బిగ్ బాస్ లో ఆటకంటే కూడా పులిహోర యవ్వారాలే ఎక్కువ నడుస్తాయనేది గత సీజన్లు చూస్తేనే అర్థం అవుతుంది. ఇప్పుడు బిగ్ బాస్-8లో కూడా అదే జరుగుతోంది. మంగళవారం ఎపిసోడ్ చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది. సోమవారం నామినేషన్స్ లో మణికంఠ వచ్చేసి యష్మీని నామినేట్ చేశాడు. తర్వాత ఆమె వద్దకు వెళ్లి సారీ చెప్పాడు. కానీ ఆమె వినకపోవడంతో చిరాకు పడింది. దీంతో అతను వెనక నుంచి హగ్ చేసుకున్నాడు. దాంతో ఆమె మరింత చిరాకు పడింది. మణికంఠ ప్రవర్తనతో విసిగిపోతున్నానంటూ ఏడ్చేసింది. తర్వాత రేషన్ కోసం బిగ్ బాస్ మూడు గేమ్స్ పెట్టాడు.
రెండు టీమ్ లకు మూడు గేమ్స్ పెట్టడంతో అంతా రచ్చ రచ్చగా సాగింది. అయితే ఇందులో శక్తిటీమ్ రెండు, కాంతార టీమ్ ఒకటి గెలుచుకున్నాయి. గేమ్ సంగతి పక్కన పెడితే హౌస్ లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తోంది. పదే పదే పృథ్వీ యష్మీ వెంట పడుతున్నాడు. ఇక ఇదే విషయంలో సీత కూడా ఎంటర్ అవుతోంది. నేరుగా పృథ్వీని పిలిచి నువ్వు యష్మీని ఫ్లర్ట్ చేస్తున్నావా అని అడిగింది. లేదు అని పృథ్వీ చెప్పడంతో నాకు లైన్ క్లియర్ అయింది అంటూ తెగ సంతోషపడింది. అంతే కాకుండా కావాలంటే నన్ను ఫ్లర్ట్ చేసుకోవచ్చు అంటూ నేరుగానే హింట్ ఇచ్చేసింది.
ఆ తర్వాత సోనియా పృథ్వీని పిలిచి నీకు యష్మీ అంటే ఇష్టమా అంటూ లేదు అన్నాడు. కానీ సోనియా మాత్రం నవ్వేసింది. ఇక కిచెన్ లో యష్మీ బుగ్గ మీద పృథ్వీ ముద్దులు పెట్టాడు. ఆ తర్వాత పృథ్వీని వెనక నుంచి సీత హగ్ చేసుకుంది. మొత్తానికి యష్మీ వెంట పృథ్వీ పడుతుంటే.. పృథ్వీ వెంట సీత పడుతోంది. దీంతో హౌస్ లో ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎటు పోతుందో అని అంతా వెయిట్ చేస్తున్నారు. మరి పృథ్వీ ఎవరికి దక్కుతాడో వేచి చూడాలి.