Switch to English

బింబిసార మూవీ రివ్యూ – టైం ట్రావెల్ సోషియో డ్రామా

Critic Rating
( 3.00 )
User Rating
( 3.00 )

No votes so far! Be the first to rate this post.

Movie బింబిసార
Star Cast నందమూరి కళ్యాణ్ రామ్, కేథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్
Director మల్లిడి వశిష్ట
Producer హరి కృష్ణ కె
Music ఎంఎం కీరవాణి
Run Time 2 గం 27 నిమి
Release 5 ఆగస్టు 2022

నందమూరి కళ్యాణ్ రామ్ లీడ్ రోల్ లో నటించిన చిత్రం బింబిసార. టైం ట్రావెల్ జోనర్ లో సోషియో ఫాంటసీ చిత్రంగా రూపొందిన ఈ సినిమా ఈరోజే విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దామా?

కథ:

బింబిసార (నందమూరి కళ్యాణ్ రామ్) త్రిగర్తల రాజ్యాన్ని పాలించే అతి క్రూరమైన రాజు. అనుకోకుండా టైమ్ పోర్టల్ లో 2022 హైదరాబాద్ కు చేరుకుంటాడు. రాజ్యాల కాలం నుండి నేటి సమాజానికి చేరుకున్న బింబిసారుడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? చివరికి ఏమైంది?? అసలు టైమ్ పోర్టల్ లో బింబిసారుడు ఎలా ఈ కాలానికి చేరుకున్నాడు అన్నది మిగిలిన కథ.

నటీనటులు:

ఇది నందమూరి కళ్యాణ్ రామ్ వన్ మ్యాన్ షో గా చెప్పుకోవచ్చు. బింబిసార మొత్తం కళ్యాణ్ రామ్ చుట్టూనే తిరుగుతుంది. క్రూరమైన రాజుగా కళ్యాణ్ రామ్ నటన చాలా బాగుంది. అలాగే భిన్న వేరియేషన్స్ ఉన్న పాత్రలో కూడా కళ్యాణ్ రామ్ మెప్పించాడు. మొత్తానికి నటుడిగా బింబిసార కళ్యాణ్ రామ్ కు ల్యాండ్ మార్క్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు.

క్యాథెరిన్, సంయుక్త మీనన్ ఇందులో హీరోయిన్లుగా నటించారు. అయితే ఇద్దరికీ కూడా ఇందులో గుర్తించుకోదగ్గ పాత్రలు దొరకలేదు. కానీ వారు తమ పరిధి మేరకు నటించారు. శ్రీనివాస రెడ్డి కామెడీ రోల్ లో ఇంప్రెస్ చేస్తాడు. మిగతా నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేసారు.

సాంకేతిక వర్గం:

సాంకేతికంగా బింబిసార ఉన్నతంగా తెరకెక్కింది. ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చిత్రానికి వెన్నుముక అని చెప్పవచ్చు. తన సంగీతంతో చాలా సీన్స్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాడు. సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయుడు కూడా ఈ చిత్రానికి మరో హీరో అని చెప్పవచ్చు. విజువల్ వండర్ గా బింబిసారను తీర్చిదిద్దాడు. ఎడిటింగ్ కూడా స్థాయికి తగ్గట్లుగా ఉంది. ఆర్ట్ వర్క్ ను స్పెషల్ గా గుర్తించవచ్చు.

నూతన దర్శకుడు వశిష్ట్ తన మొదటి చిత్రంతోనే తలకు మించిన భారాన్ని ఎత్తుకున్నాడు. అయితే ఈ ప్రయత్నంలో చాలా వరకూ సక్సెస్ సాధించాడు. ఇలాంటి జోనర్ ను జాగ్రత్తగా డీల్ చేయాలి. వశిష్ట్ ఆడియన్స్ ను ఎంగేజ్ చేసేలా స్క్రీన్ ప్లే ను రాసుకున్నాడు. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి.

పాజిటివ్ పాయింట్స్:

  • కళ్యాణ్ రామ్ పెర్ఫార్మన్స్
  • కథ
  • కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్

నెగటివ్ పాయింట్స్:

  • నరేషన్ లో లోపాలు
  • క్లైమాక్స్

చివరిగా:

అక్కడక్కడా కొన్ని చోట్ల తడబడడం, క్లైమాక్స్ ను రష్ చేయడం తప్పితే మెజారిటీ భాగంలో వశిష్ట్ ఇంప్రెస్ చేస్తాడు. బింబిసారగా కళ్యాణ్ రామ్ అద్భుతమైన నటన కోసమైనా ఈ చిత్రాన్ని ఒకసారి చూడవచ్చు.

తెలుగుబులెటిన్ రేటింగ్: 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

మహేశ్ బర్త్ డే స్పెషల్స్: బాలనటుడి నుంచి రాజకుమారుడిలా సూపర్ స్టార్...

సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా సినిమాల్లోకి వచ్చినా తన టాలెంట్ తో సూపర్ స్టార్ గా ఎదిగిన హీరో మహేష్ బాబు. నిజానికి మహేష్...

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: ఫ్యామిలీ స్టోరీ + చిరంజీవి మాస్...

