Switch to English

బిగ్ బాస్ 5: ఎన్నీ మాస్టర్ తన గొయ్యి తనే తవ్వుకుందా?

బిగ్ బాస్ 5లో నిన్నటి ఎపిసోడ్ లో ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఎపిసోడ్ ను కంటిన్యూ చేసాడు. సన్నీని సపోర్ట్ చేయడానికి నిర్ణయించుకున్న కాజల్ తన స్టాండ్ మీద బలంగా నిలబడింది. ఎన్నీ, సిరిలలో ఒకర్ని సపోర్ట్ చేయమని మానస్ చెప్పినా కూడా వినిపించుకోలేదు. ఇద్దరూ ఎలిమినేట్ అయిపోతే సన్నీకి ఆ పాస్ వస్తుందని నమ్మింది. అనుకున్నట్లుగా అలానే జరిగింది. మానస్, కాజల్ లు కూర్చొని ఏ విషయం తేల్చకపోవడంతో సన్నీకి ఆ పాస్ దక్కింది. నాగార్జున ఆ పాస్ గురించి వివరిస్తూ తనకు కావాల్సిన వాళ్లకు లేదా తనకు ఈ పాస్ ను ఉపయోగించుకోవచ్చని చెప్పాడు. దీంతో కాజల్ ఎత్తుగడ బాగా ఫలించిందని చెప్పాలి.

మరోవైపు ఎన్నీ ఈ స్ట్రాటజీని సరిగ్గా అర్ధం చేసుకోలేకపోయింది. అనవసరంగా ఫ్రస్ట్రేట్ అయ్యి ఆడియన్స్ కు చిరాకు తెప్పించింది. ముందు నుండి కూడా కాజల్ విషయంలో ఎన్నీ వెక్కిరిస్తూ, వింత చేష్టలు చేస్తూ ఉండింది. ఈ విషయాన్ని కన్ఫెషన్ రూమ్ కు పిలిచి మరీ చెప్పాడు నాగార్జున. అలాగే ఎవిక్షన్ టాస్క్ లో ఎన్నీ, ప్రియాంక ఫైర్ ట్రక్ ఎక్కినప్పుడు సన్నీని కాకుండా కాజల్ ను సేవ్ చేసి ఉంటే ఎన్నీ మాస్టర్ కు మరో అవకాశం లభించి ఉండేది. కానీ ప్రియాంక మాటలకు లొంగిపోయి సన్నీని సేవ్ చేసి ఎవిక్షన్ పాస్ ను చేజార్చుకుంది.

ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ లో ఎన్నీ మాస్టర్ వీక్ గా కనిపిస్తున్నారు. ఈరోజు ఎలిమినేట్ అయ్యేది కూడా ఆమె అని అంటున్నారు. ఒకవేళ పాస్ ఉండి ఉంటే ఆమెకు ఉపయోగపడేది. ఇక నాగార్జున ఈ ఎపిసోడ్ లో కొన్ని ఇష్యూస్ పై స్పందించాడు. షణ్ముఖ్, సిరిల ట్రాక్ పై కొంత క్లారిటీ ఇచ్చాడు. వాళ్ళ గొడవ ఏదైనా కానీ అది గేమ్ ను ఎఫెక్ట్ చేయకూడదని, అలాగే సిరి సెల్ఫ్ హర్ట్ చేసుకోవడం బాలేదని చెప్పాడు. మానస్ ను కూడా కన్ఫెషన్ రూమ్ కు పిలిచి ప్రియాంకను ఇబ్బంది పెడుతోన్న విషయంపై ఒక వీడియో చూపించాడు. మానస్ క్లారిటీ తనకు వచ్చింది. అలాగే రవి చేత ఈ వారం జరిగిన టాస్క్ ఆధారంగా బంగారం లేదా బొగ్గు కంటెస్టెంట్స్ కు ఇవ్వాలని చెప్పాడు. రవి – శ్రీరామ్ చంద్ర, ఎన్నీ, మానస్, ప్రియాంకలకు బంగారం ఇవ్వగా తనతో సహా మిగిలిన వారికి బొగ్గు ఇచ్చాడు.

