Bigg Boss Telugu7: ఎవరో ఒకరికి టైటిల్ ఇచ్చేసి, మూసెయ్యొచ్చు కదా.? ఎందుకీ టార్చర్.? బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఏడో సీజన్ తాజాగా ఎపిసోడ్ చూస్తే ఇదే ఆవేదన సగటు బిగ్ బాస్ వ్యూయర్స్‌లో కనిపించడం సహజమే.!
‘బిబి ఇన్వెస్టిగేషన్’ అట.! వ్యక్తులు చచ్చిపోతుంటారట.! శివాజీ ఏదో చేస్తుంటాడట. పనికిమాలిన పోలీసులుగా అమర్ దీప్, అర్జున్ అత్యద్భుతంగా జీవించేస్తున్నారు. తింగరోడు యావర్.. అదో టైపు.! ప్రియాంక ఏం చేస్తోందో ఆమెకే తెలియదు. శోభా శెట్టి అతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
‘వచ్చేవారం చేస్తా.. వచ్చే వారం చేస్తా..’ అంటూ ఏ వారమూ ఏమీ చేయని రతిక ఈ వారం మాత్రం ఏం చేయగలుగుతుంది.? లిస్టు తీస్తే, హౌస్ మేట్స్ అంతా ‘పెర్ఫామెన్స్’ ఇచ్చేస్తున్నారు. కానీ, అంతా పరమ సోది వ్యవహారమే.!
పేస్ట్ తీసి, అద్దమ్మీద రాతలు రాయడం ఏమిటో.! రాసిన శివాజీ, ఇతరుల మీద అనుమానం వ్యక్తం చేయడమేంటో.! అంత పెద్ద హౌస్‌లో ఎవరికీ ఏమీ తెలియకపోవడం.. ఇంకా పెద్ద కామెడీ.
పోలీసోడేమో, అక్కడ దొరికిన తెల్ల వెంట్రుకతో ఇన్వెస్టిగేషన్ చేస్తాడట.! ఆ తింగరి పోలీస్ ఎవరో కాదు, అర్జున్.! చచ్చిపోయిన కంటెస్టెంట్లు దెయ్యాలుగా మారిపోతారు. పల్లవి ప్రశాంత్, అశ్విని ఆల్రెడీ దెయ్యాలయిపోయారు. వాళ్ళ అతి వేరే లెవల్ అంతే.!
గతంలో కూడా ఈ తరహా టాస్క్‌లు జరిగాయి. అంటే, గత సీజన్లలో. అవి కూడా పెద్దగా పేలలేదు. పేలవని తెలిసి కూడా ఇవే తరహా టాస్కుల్ని బిగ్ బాస్ ఎందుకు కంటెస్టెంట్లకు ఇస్తుంటాడో ఏమో.!
అవి చచ్చు టాస్కులని ప్రూవ్ అయ్యాక, వాటిల్లో ఆడుతున్న కంటెస్టెంట్లు అయినా కాస్తంత స్టఫ్ ఇవ్వాలి కదా.? చూస్తున్నవాళ్ళని వెర్రి వెంగళప్పల్ని చేయడం తప్ప, ఈ తరహా టాస్కుల వల్ల బిగ్ బాస్ రియాల్టీ షోకి కూడా ఎలాంటి ప్రయోజనమూ లేదు. రియాల్టీ షో ముగింపుకు వస్తున్న దరిమిలా, ఇంకా సాగతీతకు గురవుతోంది.
కంటెస్టెంట్లు ఏం మాట్లాడుతున్నారో.. ఎందుకు మాట్లాడుతున్నారో.. అసలు బిగ్ బాస్ ఎందుకిలాంటి టాస్కులు ఇస్తున్నాడో.! ఇంకెందుకు, ప్రేక్షకుల్ని పీడించుకు తినడానికే.!