Switch to English

బిగ్ బాస్ 5: కాజల్ గేమ్ ప్లాన్ కరెక్టేనా?

బిగ్ బాస్ 5లో నిన్నటి  ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ముందుగా కెప్టెన్సీ టాస్క్ ను చూపించారు. ఫైనల్ కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచిన  మానస్, సిరి, అన్నీ, ప్రియాంకల మధ్య ఫైనల్ కెప్టెన్సీ టాస్క్ జరిగింది. గార్డెన్ ఏరియాలో ఒక పెద్ద రింగ్ ను ఉంచి ఆ నలుగురు ఆ రింగ్ ను పట్టుకోవాలని చెప్పారు. లాస్ట్ వరకూ ఎవరైతే ఆ రింగ్ ను పట్టుకునే ఉంటారో వారు బిగ్ బాస్ టాస్క్ నెగ్గడంతో పాటు హౌజ్ తదుపరి కెప్టెన్ గా నిలుస్తారు.

ఈ టాస్క్ ను చాలా సునాయాసంగా మానస్ గెలిచాడు. సిరి, ఎన్నీ, ప్రియాంక గట్టిగా ప్రయత్నించినా కానీ పనవ్వలేదు. రవి తర్వాత కెప్టెన్ గా మానస్ అయ్యాడు. ఇక దాని తర్వాత ఎవిక్షన్ ఫ్రీ పాస్ ను టాస్క్ ను ఇచ్చాడు బిగ్ బాస్. గార్డెన్ ఏరియాలో ఒక ఫైర్ ట్రక్ పెట్టి ఎదురుగా ఇద్దరి ఇళ్ళులా పెట్టి టాస్క్ ఆడాలని చెప్పారు. టాస్క్ లో భాగంగా ఫైర్ టక్ లోకి బజర్ మోగగానే ఇద్దరు సభ్యులు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ కూర్చున్న ఇద్దరు ఇంటి సభ్యులు, ఎదురుగా హౌజ్ లో ఉన్న మరో ఇద్దరు ఇంటి సభ్యులలో నుండి ఒకరిని సేవ్ చేయాల్సి ఉంటుంది. చివరి వరకూ ఎవరైతే సేవ్ అయ్యి ఉంటారో వారు ఎవిక్షన్ ఫ్రీ పాస్ ను గెలుచుకుంటారు.

ఫస్ట్ బజర్ మోగినప్పుడు షణ్ముఖ్, రవి ఫైర్ ట్రక్ ఎక్కుతారు, వారికి శ్రీరామ్ మానస్ లలో ఒకరిని సేవ్ చేయమని చెబుతారు. ఇద్దరూ కాసేపు డిస్కస్ చేసుకుని శ్రీరామ్ ను సేవ్ చేస్తున్నట్లు ప్రకటిస్తారు. ఆ తర్వాతి రౌండ్ లో మానస్, సన్నీ ఫైర్ ట్రక్ ఎక్కగా రవి, ఎన్నీలలో ఎన్నీ మాస్టర్ ను సేవ్ చేస్తున్నట్లు తెలుపుతారు. థర్డ్ రౌండ్ షణ్ముఖ్, సిరి ఫైర్ ట్రక్ లో కూర్చోగా సన్నీ, ప్రియాంకల ఫోటోలు వస్తాయి. తమకు సన్నీతో పేబ్యాక్ ఉందని తనని సేవ్ చేస్తారు. శ్రీరామ్, ఎన్నీ కూర్చున్నప్పుడు షణ్ముఖ్, సిరిల ఫోటోలు రాగా ఇద్దరూ కూడా తమకు ఆడియన్స్ ఓట్లు చాలని, ఈ ఎవిక్షన్ పాస్ వద్దని చెబుతారు. అయినా కానీ సిరిని సేవ్ చేస్తారు. ఎన్నీ, ప్రియాంకలు సన్నీ, కాజల్ లలో సన్నీని సేవ్ చేస్తారు.

దీంతో లాస్ట్ కి ఎన్నీ, సన్నీ, సిరిలు మిగులుతారు. లాస్ట్ గా మానస్, కాజల్ లు ఫైర్ ట్రక్ ఎక్కుతారు. వారికి ఎన్నీ, సిరిల ఫోటోలు వస్తాయి. మానస్ సిరిని సేవ్ చేస్తానని చెప్తాడు. కానీ కాజల్ ఇద్దరినీ సేవ్ చేయొద్దు అప్పుడు సన్నీ కి ఆ పాస్ వస్తుందని అంటుంది. ఇది మంచి స్ట్రాటజీ కాదని ఎంత చెప్పినా కూడా వినదు. నువ్వు ఒక పేరు చెబితే నేను మరో పేరు చెబుతాను. అప్పుడు కచ్చితంగా ఇద్దరూ సేవ్ అవ్వరు అని అంటుంది. ఈ స్ట్రాటజీ నిజంగానే కాజల్ కు ఎదురుదెబ్బ అవుతుంది అనిపిస్తోంది. రేపటి ఎపిసోడ్ లో ఎవరు ఎవిక్షన్ పాస్ గెలుచుకుంటారో చూడాలి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

ఏపీలో నైట్ కర్ఫ్యూ వెనక్కు.. పండగే కారణం

ఆంద్ర ప్రదేశ్‌ ప్రభుత్వం తాజాగా కరోనా కేసుల కట్టడిలో భాగంగా నైట్‌ కర్ఫ్యూను అమలు చేయబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. సంక్రాంతి ముందు ఇలాంటి కర్ఫ్యూ...

పవన్‌ వీరమల్లు షూటింగ్ లో జాయిన్‌ అయ్యేది ఎప్పుడంటే..!

పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ విడుదలకు సిద్దం అయ్యింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యి విడుదల కు...

టీడీపీకి సినిమా పరిశ్రమ ఎప్పుడు సహకరించలేదు

టాలీవుడ్‌ కు చెందిన ప్రముఖులు తెలుగు దేశం పార్టీకి సహకరిస్తున్నారు.. వారికి కనీసం ఏపీ రాష్ట్రం ఉంది అని కాని.. సీఎంగా జగన్‌ మోహన్‌ రెడ్డి...

ప్రాజెక్ట్‌ కే విడుదలపై ఓ పుకారు

ప్రభాస్‌ నటించిన రాధే శ్యామ్‌ విడుదలకు సిద్దంగా ఉంది. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌ లో రూపొందిన రాధే శ్యామ్ ను సంక్రాంతికి విడుదల చేయాలని భావించినా...

తండ్రితో స్క్రీన్ షేర్ చేసుకొంటున్న శివాని రాజశేఖర్

రాజశేఖర్ లేటెస్ట్ గా శేఖర్ చిత్రంలో నటించిన విషయం తెల్సిందే. ఈ సినిమాను మొదట సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు కానీ కోవిడ్ పాజిటివ్ కేసులు బాగా...

రాజకీయం

ఏపీ వైసీపీ నేతలకు కోవిడ్ వస్తే, హైద్రాబాద్ పరిగెడుతున్నారెందుకు.!

అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ళలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్ధరించేశామని వైసీపీ చెప్పుకుంటోంది. కరోనా నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైద్రాబాద్‌కే పరిమితమైపోయారన్న వైసీపీ విమర్శల సంగతి సరే సరి....

చంద్రబాబు వన్ సైడ్ లవ్ పై పవన్ కల్యాణ్ స్పందన

ఇతర పార్టీలతో పొత్తు అంశంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. పార్టీ కార్య నిర్వాహక సభ్యులతో పవన్ మంగళవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటివల చంద్రబాబు చేసిన వన్...

యూపీలో బీజేపీ గట్టి దెబ్బ.. ఎస్పీలోకి మంత్రి ఎమ్మెల్యేలు జంప్‌

ఉత్తరప్రదేశ్‌ లో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు గాను అఖిలేష్ యాదవ్‌ పార్టీ అయిన సమాజ్ వాది పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ కి అత్యంత కీలకమైన ఉత్తర ప్రదేశ్...

చిరంజీవి ప్రజారాజ్యంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

మెగాస్టార్ చిరంజీవిపై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టకుంటే ఆనాడే అధికారంలోకి వచ్చేవాళ్లమని అన్నారు. చిరంజీవి పార్టీ పెట్టకముందు, తర్వాత కూడా తనతో బాగానే...

బులుగు జర్నలిజం: నష్టమొస్తే సినిమాలెందుకు తియ్యాలి.?

సినిమా అంటే వ్యాపారం.. విజయవంతమైన సినిమాల విషయానికొస్తే, 2 శాతం వరకు మాత్రమే వుంటుంది.. అలాంటప్పుడు, నష్టాల్లో సినిమా వ్యాపారమెందుకు చెయ్యాలి.? అంటూ బులుగు జర్నలిజం ఓ అద్భుతమైన ప్రశ్న సంధించేసింది. దాంతో,...

ఎక్కువ చదివినవి

సినిమా వేదికపై రాజకీయాలు మాట్లాడకూడదా.? ఇదేం పద్ధతి నాగ్.?

‘నేను రాజకీయాలు మాట్లాడదలచుకోలేదు, మాట్లాడను..’ అనేస్తే, అదో లెక్క. ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళది. నటుడు, నిర్మాత కూడా అయిన అక్కినేని నాగార్జున, నిజానికి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు సినిమాకి ఎదురవుతున్న ఇబ్బందులపై ఖచ్చితంగా...

తెలుగులో అందుబాటులో ఉన్న చిత్రానికి రీమేక్ ఏంటి సురేష్ బాబు?

రీమేక్ సినిమాలు మనకు కొత్తేమి కాదు. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుండి మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ మధ్య ఓటిటి కల్చర్ బాగా పెరిగాక రీమేక్ చేయాల్సిన అవసరం లేకుండా...

’13న నర్సాపురం వస్తున్నా.. ఫిబ్రవరి 5లోపు అనర్హత వేయించండి..’ రఘురామ సవాల్

ఏపీ సచివాలయ ఉద్యోగులకు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మద్దతు తెలిపారు. ‘ఏపీ సచివాలయ ఉద్యోగుల డిమాండ్లలో న్యాయముంది. సచివాలయ ఉద్యోగులకు నా మద్దతు తెలుపుతున్నాను. విజయసాయిరెడ్డి అండమాన్ దీవుల్లో తిరగడం మానేసి...

రండి.. కోవిడ్ వైరస్ అంటించుకోండి.! ఇదెక్కడి బాధ్యతారాహిత్యం.?

కోవిడ్ 19 కేసులు పెరుగుతున్నాయ్.. ఐదు వేలకు దిగువకు దేశంలో రోజువారీ కేసులు దిగివస్తున్న వేళ, అనూహ్యంగా కేసుల తీవ్రత పెరిగిపోయి.. లక్షన్నరకి చేరుకుంది. నాలుగైదు లక్షలకు రోజువారీ కేసులు చేరడానికి జస్ట్...

కరోనా తీవ్రమవుతోంది.. అప్రమత్తంగా ఉండండి: పవన్ కల్యాణ్..

దేశంలో రోజురోజుకీ తీవ్రమవుతున్న కరోనా పరిస్థితులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న తరుణంలో యావత్ ప్రజానీకం అప్రమత్తమవ్వాల్సిన అవసరం...