ఏడ్చే మగాడ్ని అస్సలు నమ్మకూడదని అంటుంటారు. అదేంటో, బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఎనిమిదో సీజన్‌లో ఆ ఏడుపే హైలైట్.! ఇంత బాగా ఇంకెవరూ ఏడవలేరు.. అన్న కోణంలో బహుశా నాగ మణికంఠను బిగ్ బాస్ కొనసాగిస్తున్నట్లుంది.
దాదాపుగా ప్రతివారం ఎలిమినేషన్ కోసం నామినేట్ అవుతున్నాడు మణికంఠ. హౌస్‌లో అతని బిహేబియర్ అలా తగలడింది. ఎప్పుడు చూడు.. ఏడుపుగొట్టు వ్యవహారమే. తాజా ఎపిసోడ్‌లోనూ అదే పరిస్థితి. హౌస్‌కి చీఫ్.. అనగా, కెప్టెన్సీ లాంటిదన్నమాట.. దానికి సంబంధించిన ఓ టాస్క్.. అందులో నాగ మణికంఠ ఔట్ అయ్యాడు.
ఇది మామూలే.! హౌస్ మేట్స్, తమకు అవకాశమొచ్చినప్పుడు.. తోటి కంటెస్టెంట్లను రేసులోంచి తప్పిస్తుంటారు. మణికంఠ కూడా తొలగిస్తుంటాడు కదా.? మరి, అతన్ని ఇంకొకరు తొలగిస్తే, ఎందుకంత గుస్సా అవ్వాలి.?
తొలగించడం గురించేనా.? ఇంకేదన్నా కారణం వుందా.? హౌస్ అంతా ఒక్కటై తనను కార్నర్ చేస్తోందంటూ ఏడుపుమొహం పెట్టాడు.. ఈ ఏడుపుగొట్టు వ్యవహారమే లేటెస్ట్ ఎపిసోడ్‌లో హలైట్. సాధారణంగా అయితే, ఏడుపుగొట్టు సీరియల్స్‌కి బుల్లితెరపై క్రేజ్ ఎక్కువ.. అని అంటుంటాం.
బిగ్ బాస్ రియాల్టీ షోకి కూడా అదే బలమా.? అని అనుమానాలొస్తున్నాయిప్పుడు. కుక్క పిల్లల బొమ్మలు, వాటిని కుక్క పిల్లల గూళ్ళలో పెట్టడం.. ఇలా చీఫ్‌ని సెలక్ట్ చేసే టాస్క్ డిజైన్ చేశాడు బిగ్ బాస్. నిజానికి, ఇదొక వెర్రి వెంగళప్ప టాస్క్. అఫ్ కోర్స్.. బిగ్ బాస్ ఇచ్చే టాస్క్‌లు అన్నీ అంతేననుకోండి.. అది వేరే సంగతి.
అంతకు ముందు, ఫన్ మోడ్‌లో హౌస్ మేట్స్ తమ డైలీ రొటీన్‌ని ప్రారంభించారు. డాన్సులేయించాడు బిగ్ బాస్, కొందరు కంటెస్టెంట్లతో. కాస్త చిలిపి పనిష్మెంట్లు కూడా ఇచ్చాడనుకోండి.. అది వేరే సంగతి.
ఓవరాల్‌గా చూస్తే, ఇంకో చెత్త ఎపిసోడ్ ఈ రోజు (అంటే, అక్టోబర్ 2న) టెలికాస్ట్ అయ్యింది బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో, ఎనిమిదో సీజన్‌కి సంబంధించి.
కాగా, యష్మి – పృధ్వీ మధ్య వార్ ఆఫ్ వర్డ్స్ నడిచాయి. ఈ క్రమంలో పృధ్వీ, దురుసుగా వెళ్ళిపోయాడు. యష్మి ఏడ్చింది. ఆ తర్వాత పృధ్వీ తన తప్పు తెలుసుకుని, యష్మిని ఓదార్చేందుకు వచ్చి, ఆయనా ఏడ్చేశాడు.
అక్కడికేదో, ఈ రోజు ఏడుపుగొట్టు ఎపిసోడ్.. అన్నట్లుగానే ఏడుపులు ఎక్కువగా కనిపించాయ్. మిగతా కంటెస్టెంట్లు చీఫ్ అయ్యే అవకాశం కోసం పోరాడుతోంటే, విష్ణు ప్రియ.. పోతే పోయిందిలే.. అని లైట్ తీసుకుంటుండడం గమనార్హం. ప్రతిసారీ విష్ణు ప్రియది అదే పరిస్థితి.