చిరంజీవి జేబుదొంగ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ‘బాసూ.. నీ పేరు ఆంధ్ర దేశమంతా మోగిపోతోంది’ అని చిరంజీవితో భానుప్రియ అంటుంది. చిరంజీవి మేనియా నడుస్తున్న...

ఈ సీత టాలీవుడ్‌ అప్‌ కమింగ్‌ మోస్ట్‌ వాంటెడ్‌

దుల్కర్ సల్మాన్‌ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఒక క్లాస్...

అన్న సక్సెస్‌.. తమ్ముడు ఫుల్‌ హ్యాపీ

నందమూరి కళ్యాణ్ రామ్‌ పటాస్ సినిమా తర్వాత ఇప్పటి వరకు సక్సెస్‌ దక్కించుకోలేక పోయాడు. తన ప్రతి సినిమాకు కూడా ఎంతో కష్టపడే కళ్యాణ్ రామ్‌...

బింబిసార మళ్లీ వస్తాడన్న కళ్యాణ్‌ రామ్‌

నందమూరి కళ్యాణ్ రామ్‌ హీరోగా వశిష్ఠ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన బింబిసార సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా లో కళ్యాణ్ రామ్ రెండు విభిన్నమైన...

రాజకీయం

‘బింబిసార’ హిట్ ఎంజాయ్ చేయక.. పక్కోళ్ల మీద ఏడుపెందుకు వీళ్లకు..?

తెలుగులో సినిమా అభిమానం.. హీరో వర్షిప్ ఎక్కువ. తమిళనాడు తరహాలో గుళ్లు కట్టరేమో కానీ.. గుండెల్లో అభిమానం గూళ్లు కట్టుకుంటారు. తమ హీరో కోసం త్యాగాలకు సైతం సిద్ధమవుతారు. అరచేతుల్లో హారతులు, కటౌట్లకు...

దాసోజు శ్రవణ్‌ కూడా జంప్‌.. బీజేపీలోకా?

తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ లో క్రియాశీలకంగా వ్యవహరించిన పీసీసీ నాయకుడు దాసోజు శ్రవణ్‌ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు. రేవంత్ రెడ్డి పోకడలకు నిరసనగా తాను రాజీనామా చేస్తున్నట్లుగా...

వారిని చూసి రాజగోపాల్ రెడ్డి బుద్ది తెచ్చుకోవాలి

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిపై పీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. పార్టీ ఎంతో ఇచ్చింది.. ఆయన మాత్రం ఈ సమయంలో పార్టీని...

తెలంగాణ భళా.! ఆంధ్రప్రదేశ్ డీలా.!

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. దీన్నొక ఐకానిక్ బిల్డింగ్‌గా అభివర్ణించొచ్చు. ఏడెకరాల స్థలంలో సుమారు 600 కోట్ల రూపాయలతో ఈ భవనాన్ని సకల సౌకర్యాలతో...

వైసీపీ ఎంపీ గోరంట్ల వీడియో లీక్.! అటువైపు వున్న మహిళ ఎవరు.?

బులుగు బాగోతం బయటపడినట్లేనా.? ఇంకా మార్ఫింగ్ బుకాయింపు కొనసాగుతుందా.? ‘అది ఫేక్’ అంటూ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో లీక్ వ్యవహారాన్ని వైసీపీ నాన్చబోతోందా.? ‘కఠిన చర్యలు’ అంటూ మీడియాకి లీకులు...

ఎక్కువ చదివినవి

వారిని చూసి రాజగోపాల్ రెడ్డి బుద్ది తెచ్చుకోవాలి

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిపై పీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. పార్టీ ఎంతో ఇచ్చింది.. ఆయన మాత్రం ఈ సమయంలో పార్టీని...

తేజా సజ్జకు ఆసక్తికర ఆఫర్లు!!

ఓ బేబీలో కీలకమైన పాత్ర వేసిన తేజా సజ్జ, జాంబీ రెడ్డి సినిమాతో విజయం సాధించాడు. అలాగే ఓటిటిలో విడుదలైన అద్భుతం కూడా తనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం తన కెరీర్...

మహేశ్ బర్త్ డే స్పెషల్స్: బాలనటుడి నుంచి రాజకుమారుడిలా సూపర్ స్టార్ ‘మహేశ్’

సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా సినిమాల్లోకి వచ్చినా తన టాలెంట్ తో సూపర్ స్టార్ గా ఎదిగిన హీరో మహేష్ బాబు. నిజానికి మహేష్ లో హీరో మెటీరియల్ ఉందని అతని...

నిఖిల్‌ ఆవేదన.. మేమే ఎందుకు తగ్గాలి?

నిఖిల్‌ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన కార్తికేయ సినిమా సీక్వెల్‌ కార్తికేయ 2 ఈనెల 12న విడుదల అవ్వాల్సి ఉండగా ఒక్క రోజు ఆలస్యంగా అంటే ఆగస్టు 13వ తారీకున విడుదల...

రాహుల్‌ పాదయాత్రతో కాంగ్రెస్‌కి ప్రయోజనమెంత?

2014 లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు తిరిగి పుంజుకోలేక పోయింది. వరుసగా రెండు సార్లు ప్రధానిగా మోడీ అధికారం చేపట్టాడు. బీజేపీ వరుస విజయాలను కాంగ్రెస్ అడ్డుకోవడంలో పూర్తిగా...