BJP MP : మహిళల పట్ల అనుచిత ప్రవర్తన కొనసాగుతూనే ఉంది. సామాన్య ఆడవారికి మాత్రమే కాకుండా ప్రముఖులు అయిన ఆడవారికి కూడా మగవారి నుండి అసభ్య ప్రవర్తన తప్పడం లేదు. ఇటీవల ఉత్తర ప్రదేశ్ లోని అలీఘడ్ జిల్లా కోల్ ప్రాంతం లో జరిగిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జన్మ దినం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పై ఎంపీ అనుచిత ప్రవర్తన వైరల్ అవుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే కోల్ ఎమ్మెల్యే అనిల్ పరాశర్ ఏర్పాటు చేసిన దీన్ దయాల్ ఉపాధ్యాయ్ జన్మదిన కార్యక్రమంలో బీజేపీ ఎంపీ సతీష్ గౌతమ్ పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన తన పక్కన ఉన్న మహిళ ఎమ్మెల్యే భుజాలపై చేతులు వేశాడు. ఆ సమయంలో ఆమె ఇబ్బందిగా ఫీల్ అయినా కూడా ఆయన వదిలి పెట్టలేదు.
స్టేజ్ పై చాలా మంది జనాలు ఉన్నా.. స్టేజ్ కింద వేలాది మంది జనాలు ఉన్నా కూడా మహిళ ఎమ్మెల్యే పై ఎంపీ అలా చేతులు వేయడం ఏంటి అంటూ చాలా మంది కూడా విమర్శలు చేస్తున్నారు. ఎంపీ ప్రవర్తన పై విరక్తి తో మహిళ ఎమ్మెల్యే పక్కకి వెళ్లి కూర్చున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా లో ఆమెకు మద్దతుగా ఎంతో మంది నిలుస్తున్నారు. ఎంపీ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
