BIGG BOSS 9 TELUGU E93: సంజన జైలుకి – ఆఖరి కెప్టెన్ గా భరణి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,235FansLike
57,764FollowersFollow

బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 93 సోమవారం ఎపిసోడ్ పూర్తిగా టర్నింగ్స్‌తో, టెన్షన్  మోమెంట్స్‌తో నిండిపోయింది. ఇప్పటి వరకూ కెప్టెన్ కాలేని భరణిని బిగ్ బాస్ డైరెక్ట్‌గా ఆఖరి కెప్టెన్‌గా నియమించడం హౌస్‌లో పెద్ద షాక్‌గా మారింది. అయితే ఈసారి కెప్టెన్ అయినా… ఇమ్మ్యూనిటీ మాత్రం ఉండదని బిగ్ బాస్ స్పష్టంచేశాడు.

పవన్ మాత్రం ఇంటిసభ్యుల ముందే తన మనసు విప్పాడు. రీతూ కన్నా ముందే తనూజతో ఫ్రెండ్షిప్ చేయాలని అనుకున్నానని చెప్పడంతో హౌస్‌లో చిన్నపాటి చర్చ మొదలైంది.

ఇక తర్వాత బిగ్ పరీక్షలు స్టార్ట్! ఇది ఫాయిర్ కాదు బిగ్ బాస్ అని అనిపించేలా..    హౌస్‌మేట్స్‌కి “బాక్స్ టాస్క్” ఇచ్చిన బిగ్ బాస్… ప్రతి రౌండ్‌లో క్యాష్ అమౌంట్ నిర్ణయించే ఛాన్స్ ఇచ్చాడు. పై నుంచి పడే బాల్‌ను పట్టుకున్న వ్యక్తి… ఆ అమౌంట్ ఎవరికివ్వాలో డిసైడ్ చేయాలి. మిగతా సభ్యులు ఆమోదిస్తేనే బాక్స్ వారికి దక్కుతుంది.

మొదటి రౌండ్‌లో పవన్ బాల్ పట్టి సుమన్‌కు రూ.1,00,000 బాక్స్ ఇవ్వాలని చెప్పాడు. హౌస్‌మేట్స్ ఎక్కువ మంది ఆమోదించడంతో సుమన్‌కు ఒక లక్ష రూపాయల బాక్స్ దక్కింది.

రెండో రౌండ్‌లో భరణి బాల్ పట్టి తనూజకు నేరుగా రూ.2,00,000 బాక్స్ ఇవ్వాలని చెప్పాడు. దీనికి సభ్యుల పూర్తి సపోర్ట్ లభించడంతో తనూజ బాక్స్ జాక్పాట్ కొట్టేసింది.

మూడో రౌండ్‌లో కల్యాణ్… ఇమ్మానియేల్‌కు రూ.2,50,000 ఇవ్వగా… అందరూ అంగీకరించారు.

అయితే నాలుగో రౌండ్‌ డ్రామా పీక్‌కు చేరింది. ఇమ్మానియేల్ బాల్ పట్టి సంజనకు రూ.1,50,000 ఇవ్వాలని చెప్పాడు కానీ మిగిలిన నలుగురు సభ్యులు నో చెప్పారు. ఫలితం… సంజనకు బాక్స్ దక్కలేదు.

ఐదో రౌండ్‌లో సుమన్ బాల్ పట్టి పవన్‌కు రూ.1,50,000 ఇవ్వగా మెజారిటీ ఆమోదించింది. పవన్‌కు కూడా భారీ బాక్స్ వచ్చేసింది.

చివరి రౌండ్‌లో  సంజన బాల్ పట్టి… భరణికి “జీరో” బాక్స్ ఇవ్వాలని చెప్పింది. అయితే ఈసారి ఎక్కువ మంది సభ్యులు నిరాకరించడంతో బాక్స్ ఎవరికీ రాలేదు.

ఇక మిగిలిన జీరో బాక్స్, 50 వేల  బాక్స్ ఎవరికి ఇవ్వాలో బిగ్ బాస్ ఇంటిసభ్యుల నిర్ణయంకే వదిలేశాడు. ఈ ఓటింగ్‌లో ఇమ్మానియేల్–పవన్ లు  సంజనకు ఇవ్వాలని చెప్పారు. కానీ సుమన్–తనూజ–కల్యాణ్ మెజారిటీతో 50 వేల బాక్స్ భరణికే వెళ్లింది. ఫలితం… సంజనకు జీరో బాక్స్!

జీరో బాక్స్ పడడంతో బిగ్ బాస్ సంజనను తదుపరి ఆదేశం వరకూ జైల్లో ఉండాలని చెప్పాడు. దీంతో సంజన ఎమోషన్ అయ్యింది. ఆవేదన పెరగడంతో ఇమ్మానియేల్, పవన్ ఆమెను ఓదార్చారు.

ఇక తర్వాత స్టార్ట్ అయిన “స్వింగ్ జర రౌండ్‌”లో ఇమ్మానియేల్ ఫస్ట్, భరణి సెకండ్, పవన్ థర్డ్, తనూజ ఫోర్త్, సుమన్ ఫిఫ్త్ స్థానాలు దక్కించుకున్నారు. స్కోర్లు అయితే రేపటి ఎపిసోడ్‌లో క్లారిటీగా తెలుస్తాయి.

