నార్త్ లో సంచలన రియాలిటీ షో గా పాపులర్ అయిన బిగ్ బాస్ రియాలిటీ షో సౌత్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడ సత్తా చాటింది. తెలుగు, తమిళ భాషల్లో బిగ్ బాస్ రియాలిటి షో సూపర్ హిట్టు. ప్రస్తుతం మూడో సీజన్ మొదలయ్యే సమయం వచ్చేసింది. తెలుగులో జులై లో మూడో సీజన్ ప్రారంభం కానుంది. ఈ సీజన్ కోసం హోస్ట్ గా కింగ్ నాగార్జున ను రంగంలోకి దింపుతున్నారు. ఇక తమిళంలో జాతీయ నటుడు కమల్ హాసన్ హోస్ట్ గా చేస్తున్న మూడో సీజన్ ఈ నెల చివరి వారంలో ప్రారంభం కానుందట. ఇప్పటికే తమిళంలో రెండు సీజన్స్ పెద్ద దుమారమే రేపాయి.
తాజాగా మూడో సీజన్ కు సంబందించిన లిస్ట్ వచ్చేసింది. మరి ఈ మూడో సీజన్ లో పాల్గొనే వాళ్ళు ఎవరో తెలుసా .. మాజీ హీరోయిన్ కస్తూరి, సీనియర్ నటుడు రాధా రవి, నటుడు, సంగీత దర్శకుడు ప్రేమ్ జి, నటి విచిత్ర, పూనమ్ బజ్వా, చాందిని, హాస్యనటి మధుమిత,, నటుడు మోహన్ వైద్య, శక్తి చరణ్, సంతాన భారతి, శ్రీమణి, రమేష్ తిలక్, మృణాళిని, మోడల్ శ్రీ గోపిక,విజయ్ టివి రమ్య, గాయకుడూ క్రిష్ మొదలైనవారు పాల్గొంటారట. ఇందులో ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపిన వాళ్ళు ఉన్నారు.
మొత్తానికి బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకుని ఆ క్రేజ్ తో సినిమాల్లో మరిన్ని అవకాశాలు అందుకోవచ్చన్నది వీరి ఆలోచన. మరి వీరందరిలో ఎవరు బిగ్ బాస్ మూడో సీజన్ టైటిల్ విజేత అవుతారో చూడాలి.