బిగ్ బాస్ 4 మొదటి శనివారం ఎపిసోడ్ నిన్న ప్రసారం అయ్యింది. ఇంటి సభ్యులతో ముచ్చట్లు పెట్టిన నాగార్జున ఒక్కో ఇంటి సభ్యుడి గురించి మాట్లాడుతూ వారి తప్పు ఒప్పులను మంచి చెడులను గురించి వివరిస్తూ షో ముందుకు తీసుకు వెళ్లాడు. నాగార్జున ఈ ఎపిసోడ్ లో కొందరిని మందలించగా కొందరిని అభినందించారు. ఇక గత వారం రోజులుగా ఇంటి సభ్యులకు మాత్రమే కాకుండా ప్రేక్షకులకు కూడా సస్పెన్స్ గా మారిన కట్టప్ప విషయంలో క్లారిటీ ఇచ్చారు. ఇదే సమయంలో ఎలిమినేషన్ లో ఉన్న ఏడుగురిలో నుండి ముగ్గరిని సేవ్ చేశాడు. నేటి ఎపిసోడ్ లో నలుగురులో నుండి ఒక్కరిని ఎలిమినేట్ ఉండబోతుంది.
నాగార్జున రావడం రావడంతోనే తనదైన లుక్ తో అలరించాడు. ఒక్కో జంట ఎంత వరకు కనెక్షన్స్ పెట్టుకున్నారు అనే విషయంపై అడిగి తెలుసుకున్నాడు. చాలా మంది తమ జోడీలతో కాకుండా ఇతరులతో ఎక్కవుగా ఉండటంతో పాటు ఎక్కువ శాతం మంది కనెక్షన్స్ గురించి అసలు మర్చి పోయారు అన్నాడు. నోయల్ నీ గేమ్ నీవు ఆడకుండా ఇతరుల గేమ్ ను కూడా స్పాయిల్ చేస్తున్నావంటూ కోప్పాడ్డాడు. అరియానాను సున్నితంగా మందలించడంతో పాటు ఆమె తీరును మెచ్చుకున్నాడు. ఏడుపు ఆపమంటూ మోనాల్ గజ్జర్ కు సూచించడంతో పాటు ఆమె తెలుగు గురించి అభినందించాడు. లాస్య రియల్ గా ఉండటం లేదని గోడమీద పిల్లలా ఉంటుందంటూ నాగార్జున అన్నారు. దివి ఒక్కసారిగా బరెస్ట్ అవ్వడం గురించి కూడా నాగ్ మాట్లాడారు. సూర్యకిరణ్ తీరును విమర్శించిన నాగార్జున అమ్మ రాజశేఖర్ తో ఒక ఆట ఆడుకున్నారు.
దేవి గురించి పంచ్ లు వేయడంతో పాటు ఇతర ఇంటి సభ్యుల గురించి ప్రేక్షకులు అనుకుంటున్నది తాను భావిస్తున్నది చెప్పుకొచ్చాడు. కొందరు మారాలని సూచించాడు కొందరు తగ్గించుకోవాలని హెచ్చరించాడు. వారం రోజులుగా అందరి బుర్రలు హీట్ ఎక్కేలా చేసిన కట్టప్ప ఇష్యూపై కూడా క్లారిటీ వచ్చింది. అసలు ఇంట్లో కట్టప్ప లేనే లేరు. మీలో మీరు ఎంత నమ్మకంగా ఉంటున్నారు అనేది తెలుసుకునేందుకు కట్టప్ప ఎపిసోడ్ అన్నాడు. ఎక్కువ శాతం మంది లాస్యను కట్టప్ప అంటూ నామినేట్ చేయడంతో ఆమెకు సీజన్ 4 మొదటి కెప్టెన్ గా నియమించడం జరిగింది. లాస్య ఇప్పుడు కెప్టెన్ గా ప్రత్యేక అధికారాలు కలిగి ఉంటుంది. ఆమె ఏ పని చేయకుండా కూర్చుని అందరితో పని చేయించాల్సి ఉంటుంది.
ఈ వారం అత్యధికంగా 5 కోట్ల ఓట్లు వచ్చినట్లుగా నాగ్ ప్రకటించాడు. గత మూడు సీజన్ ల్లో ఎప్పుడు ఈ స్థాయి ఓట్లు రాలేదని ఆయన పేర్కొన్నాడు. ఆ తర్వాత అభిజిత్ ను మొదటగా సేవ్ చేయగా ఆ తర్వాత జోర్‌దార్ సుజాత, గంగవ్వ సేవ్ అయినట్లుగా ప్రకటించారు.