ఎపిసోడ్ మొత్తం భావోద్వేగాలు–డ్రామా–ట్విస్టులతో నిండిపోయి బిగ్ బాస్ నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లిపోయింది!

సినిమా

‘లెనిన్’లో చివరి 20 నిమిషాలే హైలైటా? శివాజీ పాత్రపై ఆసక్తి

అఖిల్ నటిస్తున్న 'లెనిన్' సినిమాపై విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో చివరి 20 నిమిషాలు...

‘మా ఇంటి బంగారం’కు రూ.100 కోట్ల మైలురాయి.. హైదరాబాద్‌లో గ్రాండ్ సెలబ్రేషన్?

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. తాజా ట్రేడ్ అంచనాల ప్రకారం, ఈ చిత్రం రానున్న ఆదివారం...

Mega158: రెండో షెడ్యూల్లో చిరంజీవి-బాబీ సినిమా..! త్వరలో గుడ్ న్యూస్..

Mega158: మెగాస్టార్ చిరంజీవి హిరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. #Mega158గా మే21వ తేదీన పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సినిమా...

‘లెనిన్’కు థమన్ ఫినిషింగ్ టచ్.. నేటి నుంచి థమన్ ప్రమోషన్ రౌండ్!

అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న 'లెనిన్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన చివరి దశ సంగీత పనులను సంగీత దర్శకుడు ఎస్....

కుబేర తర్వాత శేఖర్ కమ్ముల కొత్త సినిమా.. హీరో ఎవరో త్వరలోనే!

దర్శకుడు శేఖర్ కమ్ముల తన తదుపరి చిత్రానికి సంబంధించిన పనులను వేగవంతం చేశారు. తాజా సమాచారం ప్రకారం, కొత్త సినిమా కథను పూర్తిగా లాక్ చేసిన...

రాజకీయం

ఆరు నెలల్లో అగ్రిగోల్డ్ బాధితులందరికీ న్యాయం చేస్తాం: నాదెండ్ల మనోహర్

అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు న్యాయం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన...

ఎల్జీ కెమ్‌తో లోకేష్ భేటీ.. ఏపీకి భారీ పెట్రోకెమికల్ పెట్టుబడులపై చర్చ

దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించే దిశగా కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. సియోల్‌లో ఎల్జీ కెమ్ గ్లోబల్ స్ట్రాటజీ...

ప్రతి హస్తకళకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొస్తాం: పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ హస్తకళలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం తరహాలోనే...

అనారోగ్యంతో ఉన్న జనసేన కార్యకర్తను పరామర్శించిన ప్రేమ్ కుమార్

కూకట్‌పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు ప్రేమ్ కుమార్, అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్త ప్రసాద్‌ను పరామర్శించారు. అల్లాపూర్‌కు చెందిన ప్రసాద్ గత రెండు రోజులుగా న్యూరో సంబంధిత ఆరోగ్య...

E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సంచలన ప్రశ్నలు.. పాత వాహనాలకు నిజంగా సేఫేనా?

దేశవ్యాప్తంగా E20 (20 శాతం ఎథనాల్ మిశ్రమం) పెట్రోల్ అమలుపై మరోసారి చర్చ మొదలైంది. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర ప్రభుత్వం ప్రజల అభ్యంతరాలను పట్టించుకోకుండా E20...

ఎక్కువ చదివినవి

అల్లూరి, పింగళి, రోశయ్యకు లోకేష్ ఘన నివాళులు

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శనివారం మూడు ప్రముఖ తెలుగు మహనీయులను స్మరించుకుంటూ సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి, భారత...

Varanasi: ‘వారణాసి’పై రాజమౌళి కీలక అప్డేట్..! మహేశ్ ఫ్యాన్స్ లో జోష్

Varanasi: మహేశ్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘వారణాసి’. అంతర్జాతీయ ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకునేలా అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కతోందీ సినిమా. సినిమాపై ఇటు ప్రేక్షకుల్లో, అటు ట్రేడ్ లో...

DAILY HOROSCOPE: కన్య రాశికి ఉద్యోగ అవకాశాలు.. ధనుస్సు రాశికి ప్రయాణాల్లో శుభవార్తలు

జులై 5 , 2026 ఆదివారం రాశిఫలాలు ఈరోజు చంద్ర మాన పంచాంగం ఆధారంగా సిద్ధం చేసిన రాశిఫలాలు మీ దైనందిన జీవితానికి మార్గదర్శకంగా ఉపయోగపడతాయి. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్యం...

Jr Ntr: ‘మొదలే కాలేదు..’ వివాదంలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా

Jr Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ‘గాడ్ ఆఫ్ వార్’గా పిలుస్తున్న సినిమాకు టైటిల్ ఇదేనంటూ వార్తలు కూడా వస్తున్నాయి. ఇటివలే...

116 ఏళ్ల భక్తురాలి కోరిక తీర్చిన టీటీడీ.. ప్రత్యేక దర్శనంతో సత్కారం

భక్తి, సంకల్పం ముందు వయస్సు అడ్డంకి కాదని మరోసారి నిరూపించిన సంఘటన తిరుమలలో చోటు చేసుకుంది. కర్ణాటకకు చెందిన 116 ఏళ్ల వృద్ధ భక్తురాలు నవనీతమ్మ తన కుటుంబ సభ్యులతో కలిసి అలిపిరి...