Switch to English

బిగ్‌బాస్‌-3: ఈసారి లేడీ ‘బాస్‌’ ఖాయమా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,115FansLike
57,764FollowersFollow

మొదటి సీజన్‌కి శివ బాలాజీ, రెండో సీజన్‌కి కౌశల్‌ మండా విజేతలుగా నిలిచిన దరిమిలా, బిగ్‌బాస్‌ తెలుగు మూడో సీజన్‌కి ఓ మహిళను ‘బాస్‌’గా చెయ్యాలనుకుంటున్నారా.? ఔననే సమాధానం శ్రీముఖి మద్దతుదారుల నుంచి విన్పిస్తోంది సోషల్‌ మీడియాలో.. అదీ ఓ రేంజ్‌లో. ఈ సీజన్‌కి సంబంధించి సోషల్‌ మీడియాలో ఎక్కువమంది ‘సైన్యం’ వున్న కంటెస్టెంట్‌ శ్రీముఖినే. మొత్తంగా బిగ్‌బాస్‌ని ఆమె స్టడీ చేసేసిన తర్వాతనే, బిగ్‌బాస్‌-3కి ఓకే చెప్పిందట. అందుకు తగ్గట్టే హౌస్‌లో ఆమె గేమ్‌ ప్లానింగ్‌ కన్పిస్తోంది.

అందరితోనూ కలుపుగోలుగా వుండడం, అదే సమయంలో అందరికీ సమదూరం పాటించడం శ్రీముఖి గేమ్‌ ప్లాన్‌. రాహుల్‌ సిప్లిగంజ్‌తో మాత్రమే ఆమెకు ఎక్కువ గొడవలు జరిగాయి. అయితే చివరి వారానికొచ్చేసరికి.. ఆ గొడవలూ అటకెక్కేశాయి. ఎంటర్‌టైన్‌మెంట్‌ పరంగా శ్రీముఖి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె మంచి ఎంటర్‌టైనర్‌. దాదాపుగా ఏ రోజూ ఆమె డాన్స్‌ని మనం మిస్‌ అవలేదు ఈ సీజన్‌లో.

కాస్ట్యూమ్స్‌ విషయంలో చాలా హాట్‌గా కన్పిస్తూనే, చాలా వైబ్రెంట్‌గానూ కన్పించిందది శ్రీముఖి. అయితే టాస్క్‌ల విషయానికి వచ్చినప్పుడు చాలాసార్లు ఆమె ‘వ్యూహకర్త’ స్థానానికే పరిమితమైపోయింది. చిన్న టాస్క్‌లు సోలోగా ఆడాల్సి వస్తే చేతులెత్తేసింది కూడా. ఆ ఒక్కటీ మినహాయిస్తే, బిగ్‌బాస్‌ 3 విన్నర్‌ అయ్యేందుకు అన్ని అర్హతలూ ఆమెకు వున్నాయన్నది నిర్వివాదాంశం.

మరోపక్క, హోస్ట్‌ నాగార్జునని పొగడ్తలతో ముంచెత్తేయడం, నాగ్‌ కూడా శ్రీముఖికి క్లాస్‌ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆచి తూచి వ్యవహరించడం.. ఇవన్నీ శ్రీముఖిని ‘స్పెషల్‌ కంటెస్టెంట్‌’ అనేలా చేశాయి. మహిళా కోటాలో ఈసారి విన్నర్‌ని ఎంపిక చేస్తే, వేరే ఆప్షన్‌ లేదు.. శ్రీముఖి విన్నర్‌ అయి తీరాల్సిందే. ఒకవేళ అలాంటి వెసులుబాట్లు ఏమీ లేకపోయినా, ఆమె టాప్‌ 3 కంటెస్టెంట్స్‌లో ఒకరు. సో, టైటిల్‌ విన్‌ అయ్యే ఛాన్సెస్‌ శ్రీముఖికి చాలా ఎక్కువగా వున్నాయ్‌.

2 COMMENTS

సినిమా

సంక్రాంతికి నవ్వుల రాజ్యం… ‘అనగనగా ఒక రాజు’తో క్యూట్ కామెడీ సర్‌ప్రైజ్...

ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించేందుకు ‘అనగనగా ఒక రాజు’ చిత్రం సిద్ధమవుతోంది. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ ఫెస్టివల్...

CHIRU-VENKY: 29ఏళ్ళ క్రితం కల.. నేడు నిజం కాబోతున్న వేళ

CHIRANJEEVI-VENKATESH: సినిమాల్లో కొన్ని కొన్ని కాంబినేషన్లు ఊహకే మంచి బజ్ క్రియేట్ చేస్తాయి. స్టార్ హీరోలు, హీరో హీరోయిన్లు, హీరో దర్శకులు, హీరో ప్రొడక్షన్ హౌస్...

MSG: చిరంజీవి సినిమాకి ‘లీగల్ షీల్డ్’.. ఫేక్, నెగటివ్ రివ్యూలకు చెక్

MSG: ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా విషయంలో డిజిటల్ మిస్ యూజ్ కు అడ్డుకట్ట వేసేలా కీలక అడుగు పడింది. సినిమా ఏదైనా కొందరు...

