పొద్దున్న లేస్తే ప్రతిదానికీ ఏడుపు మొహం పెడుతూ, ‘పెళ్ళాం – కూతురు’ అంటూ ఏడ్చే మణికంఠకి కాకుండా, నిఖిల్‌కి ఇంటి నుంచి వచ్చిన ‘వంట ప్లస్ మెసేజ్’ని యష్మి ఇవ్వడం ఏమిటో.!
బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఎనిమిదో సీజన్‌లో ఇంటి వంటలు – డ్రమెటిక్ ఎమోషన్ల పర్వం నడిచింది. అందులో ఓ చిన్న పార్ట్‌నే పైన ప్రస్తావించింది. ఎవరికి వారు బీభత్సంగా ఎమోషన్స్ నటించేశారు. గత సీజన్లలోనూ ఇదే పంచాయితీ. కాకపోతే, ఈసారి ఎమోషన్స్ పండించడం మరీ సిల్లీగా తయారయ్యిందంతే.
కంటెస్టెంట్లను బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్‌కి పిలవడం, వారి ముందు వంటలు పెట్టడం (కంటెస్టెంట్ల ఇంటి నుంచి తెచ్చినవి) వాటిని, ఎవరో ఒకరికి ఇవ్వాలని కండిషన్ పెట్టడం.. ఇదీ తంతు.!
ఆల్రెడీ చెప్పేసుకున్నాం కదా.. అందరూ మహానటులే. బిగ్ బాస్ ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం తెగ నటించేశారు. ఎమోషన్స్ పండవని తెలిసీ నటించేశారంటే, వీళ్ళనసలు ఏమనాలి.? యష్మి ఒక్కసారిగా తన ప్రవర్తన మార్చేసుకుంది. సోనియా నిన్న మొన్నటిదాకా చేసినట్టే యష్మి చేస్తోంది.
సోనియా హౌస్‌లో వున్నప్పుడు నిఖిల్, పృధ్వీలకు దూరంగా వున్న యష్మి, ఇప్పుడు ఆ ఇద్దరితో బోల్డంత స్నేహం పెంచేసుకుంది. సరే, హౌస్‌లో ఇలాంటివన్నీ మామూలే. అన్నీ డ్రమెటిక్ బాండింగ్సే.. ఇందులో ఇంకోమాటకు తావు లేదు.
ఇదిలా వుంటే, మరోపక్క మణికంఠతో ఓ కామెడీ స్కిట్ ప్లాన్ చేశాడు బిగ్ బాస్. నిజానికి, మణికంఠ ఆ టాస్క్ ఎలా డీల్ చేస్తాడోనని కంటెస్టెంట్లూ ఒకింత ఆశ్చర్యపోయారు. అయితే, మణికంఠ మాత్రం బాగానే చేశాడు. అతనో జోతిషుడు, అతని వద్ద కంటెస్టెంట్లు జాతకం చెప్పించుకుంటారు. ఇదీ టాస్క్.
కొంతమేర ఫన్ సృష్టించడానికి మణికంఠ కష్టపడ్డాడు. ఎప్పుడూ ఏడుపు మొహంతో కనిపించే మణికంఠలో ఈ యాంగిల్ కూడా వుందా.? అని అంతా అనుకున్నారు. బిగ్ బాస్ వ్యూయర్స్‌కి కూడా ఇదో సర్‌ప్రైజ్ ఎలిమెంట్. ఈ రోజు ప్రసారమైన ఎపిసోడ్‌లో ఇంతకు మించి చెప్పుకోడానికేమీ లేదు.!
వీకెండ్ వచ్చేసింది.. హోస్ట్ నాగ్ రేపు వచ్చేస్తాడు. ఎవర్నయినా మళ్ళీ బయటకు పంపుతాడా.? లోపలికి ఎవర్నయినా తీసుకొస్తాడా.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్. ఆల్రెడీ ఆదిత్య ఓం ఎలిమినేట్ అయిన దరిమిలా, ఇంకో ఎలిమినేషన్ వుంటుందనే భావిస్తున్నారంతా. ఇద్దరు కంటెస్టెంట్లు అదనంగా వైల్డ్ కార్డ్ రూపంలో హౌస్‌లోకి వచ్చే అవకాశం వుందట.