ఫైనల్ గా ఈ ఎపిసోడ్ లో నామినేషన్స్ లో ఉన్న ఎనిమిది మంది నుండి ఇద్దర్ని – సన్నీ, శ్రీరామ్ చంద్రలను సేవ్ చేసాడు. మరి రేపు ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: ఆంధ్రప్రదేశ్ ను ఇంద్రప్రదేశ్ గా మార్చిన...

స్టార్ హీరో సినిమా షూటింగ్ ప్రారంభమై, విడుదలయ్యే వరకూ పరిశ్రమ, ట్రేడ్, డిస్ట్రిబ్యూటర్లు, అభిమానుల అంచనాలు ఆకాశమే హద్దుగా ఉంటాయి. హిట్ కాంబో అయితే ఇది...

అన్ని సినిమాలు బాగుండాలి… అందులో మన సినిమా ఉండాలి: తీస్ మార్...

స్టూడెంట్, రౌడీ, పోలీస్ గా మూడు భిన్న గెటప్స్ ఉన్న పాత్రల్లో ఆది సాయికుమార్ హీరోగా నటించిన చిత్రం తీస్ మార్ ఖాన్. పాయల్ రాజ్...

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిన్నారులను సైతం మెగాభిమానులుగా మలచుకున్న చిరంజీవి

చిరంజీవి 44 ఏళ్ల లాంగ్ సినీ కెరీర్లో 152 సినిమాల అనుభవం ఉంది. ఇన్నేళ్లలో ఆయన దాదాపు ప్రతి జోనర్లో సినిమాలు చేశారు. చిరంజీవి ప్రస్థానం...

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిరంజీవికి చిన్నపిల్లల సెంటిమెంట్ తో మరో...

చిరంజీవి సినిమా అంటేనే టేబుల్ ప్రాఫిట్ గ్యారంటీ అనే పేరు. ఆయన సినిమాలకు వచ్చే కలెక్షన్లు, రికార్డులే ఇందుకు నిదర్శనం. దీంతో చిరంజీవితో సినిమాలు తీసేందుకు...

కార్తికేయ 2 ఓటిటి స్ట్రీమింగ్ పార్ట్నర్ అప్డేట్

సీతా రామమ్, బింబిసార తర్వాత ఈ నెల విడుదలై మంచి విషయం సాధించిన చిత్రం కార్తికేయ 2. ఈ సినిమా అటు రెండు తెలుగు రాష్ట్రాల్లో,...

రాజకీయం

కాపు జనసేన కాదు, కమ్మ జనసేన.! వైసీపీ ‘చెత్త’ పల్లవి.!

జనసేన పార్టీని విమర్శిస్తున్నారో, ఆ పార్టీకి పొలిటికల్ మైలేజ్ ఇచ్చేందుకు అపరిపక్వ వ్యాఖ్యలు చేస్తున్నారోగానీ, ‘ఐటీ శాఖ మంత్రి’ పదవిని పక్కన పెట్టి, జనసేన పార్టీని విమర్శించే పదవిలో మాత్రం నూటికి నూరు...

రాజకీయ సర్వేలు, ఎవరు ఎందుకు ఎలా చేస్తారు.?

2024లో సాధారణ ఎన్నికలు జరుగుతాయ్.! ఈలోగా జరిగే సర్వేల వల్ల ఉపయోగమేంటి.? ఆ సర్వేల వల్ల జనానికి కలిగే లాభాలేంటి.? నష్టాలేంటి.? రాజకీయ సర్వేలన్నవి ఇటీవలి కాలంలో సర్వసాధారణమైపోయాయి. ఇదొక సంపాదన మార్గంగా...

గోరంట్ల మాధవ్ ఒప్పుకోలేదుగానీ, అంబటి రాంబాబు ఒప్పేసుకున్నారే.!

‘ఆ వీడియోలో వున్నది నేను కాదు..’ అంటూ హిందూపురం ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత గోరంట్ల మాధవ్ నానా యాగీ చేసిన విషయం విదితమే. ఇటీవల ఆయనకు చెందినదిగా చెప్పబడుతున్న ఓ...

ఫాఫం వైసీపీ.! 175 సీట్లలో జనసేన పోటీ చేస్తే వాళ్ళకి ‘హార్ట్ ఎటాక్’ వచ్చేస్తుందేమో.!

ఐటీ శాఖ మంత్రి ఆయన.. కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని విమర్శించడమొక్కటే ఆయన బాధ్యత.. అన్నట్లు మారింది. నీటి పారుదల శాఖ మంత్రి ఆయన.. కానీ, జనసేన అధినేత మీద విరుచుకుపడేందుకు...

15 శాతానికి పెరిగిన జనసేన ఓటు బ్యాంకు: ఉండవల్లి అరుణ్ కుమార్

జనసేన పార్టీకి ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగిందని అంటున్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. ఓ ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించీ, ఆయా పార్టీలకు పెరిగిన అలాగే తగ్గిన ఓటు బ్యాంకు...

ఎక్కువ చదివినవి

రవితేజ ధమాకా నుండి జింతాక్ అప్డేట్!!

వరస ప్లాపులతో మాస్ మహారాజా రవితేజ డౌన్ అయిన విషయం తెల్సిందే. రీసెంట్ గా విడుదలైన రామారావు ఆన్ డ్యూటీ డిజాస్టర్ గా మిగిలింది. అయితే మరో ఎంటర్టైనర్ తో రవితేజ మన...

‘ఘన’కార్యం చేశారు కదా.! ఘన స్వాగతం పలకాల్సిందే.!

హిందూపురం ఎంపీ, వైసీపీ నేత గోరంట్ల మాధవ్ కోసం సొంత నియోజకవర్గంలో అభిమానులు (?!) భారీ ఏర్పాట్లు చేశారట. వందలాది కార్లు ఆయనకు ఘన స్వాగతం పలకనున్నాయట. వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు...

కొత్త సమస్య.. ఆ నదిపై ప్రాజెక్టు వద్దని ఏపీ సీఎంకు తమిళనాడు సీఎం లేఖ

ఏపీ-తమిళనాడు సరిహద్దులో కుశస్థలి అంతర్రాష్ట్ర నదిపై జలాశయాల నిర్మాణం చేపట్టొద్దని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని తమిళనాడు సీఎం స్టాలిన్ ఓ లేఖలో కోరారు. ‘కుశస్థలి నదిపై ఏపీ ప్రభుత్వం 2చోట్ల...

భారత్ స్టాక్ మార్కెట్ దిగ్గజం రాకేశ్ ఝన్ ఝన్ వాలా హఠాన్మరణం

ప్రముఖ వ్యాపారవేత్త, స్టాక్ మార్కెట్ దిగ్గజం రాకేశ్ ఝన్ ఝన్ వాలా ముంబైలో గుండెపోటుతో ఈ తెల్లవారుఝామున మృతి చెందారు. ఉదయం గుండెపోటు రావడంతో వెంటనే కుటుంబసభ్యులు ఆయన్ను బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి...

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిరంజీవికి చిన్నపిల్లల సెంటిమెంట్ తో మరో బ్లాక్ బస్టర్ ‘చూడాలని వుంది’

చిరంజీవి సినిమా అంటేనే టేబుల్ ప్రాఫిట్ గ్యారంటీ అనే పేరు. ఆయన సినిమాలకు వచ్చే కలెక్షన్లు, రికార్డులే ఇందుకు నిదర్శనం. దీంతో చిరంజీవితో సినిమాలు తీసేందుకు నిర్మాతలు పోటీ పడ్డారు. 90వ దశకంలో...