నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వశిష్ఠ్ దర్శకత్వంలో తెరకెక్కిన బింబిసార సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా లో కళ్యాణ్ రామ్ రెండు విభిన్నమైన గెటప్స్ లో కనిపించి మెప్పించాడు. సినిమాలో ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అంతే కాకుండా సీజీ వర్క్ కూడా బాగా సెట్ అయ్యిందని రివ్యూలు వస్తున్నాయి.
ఇదే సమయంలో బింబిసార సినిమా యొక్క వసూళ్లు భారీగా నమోదు అవుతున్న నేపథ్యంలో కళ్యాణ్ రామ్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. పటాస్ తర్వాత చాలా కాలానికి ఈ సినిమా తో సక్సెస్ వచ్చిన నేపథ్యంలో కళ్యాణ్ రామ్ జోష్ మీద ఉన్నాడు. ఇదే జోష్ తో ఆయన బింబిసార సినిమా యొక్క సీక్వెల్ ను ప్రకటించాడు. తప్పకుండా బింబిసార కు సీక్వెల్ ను తీయబోతున్నట్లుగా పేర్కొన్నాడు. త్వరలోనే అందుకు సంబంధించిన ప్రకటన చేసే అవకాశాలు కూడా ఉన్నాయని పేర్కొన్నాడు.