Switch to English

బిగ్ బాస్ 5: కెప్టెన్ తప్ప అందరూ నామినేషన్స్ లోకి

బిగ్ బాస్ సీజన్ 5 కీలకమైన దశకు చేరుకుంది. పదకొండో వారంలోకి ఎంటర్ అయింది ఈ షో. ఆదివారం జెస్సీ అనారోగ్యం కారణంగా బయటకు వెళ్లిపోవడంతో అసలు వెళ్లిపోవాల్సిన కంటెస్టెంట్ కు లైఫ్ దక్కింది. సోమవారం నామినేషన్స్ ఎపిసోడ్ ఎప్పటిలానే మంచి ఫైర్ తో సాగింది. రెగ్యులర్ గా ఉన్నట్లుగానే గార్డెన్ ఏరియాలో ప్రతీ ఒక్కరూ ఇద్దరేసి కంటెస్టెంట్స్ చొప్పున స్లైమ్ పోసి తగిన కారణాలు చెప్పి నామినేట్ చేయాల్సి ఉంటుంది. ముందుగా కెప్టెన్ రవితో నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. రవి – సన్నీ, కాజల్ లను నామినేట్ చేసాడు. శనివారం ఎపిసోడ్ లో బ్రేక్ మధ్యలో తనతో డిస్కషన్ పెట్టినందుకు సన్నీని, తనకు రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడినందుకు కాజల్ ను నామినేట్ చేసాడు.

ఆ తర్వాత షణ్ముఖ్ వచ్చి నువ్వు హౌజ్ లో లేకపోతే గొడవలు జరగవు అన్న పెద్ద స్టేట్మెంట్ ను కాజల్ పై ఇచ్చి నామినేట్ చేసాడు. ప్రియాంక లూజ్ టాక్ నచ్చలేదని ఆమెను నామినేట్ చేసాడు. మానస్ – షణ్ముఖ్, ఎన్నీ మాస్టర్ లను నామినేట్ చేసాడు. షణ్ముఖ్ ఎక్కువ ఊహించుకుంటున్నాడని కారణం చెప్పాడు. ఎన్నీ మాస్టర్ హగ్ విషయం ఎత్తి నామినేట్ చేసాడు.

శ్రీరామ్ అందరూ అనుకున్నట్లుగానే సన్నీ, మానస్ లను నామినేట్ చేసాడు. ముందు నుండీ కూడా వీరిద్దరికీ శ్రీరామ్ కు చిన్న గ్యాప్ మైంటైన్ అవుతూ వస్తోంది. షణ్ముఖ్ అన్న మాట తాను తీసుకోలేకపోతున్నానని చెప్పి తననే నామినేట్ చేసింది కాజల్. అలాగే కొన్ని వారాలుగా ఎన్నీ మాస్టర్ పడట్లేదు కాబట్టి ఆమెను కూడా నామినేషన్స్ లో వేసింది. తనను కెప్టెన్సీ టాస్క్ లో సపోర్ట్ చేయని కారణంగా ప్రియాంకను, రెండో నామినేషన్ గా కాజల్ ను ఎంచుకుంది సిరి. ప్రియాంక తనను నామినేట్ చేసిన ఇద్దరూ షణ్ముఖ్, సిరిలను తిరిగి నామినేట్ చేసింది. తన కెప్టెన్సీ టాస్క్ లో అడ్డు పడినందుకు సిరిని నామినేట్ చేసాడు సన్నీ. అలాగే శ్రీరామ్ ను నామినేట్ చేసాడు. ఇక చివరిగా వచ్చిన ఎన్నీ మాస్టర్ మానస్, కాజల్ లను నామినేట్ చేసింది. ఈ నామినేషన్స్ ప్రాసెస్ లో ఎన్నీ మాస్టర్ చేసిన డ్యాన్స్ లు, వెక్కిరించడం హౌజ్ మేట్స్ లో కొంత మందికి నవ్వు, కొంత మందికి ఏంటిది అన్న ఫీలింగ్ ను కలిగించాయి.

మొత్తంగా కెప్టెన్ రవి తప్ప మిగతా అందరూ కూడా నామినేషన్స్ లో నిలిచారు. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నా పెళ్లి విడాకులు అన్ని కూడా యూట్యూబ్‌ లో చేస్తున్నారు

ప్రముఖ నటి మరియు సోషల్ మీడియా స్టార్‌ హిమజ పెళ్లి అయ్యింది.. తాజాగా విడాకులు తీసుకుందంటూ మీడియా లో వార్తలు వస్తున్నాయి. మీడియాలో వస్తున్న వార్తలతో...

గుడ్ లక్ సఖి రివ్యూ : రొటీన్ స్పోర్ట్స్ డ్రామా

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రూపొందించిన గుడ్ లక్ సఖి పలు మార్లు వాయిదా పడి ఎట్టకేలకు ఈరోజు విడుదలైంది. నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేసిన...

విజయ్ చిత్రానికి భారీ ఆఫర్ ఇస్తోన్న జీ సంస్థ

ఇళయథళపతి విజయ్ తన కెరీర్ లో తొలిసారి  డైరెక్ట్ తెలుగు చిత్రం చేయబోతున్నాడు. విజయ్ 66వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయనుండగా అగ్ర నిర్మాత...

రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న గంగూభాయ్

ఆర్ ఆర్ ఆర్ లో హీరోయిన్ గా నటించిన అలియా భట్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం గంగూభాయ్ కథియావాడి. గ్యాంగ్ స్టార్ డ్రామాగా రూపొందిన...

శ్రీ విష్ణు మాస్ టచ్ తోనైనా మెప్పిస్తాడా?

శ్రీ విష్ణు సినిమా వస్తోందంటే కచ్చితంగా చిత్రంలో ఏదో కొత్తదనం  ఉంటుందన్న అభిప్రాయం చాలా మంది ప్రేక్షకుల్లో ఉంది. అయితే గత కొంత కాలంగా శ్రీ...

రాజకీయం

జిల్లాల రగడ: ఇది బులుగు వ్యూహం కాదు కదా.?

వైఎస్ జగన్ సర్కారు రాష్ట్రంలో 26 జిల్లాల ఏర్పాటు దిశగా ముందడుగు వేసిన విషయం విదితమే. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభం కానుంది. మరోపక్క, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని...

రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెప్పిన సోము వీర్రాజు

‘రాయలసీమలో ఎయిర్ పోర్టు.. కడపలో ఎయిర్ పోర్టు.. ప్రాణాలు తీసేసే వాళ్ల జిల్లాలో కూడా ఎయిర్ పోర్ట.. వాళ్లకు ప్రాణాలు తీయడమే వచ్చు’ అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన...

కేసీయార్ వ్యతిరేకిస్తే.. వైఎస్ జగన్ స్వాగతించేశారు.!

రాష్ట్ర ప్రభుత్వ అభీష్టంతో సంబంధం లేకుండా రాష్ట్ర క్యాడర్‌కి చెందిన ఐఏఎస్ అధికారుల్ని డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసుకి పిలిపించుకునే అధికారాన్ని కేంద్రానికి కట్టబెడుతూ సర్వీస్ నిబంధనల్ని సవరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం...

సూపర్‌ స్టార్‌ రాజకీయాల్లోకి.. ఇదే సంకేతం అంటున్న ఫ్యాన్స్‌

తమిళ సినిమా ప్రముఖులు రాజకీయాల్లోకి రావడం కొత్తేం కాదు. ఎంజీఆర్ మొదలుకుని ఎంతో మంది ఇండస్ట్రీకి చెందిన వారు రాజకీయాల్లోకి అడుగులు వేశారు. జయలలిత హీరోయిన్ గా ఎంతగానో పేరు సాధించి ముఖ్యమంత్రిగా...

కొత్త జిల్లాల వ్యవహారం ఒక డ్రామా : చంద్రబాబు

రాష్ట్రంలో ఉన్న సమస్యలను పక్క దారి పట్టించేందుకు.. ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇప్పుడు కొత్త జిల్లాల ప్రస్థావన తీసుకు వచ్చారంటూ తెలుగు దేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆరోపించాడు....

ఎక్కువ చదివినవి

సక్సెస్ కోసం పేరు మార్చుకున్న యువ హీరో

ఇండస్ట్రీలో పేర్లు మార్చుకోవడం సర్వసాధారణం. అప్పటికే ఇండస్ట్రీలో అదే పేరు మీద వేరొకరు చలామణిలో ఉండటం, లేదా సినిమాలకు సూట్ అవ్వడం కోసం ఆకర్షణీయమైన పేరుని పెట్టుకోవడం వంటివి మనం చూస్తూనే ఉన్నాం....

రాశి ఫలాలు: గురువారం 27 జనవరి 2022

పంచాంగం శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం బహుళపక్షం సూర్యోదయం: ఉ 6:38 సూర్యాస్తమయం : సా‌.5:48 తిథి: పుష్య బహుళ దశమి రా.11:00 వరకు తదుపరి ఏకాదశి సంస్కృతవారం: బృహస్పతివాసరః (గురువారం) నక్షత్రము : విశాఖ ఉ.6:07...

జీతాల లొల్లి: ఉద్యోగులు వర్సెస్ అధికార వైసీపీ.. గెలిచేదెవరు.?

‘ఎమ్మెల్యేలం, ఇతర ప్రజా ప్రతినిథులం జీతాల్ని వదులుకుంటాం.. ఉద్యోగులు కూడా సిద్ధమేనా.?’ అంటూ వైసీపీ నేత ఒకరు విసిరిన సవాల్, ఉద్యోగ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఇదెక్కడి సవాల్.? అసలు అధికార వైసీపీకి...

దేశంలో 11 రాష్ట్రాల్లో కరోనా ఉధృతి..! ఏపీ, తెలంగాణలో..

ఏపీలో గడచిన 24 గంటల్లో 13,474 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా కడప జిల్లాలో 2031 కేసులు నమోదయ్యాయి. 9 మంది కరోనాతో మృతి చెందారు. 10,290 మంది కరోనా నుంచి కోలుకున్నారు....

విజయ్ చిత్రానికి భారీ ఆఫర్ ఇస్తోన్న జీ సంస్థ

ఇళయథళపతి విజయ్ తన కెరీర్ లో తొలిసారి  డైరెక్ట్ తెలుగు చిత్రం చేయబోతున్నాడు. విజయ్ 66వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయనుండగా అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నాడు. ప్రస్తుతం ప్రీ...