బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఎనిమిదో సీజన్‌లో సరికొత్త సంచలనం.! ఔను, ఒకేసారి ఎనిమిది మంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా ఎనిమిది మంది ఒకేసారి హౌస్‌లోకి మిడ్ సీజన్ ఎంట్రీ ఇవ్వడం, వాళ్ళు కూడా గత బిగ్ బాస్ సీజన్లకు చెందిన కంటెస్టెంట్లు కావడం గమనార్హం.
ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, దాదాపు అందరూ ఎంటర్టైనర్లు కావడం. రోహిణి, నయని పావని, హరితేజ, గంగవ్వ, గౌతమ్, అవినాష్, మెహబూబ్, టేస్టీ తేజ ఎనిమిదో సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ మేట్స్ అయ్యారు.
వీళ్ళలో కొందరు స్టేజ్ పెర్ఫామెన్సెస్ ఇస్తే, ఇంకొందరి ‘ఏవీ’లు స్పెషల్‌గా డిజైన్ చేయబడ్డాయి. అందరూ, ‘బిగ్ బాస్ టైటిల్ గెలుస్తాం’ అనే ధీమాతోనే హౌస్‌లోకి అడుగు పెట్టారు. కాగా, ఈ స్పెషల్ ఎపిసోడ్ కోసం పలువురు సెలబ్రిటీల్ని తీసుకొచ్చారు.
ఆయా సెలబ్రిటీలు తమ తమ సినిమాల్ని బిగ్ బాస్ ద్వారా ప్రమోట్ చేసుకున్నారనుకోండి.. అది వేరే సంగతి. శ్రీవిష్ణు ‘స్వాగ్’ టీమ్‌తోనూ, సుధీర్‌బాబు ‘మా నాన్న సూపర్ హీరో’ టీమ్‌తోనూ, సుహాస్ ‘జనక అయితే గనక’ టీమ్‌తోనూ హౌస్‌లో సందడి చేశారు.
ఇద్దరేసి కొత్త కంటెస్టెంట్లను హౌస్‌లోకి పంపి, హౌస్‌లోని పాత కంటెస్టెంట్లలో ఇద్దరితో.. వారికి టాస్క్‌లు పెట్టి, ప్రైజ్ మనీ పెంచడం, రేషన్ విషయంలో హక్కులు కల్పించడం, ఇమ్యూనిటీ ఇవ్వడం.. ఇలా కొన్ని ప్రత్యేకతలు చూపించారు.
ఏమాటకామాటే చెప్పుకోవాలంటే హౌస్‌లో ఇప్పుడు కాస్త కళ కనిపిస్తోంది ఎంటర్టైన్మెంట్ పరంగా. అయితే, నిజంగానే కొత్త కంటెస్టెంట్లు ఎంటర్టైన్మెంట్ ఇస్తారా.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఎందుకంటే, గతంలో ఈ కంటెస్టెంట్లు ఆయా సీజన్లలో ఇవ్వాల్సిన మేర ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేకపోయారు.
అంతే, బిగ్ బాస్‌లో అంతా గందరగోళమే. బిగ్ బాస్ డైరెక్షన్‌లోనే అన్ని వ్యవహారాలూ నడుస్తాయి తప్ప, కంటెస్టెంట్లు తమ టాలెంట్ పూర్తిగా ప్రదర్శించడానికి వీలుండదు.
అన్నట్టు, కొత్త కంటెస్టెంట్లని హౌస్‌లో ‘కత్తి’ ఎవరు.? ‘సుత్తి’ ఎవరు.? అని నాగ్ ప్రశ్నిస్తే, ఆట పరంగా ‘కత్తి’ నబీల్ అని తేలింది. ‘సుత్తి’ విషయంలో దాదాపుగా అందరూ యష్మి పేరు చెప్పారు. ఒకరిద్దరు మాత్రం ‘సుత్తి’ కేటగిరీలో మణికంఠను వేశారు.
ఇంకో రెండు నెలలపాటు బిగ్ బాస్ నడుస్తుంది గనుక, ఇప్పటిదాకా నడిచిన సుత్తి కాకుండా, ఇకపై హౌస్ ఒకింత కళకళ్ళాడుతుందనీ, ఎంటర్టైన్మెంట్ వుంటుందనీ ఆశిస్తున్నారు బిగ్ బాస్ వ్యూయర్స్. అదే సమయంలో కొత్త కంటెస్టెంట్లకు మద్దతుగా గత సీజన్లలో వారితో కలిసి హౌస్‌లో సందడి చేసిన కంటెస్టెంట్లు, సోషల్ మీడియా వేదికగా ప్రమోషన్స్ చేసే అవకాశమూ లేకపోలేదు.
గంగవ్వ ఎందుకు దండగ.? అని ఆమెను చూడగానే కొంతమంది అనుకున్నారుగానీ, వస్తూనే హౌస్‌లో ఓ టాస్క్ ఆడేసి, అదరగొట్టేసింది గంగవ్వ. గంగవ్వ – అవినాష్ సంయుక్తంగా ‘ఇమ్యూనిటీ’ పొందేశారు.
రేపు నామినేషన్ల ఎపిసోడ్ ప్రసారం కానుంది. ప్రోమో చూస్తోంటే, పాత కంటెస్టెంట్లు (ఓజీ క్లాన్), కొత్త కంటెస్టెంట్లు (రాయల్ క్లాన్స్) మధ్య మాటల యుద్ధం గట్టిగానే నడిచినట్లు కనిపిస్తోంది. ఆ సంగతేంటో రేపు తెలుసుకుందాం.