Deepthi Sunaina: పాల రాతి బొమ్మ – ఈ డిజిటల్...

ఈరోజు దీప్తి సునయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె జీవితం, కెరీర్‌ను తిరిగి చూసుకుంటే… ప్రేమ, పోరాటం, పునర్నిర్మాణం అనే మూడు పదాలు స్పష్టంగా...

గాయని వరుణవికి చిరంజీవి రూ.5 లక్షల ఆర్థిక సాయం

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం గాయని వరుణవికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందజేసి, నిజ...

రాజకీయం

గిరి గ్రామాల అభివృద్ధిపై కూటమి ఫోకస్

గిరిజనాభివృద్ధి, గిరి ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన విషయంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రహదారి సౌకర్యం లేని గిరిశిఖర గ్రామాలను అభివృద్ధి...

కెంజుట్సులో పవన్ కళ్యాణ్‌కు అరుదైన ప్రపంచ గౌరవం

సినీ రంగం, రాజకీయాలు మాత్రమే కాకుండా మార్షల్ ఆర్ట్స్‌లోనూ తన ప్రత్యేకతను చాటుకుంటున్న పవన్ కళ్యాణ్ మరో అరుదైన ఘనతను సాధించారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము యుద్ధకళ అయిన ‘కెంజుట్సు’లో ఆయనకు అధికారికంగా...

కూకట్ పల్లిలో జనసేనకు బలమైన ఊపు… భారీగా పార్టీలో చేరికలు

తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కూకట్ పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీలో భారీగా చేరికలు చోటు చేసుకున్నాయి. పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలపై విశ్వాసంతో ముందుకు సాగాలని...

నెలలో ఒక్కరోజైనా గ్రామాలకు రండి… వైద్యుల సేవలు సమాజానికి కావాలి: పవన్ కళ్యాణ్

వైద్యులు దేవుళ్లతో సమానమని మన సంప్రదాయంలో చెబుతారని, తల్లిదండ్రులు జన్మనిస్తే డాక్టర్లు పునర్జన్మ ఇస్తారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఎంత బిజీ జీవితం ఉన్నప్పటికీ, కనీసం నెలలో ఒక...

వరద ముంపు కష్టాలకు ముగింపు… గొల్లప్రోలు బ్రిడ్జి పరిశీలనలో పవన్ కళ్యాణ్

పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని గొల్లప్రోలు హౌసింగ్ కాలనీ వద్ద సుద్దగడ్డ కాలువపై నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం సందర్శించారు. బ్రిడ్జి మొత్తం తిరిగి నిర్మాణ పనుల...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: ఉద్యోగంలో మేషం వారికి శుభవార్తలు – వృషభం వారికి ఆర్థిక లాభ సూచనలు

జనవరి 6, 2026 | మంగళవారం మేషం (Aries): ఈ రోజు చాంద్రమాన ప్రకారం మీకు శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి బాధ్యతలు పెరిగినా సంతృప్తి ఉంటుంది. అధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం...

గిరి గ్రామాల అభివృద్ధిపై కూటమి ఫోకస్

గిరిజనాభివృద్ధి, గిరి ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన విషయంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రహదారి సౌకర్యం లేని గిరిశిఖర గ్రామాలను అభివృద్ధి...

Daily Horoscope: ఉద్యోగంలో మెరుగుదలతో సింహం, ఆర్థిక లాభాల దిశగా వృషభం

జనవరి 7, 2026 బుధవారం రాశిఫలాలు మేషం (Aries): ఈ రోజు పనుల్లో వేగం పెరుగుతుంది. తీసుకున్న నిర్ణయాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో అనుకూల వాతావరణం ఉంటుంది. ఖర్చులు కొంత పెరిగినా అవసరమైనవే అవుతాయి....

Daily Horoscope: మిథునానికి ఉద్యోగంలో శుభవార్తలు, వృశ్చికానికి ఆర్థిక లాభ సూచనలు.

జనవరి 11, 2026 ఆదివారం రాశిఫలాలు: మేషం (Aries): ఈరోజు మేష రాశివారికి పనుల్లో వేగం పెరుగుతుంది. చంద్రబలం వల్ల నిర్ణయాలు సులభంగా తీసుకుంటారు. కుటుంబంలో చిన్న విషయాలపై చర్చలు రావచ్చు. ఖర్చుల విషయంలో...

టాలీవుడ్‌కు మరో ఫన్ ఫుల్ కామెడీ.. రాజేంద్రప్రసాద్ విడుదల చేసిన ఆసక్తికర టైటిల్

టాలీవుడ్‌లో వినోదాత్మక సినిమాలకు ప్రత్యేక గుర్తింపు ఉండగా, అదే బాటలో మరో ట్రెండీ కామెడీ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రాయల్ త్రోన్ ప్రొడక్షన్స్, ఓం సాయి రామ్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న...