బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో, ఎనిమిదో సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లు, ఒకర్ని మించి ఇంకొకరు హౌస్‌లో సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. అందరిలోకీ, రోహిణి సమ్‌థింగ్ వెరీ స్పెషల్. ఎనిమిదో సీజన్‌లో చివరి మెగా చీఫ్ అయిన రోహిణి, తాజాగా టిక్కెట్ టు ఫినాలే రేసులో మొదటి కంటెండర్‌గా అవకాశం దక్కించుకుంది.
గతంలో బిగ్ బాస్ సీజన్‌లో కంటెస్టెంట్లుగా వున్న అలేఖ్య హారిక, అఖిల్ సార్ధక్.. ఇద్దరూ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి, బిగ్ బాస్ ఆదేశం మేరకు, ఎనిమిదో సీజన్ – టిక్కెట్ టు ఫినాలే రేసు కోసం కంటెండర్ల ఎంపిక ప్రక్రియను నిర్వహించారు.
ఈ క్రమంలో రెండు టాస్కుల్ని రోహిణి విజయవంతంగా పూర్తి చేసి, టిక్కెట్ టు ఫినాలే రేసులో మొదటి కంటెండర్ అయ్యింది రోహిణి. రోహణితోపాటు గౌతమ్, టేస్టీ తేజ, విష్ణు ప్రియ.. కంటెండర్ రేసు కోసం పోటీ పడినా, విజయం సాధించలేకపోయారు.
కాగా, ఈ టాస్కుల్లో ఫెయిల్ అయిన విష్ణు ప్రియకు బ్లాక్ స్టార్ ఇచ్చారు హారిక, అఖిల్. ఆ కారణంగా, టిక్కెట్ టు ఫినాలే కోసం కంటెండర్ రేసులోంచి విష్ణు ప్రియ ఔట్ అయిపోయింది.
మెగా చీఫ్ కిరీటం కోసం, కాలి నొప్పితోనూ పెర్‌ఫెక్ట్ బ్యాలెన్స్ చేసిన రోహణికి, టిక్కెట్ టు ఫినాలే రేసు కోసం జరిగిన కంటెండర్ షిప్ విషయంలోనూ అదే బ్యాలెన్స్ బాగా కలిసొచ్చింది.
కాగా, కంటెండర్ రేసులోంచి తనను తప్పించడంపై విష్ణు ప్రియ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తాను సరదాగా వుండడమే తాను చేసిన తప్పా.? అని విష్ణు ప్రియ ప్రశ్నించింది కన్నీరుమున్నీరవుతూ. అయితే, తన అవకాశాన్ని వేరొకరికి ఇచ్చేయాలన్న ఆలోచన తప్ప, ఆటలో సీరియస్‌నెస్ విష్ణు ప్రియకి లేదని అఖిల్, హారిక తేల్చారు.
కంటెండర్ పోటీలో తనకు అవకాశం లేకుండా పోవడాన్ని తట్టుకోలేకపోయిన విష్ణు ప్రియను ఓదార్చేందుకు ఆమె బుగ్గ గిల్లాడు అఖిల్. అంతకు ముందు పృధ్వీ – విష్ణుప్రియ మధ్య ఏముందన్న విషయమై ఇద్దర్నీ అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నించారు అఖిల్, హారిక.
విష్ణు తనకు స్నేహితురాలు మాత్రమేననీ, అంతకు మించి ఆమె మీద ఎలాంటి వేరే ఫీలింగ్ తనకు లేదని స్పష్టం చేశాడు పృధ్వీ. విష్ణు ప్రియ మాత్రం, పృధ్వీ అంటే తనకు ఇష్టమని చెప్పింది. ఆ వ్యవహారాన్ని పక్కన పెట్టి ఆట మీద ఫోకస్ పెట్టాలని అఖిల్, విష్ణు ప్రియకి సూచించాడు.
ఇంత జరుగుతున్నా ఇంకా రియాల్టీలోకి రాలేకపోతోంది విష్ణుప్రియ. ఆమెకి మరీ చాదస్తం ఎక్కువైపోతోంది పృధ్వీ విషయంలో.
అన్నట్టు, టిక్కెట్టు ఫినాలే రేసుకు సంబంధించి, తొలి కంటెండర్ పోటీ సందర్భంగా చేతులెత్తేశాడు టేస్టీ తేజ. కానీ, అనూహ్యంగా అతనికి అదృష్టం కలిసొచ్చింది. విష్ణు ప్రియకు బ్లాక్ స్టార్ ఇవ్వాలని అఖిల్, హారిక ఫిక్సవడంతో, అవకాశం పోతుందనుకున్న టేస్టీ తేజకి ఇంకోసారి కంటెండర్‌గా పోటీ పడేందుకు అవకాశం మిగిలే వుంది.