ఉత్తరప్రదేశ్ లో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు గాను అఖిలేష్ యాదవ్ పార్టీ అయిన సమాజ్ వాది పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ కి అత్యంత కీలకమైన ఉత్తర ప్రదేశ్ లో ఆ పార్టీని దెబ్బ కొట్టాలని బీజేపీ కూడా ప్రయత్నాలు చేస్తుంది. బీజేపీ అక్కడ చాలా గట్టిగా కనిపిస్తున్నా ఆ పార్టీ నాయకుల్లో కొంత ఆందోళన మాత్రం కనిపిస్తుంది. ఇలాంటి స మయంలో బీజేపీకి ఆ పార్టీకి చెందిన మంత్రి మరియు నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ నుండి వైదొలిగిన ఎమ్మెల్యేలు మరియు మంత్రులు అఖిలేష్ యాదవ్ సమక్షంలో సమాజ్ వాది పార్టీలో జాయిన్ అవుతున్నట్లుగా ప్రకటించారు.
బీజేపీ నుండి మరి కొందరు కూడా సమాజ్ వాది పార్టీలో జాయిన్ అవుతారు అంటూ వారు చెబుతున్నారు. అయితే బీజేపీ మాత్రం వారికి సీట్లు ఇవ్వలేమని చెప్పడం వల్లే పార్టీ మారుతున్నారు అంటున్నారు. వారు వెళ్లి పోయినా కూడా వచ్చే నష్టం ఏమీ లేదు అన్నట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. మళ్లీ యూపీ సీఎంగా యోగి ఆధిత్య నాద్ పదవి బాధ్యతలు తీసుకునే రోజు ముందే ఉందని వారు ధీమాగా ఉన్నారు. ఇదే సమయంలో అఖిలేష్ యాదవ్ కూడా గెలుపుపై చాలా ధీమాగా ఉన్నారు.