బిగ్ బాస్ సీజన్ 8.. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఈ షో ఆదివారం గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. హీరోలు నాని, రానా దగ్గుబాటి, డైరెక్టర్ అనిల్ రావిపూడి, హీరోయిన్ నివేదా థామస్ వంటి స్టార్లను లాంచింగ్ ఈవెంట్ కి ఇన్వైట్ చేసి బిగ్ బాస్ వారితో మంచి ఆటలే ఆడించింది. గత ఏడు సీజన్లో ఎన్నడూ లేనట్లు ఈసారి కంటెస్టెంట్లను జంటలుగా పంపించి మరింత హైప్ క్రియేట్ చేసింది.
మొత్తం 14 మంది ఏడు జంటలుగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారు. హౌస్ లోకి వెళ్లిన వారిలో ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ. ఇందులో లాస్ట్ కంటెస్టెంట్ గా వచ్చిన నైనిక “ఢీ” షో ద్వారా సుపరిచితురాలే. అప్పట్లో మరొక “ఢీ” కంటెస్టెంట్, తన డాన్సింగ్ పార్ట్నర్ సాయి తో సన్నిహితంగా ఉంటూ పలు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది. ఆ తర్వాత వారిద్దరికీ బ్రేకప్ అయినట్లు కూడా నైనిక ఓ సందర్భంలో చెప్పింది.
ఒడిశా లోని జర్సాగూడ అనే మారుమూల ప్రాంతంలో పుట్టిన నైనిక చిన్నతనం నుంచే వివక్ష ఎదుర్కొందట. ఆడపిల్ల పుట్టిందని నైనిక తండ్రి ఆమె తల్లిని రోజు వేధించేవాడట. కొద్ది రోజులకి తన తండ్రి వారిని వదిలేశాడని ఓ ఇంటర్వ్యూలో చెప్పి ఎమోషనల్ అయింది. నైనికను పెంచి పోషించడం కోసం తన తల్లి ఒడిస్సా లోని సొంతింటిని అమ్మేసి జీవనోపాధి కోసం హైదరాబాద్ కి వచ్చేశారట. నైనికా కి చిన్నప్పటినుంచి డాన్స్ అంటే ఇష్టం ఉండటంతో ఆమె తల్లి అ దిశగా తనను ప్రోత్సహించింది. అలా డాన్స్ లో తనని తాను మెరుగుపరుచుకొని సినిమా అవకాశాల కోసం ఎదురుచూసింది.
ఈ క్రమంలో ఓ డైరెక్టర్ తనని కమిట్మెంట్ అడిగాడట. దీంతో అక్కడి నుంచి వెనక్కి వచ్చిన ఆమె “ఢీ” షో లో ఆడిషన్స్ ఇచ్చింది. అలా ఆ షోలో పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో తన డాన్స్ రీల్స్ చేసి మరింత పాపులర్ అయ్యింది. అలా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది.