వీకరించాలి తప్ప, ఎదురుదాడి చేయకూడదని చెబుతున్నారు.

ఇంతకీ, లక్ష్మినారాయణ ఏ పార్టీలో చేరబోతున్నారు.? ఈ ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, ‘నాకంటూ ఖచ్చితమైన అభిప్రాయాలు, కార్యాచరణ వున్నాయి. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలూ చెబుతాను..’ అని అన్నారు. బీజేపీలో చేరతారా.? వైసీపీలో చేరతారా.? అన్న ప్రశ్నలకు ఆయన స్పష్టమైన సమాధానమివ్వలేదు.

అయితే, 2024లో వైఎస్సార్సీపీ నుంచి విశాఖ లోక్‌సభ బరిలోకి ఆయన దిగడం ఖాయమన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ‘నేను విశాఖ నుంచే పోటీ చేస్తాను.. ఏ పార్టీ అన్నది ముందు ముందు మీకే తెలుస్తుంది.. అది నాకు హోమ్ గ్రౌండ్‌ లాంటిది. అక్కడ నాకు అడ్వాంటేజ్‌ వుండడం సహజమే కదా..’ అని తనదైన శౖలిలో చెప్పుకొచ్చారు జేడీ లక్ష్మినారాయణ.

ఇదిలా వుంటే, బీజేపీ నుంచి జెడి లక్ష్మినారాయణకు గతంలోనే ‘ఆఫర్‌’ వచ్చిందంటూ ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. అప్పట్లో బీజేపీ తరఫున ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారనే వార్తలూ వచ్చాయి. ఓ దశలో ఆయన టీడీపీ వైపు వెళ్ళొచ్చని కూడా గుసగుసలు విన్పించాయి.

ఇంతకీ, జేడీ లక్ష్మినారాయణ రాజకీయ ఆలోచనలు ఎటువైపుగా సాగుతున్నట్లు.? ఏమో, చివరి నిమిషంలో అందరికీ షాకిచ్చే నిర్ణయాలు తీసుకోవడం ఆయనకు కొత్తేమీ కాదు. కానీ, చూస్తోంటే బీజేపీ వైపే ఆయన ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు కన్పిస్తోంది.

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

ఎక్కువ చదివినవి

6 ఏళ్ల ‘మనం’ జర్నీలో ఆసక్తికర విషయాలు కొన్ని.!

తెలుగు సినిమా పరిశ్రమలో అక్కినేని వంశానికి ఉన్న పేరు ప్రఖ్యాతుల గురించి తెలియంది కాదు. అక్కినేని నాగేశ్వరరావు నట వారసత్వాన్ని నాగార్జున దిగ్విజయంగా కొనసాగిస్తే.. ఆయన తనయులు నాగ చైతన్య, అఖిల్ తో...

‘మత్తు’ డాక్టర్‌ ఎపిసోడ్‌లో ఉక్కిరిబిక్కిరవుతున్న జగన్‌ సర్కార్‌.!

‘మత్తు’ డాక్టర్‌ సుధాకర్‌ ఉదంతంలో అధికార పార్టీకి తిప్పలు తప్పేలా కన్పించడంలేదు. ప్రభుత్వం ఇప్పటికే ఈ వ్యవహారంలో పూర్తిగా ఇరకాటంలో పడిపోయింది. ‘దళిత కార్డు’ ఓ వైపు, పోలీసుల అత్యుత్సాహం బట్టబయలవడం ఇంకో...

50 రోజుల యాక్షన్, ఒక్క ఫైట్ కి 6 కోట్లు @ మంచు మనోజ్.!

కలెక్షన్ కింగ్ మోహన బాబు నట వారసుడిగా తెలుగు తెరకి పరిచయమైన మంచు మనోజ్ పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. మనోజ్ కేవలం హీరోగానే కాకుండా తన సినిమాల మ్యూజిక్ విషయంలో,...

టీటీడీ భూముల అమ్మకాన్ని తప్పు పట్టిన వైసీపీ ఎంపీ!

టీటీడీ భూముల వేలం వ్యవహారం అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి తలనొప్పిగా మారుతోంది. తమిళనాడులో వున్న భూముల్ని వేలం వేయడం ద్వారా సొమ్ము చేసుకోవాలన్న టీటీడీ ఆలోచనపై భక్తలోకం నుంచి తీవ్ర వ్యతిరేకత...

రానా, మిహీకల నిశ్చితార్ధం నేడే

రానా దగ్గుబాటికి ఇండస్ట్రీలో అల్లరి కుర్రాడిగా పేరుంది. ఇండస్ట్రీలో తన తోటి వయసు నటులతో చాలా ఫ్రెండ్లీగా ఉండే రానాపై గతంలో కొన్ని లింకప్ రూమర్స్ వచ్చాయి కానీ వాటన్నిటినీ రానా తోసిపుచ్చాడు....