Switch to English

బిగ్ బాస్ 5: ప్రియా వల్ల సన్నీ ప్రవోక్ అయిపోయాడా? – ఎపిసోడ్ 44

బిగ్ బాస్ సీజన్ 5 లో ఈసారి నామినేషన్స్ చాలా కొత్త పంథాలో జరిగాయి. ముందుగా కంటెస్టెంట్స్ లో ముగ్గురు వేటగాళ్లు ఉంటారు. వారు జస్వంత్, శ్రీరామ్, సన్నీ. వీళ్ళ ముగ్గురూ వాళ్ళ డేరాలో ఉండాలి. అలాగే మిగతా కంటెస్టెంట్స్ గార్డెన్ ఏరియాలో ఒక చెట్టు ఉంటుంది దానికి కోతి బొమ్మలతో ఉన్న కంటెస్టెంట్ ఫోటోలు ఉంటాయి. ఇక లివింగ్ రూమ్ లో రెండు అరటిపళ్ళు ఉంటాయి. కోతి సౌండ్ చేసినప్పుడు ఆ రెండు అరిటిపళ్ళను ఎవరు పట్టుకుంటారో ఆ ఇద్దరూ తాము నామినేట్ చేయాలనుకున్న వ్యక్తుల పేరు చెప్పి తగిన కారణాలు చెప్పాల్సి ఉంటుంది.

అలాగే గన్ షాట్ వచ్చినప్పుడు డేరాలో ఉన్న వేటగాళ్లలో ఎవరు ముందు వస్తారో వారు ఆ కారణాలను విని నామినేట్ చేసిన ఇద్దరిలో ఒకరి పేరుని అంగీకరించాల్సి ఉంటుంది. ఈ నామినేషన్ ప్రాసెస్ మొత్తంలో కేవలం సన్నీ మాత్రమే డేరా నుండి ముందు వచ్చాడు. కనీసం శ్రీరామ్ ప్రయత్నించాడు కానీ జెస్సీ నుండి ఎలాంటి ప్రయత్నమూ రాలేదు.

ఇక ముందుగా కోతి సౌండ్స్ వచ్చినప్పుడు సిరి, షణ్ముఖ్ అరిటిపళ్ళను పట్టుకున్నారు. ఇద్దరూ కూడా ఎన్నీ మాస్టర్ పేరు చెప్పి నామినేట్ చేసారు. ఇద్దరూ ఒకే పేరు చెప్పడంతో ఎవరిది అంగీకరించినా ఎన్నీ మాస్టర్ నామినేట్ అవుతారు. అయితే షణ్ముఖ్ కారణం వాలిడ్ గా ఉందని సన్నీ అభిప్రాయపడ్డాడు. మొత్తం నామినేషన్స్ ప్రాసెస్ లో సన్నీ బయాస్డ్ గా చేసాడని మిగతా ఇంటి సభ్యులు భావించారు. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ప్రియా, మానస్ నామినేషన్స్ లోకి వచ్చినప్పుడు ప్రియా పేరును నామినేట్ చేసాడు సన్నీ కానీ తన ఫ్రెండ్ కావడంతోనే మానస్ ను నామినేట్ చేయలేదని ఆరోపించారు.

అలాగే అరటిపండును ప్రియా, ప్రియాంక సింగ్ పట్టుకున్నారు. ఆ సమయంలో ప్రియా, రవి సోఫా మీద టవల్ ఆరేసాడు, అందుకని రవిని నామినేట్ చేస్తున్నా అని ప్రియా చెప్పగానే కొంత మంది నవ్వారు. ఇదే నా నామినేషన్ కారణమని ప్రియా అన్నారు. ప్రియా సిల్లీ రీజన్ ఇవ్వడం, ఇతరులు నవ్వడంతో సన్నీ ఇరిటేట్ అయినట్లు అనిపించింది. దాంతో ప్రియాంక వాలిడ్ రీజన్ చెప్పినా కానీ వినకుండా నేను కూడా గేమ్ ఆడతాను అంటూ సన్నీ, రవిను నామినేట్ చేసాడు. అంత సిల్లీ రీజన్ చెప్పినా ఎలా యాక్సప్ట్ చేస్తావు అని రవి ఫైట్ చేసినా లాభం లేకపోయింది.

మొత్తానికి నామినేషన్స్ లో కాజల్, సిరి, ప్రియా, రవి, ఎన్నీ, శ్రీరామ్, జెస్సీ, లోబోలు ఉన్నారు. మిగిలిన వారందరూ అంటే షణ్ముఖ్, మానస్, సన్నీ, విశ్వ, ప్రియాంక సింగ్ లు ఈ వారం సేఫ్ అయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

లొకేషన్స్ వేటలో పడ్డ హరీష్ శంకర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టార్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతోన్న విషయం తెల్సిందే. గతంలో వీరి కాంబినేషన్ లో...

బిగ్ బాస్ 5: ఈసారి ఏ కంటెస్టెంట్ కు మూడింది?

బిగ్ బాస్ సీజన్ 5 తుది దశకు చేరుకుంటోంది. ఇంకా హౌజ్ లో ఏడుగురు మాత్రమే ఉన్నారు. ఈ వారాంతం ఒకరు ఎలిమినేట్ అవుతారు. అయితే...

అఖండ: బాక్స్ ఆఫీస్ వద్ద గర్జించిన బాలయ్య

ఒక మాస్ సినిమా కలిగించే ఊపు వేరు. బాక్స్ ఆఫీస్ వద్ద జాతర చేయడానికి వచ్చిన అఖండ పేరుకి తగ్గ రీతిలో అఖండమైన ఓపెనింగ్ ను...

బిగ్ బాస్ 5: ఆ నలుగురిలో టికెట్ టు ఫినాలే ఎవరికి?

బిగ్ బాస్ సీజన్ లో అతి ముఖ్యమైన ఘట్టమైన టికెట్ టు ఫినాలే ఇంకా కొనసాగుతోంది. కొంత మంది ప్లేయర్స్ కు గాయాలవడంతో టాస్క్ లను...

అఖండ మూవీ రివ్యూ

కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలవుతోన్న పెద్ద సినిమాగా అఖండ గురించి చెప్పుకోవచ్చు. బాలయ్య - బోయపాటి హ్యాట్రిక్ కాంబినేషన్ కావడంతో చిత్రంపై ఎన్నో...

రాజకీయం

పోలవరం రగడ: నోటి పారుదల కాదు మహాప్రభో.!

ఓ బులుగు ఎమ్మెల్యేకి పోలవరం ప్రాజెక్టు ఏ నది మీద కట్టారో కూడా తెలియదు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు.. వాటి దిగువన పోలవరం ప్రాజెక్టు.. అంటూ, గోదావరి నది మీద...

పార్లమెంటు సాక్షిగా రాష్ట్రం పరువు తీసేసిన వైసీపీ ఎంపీలు.!

‘మా రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతోంది మొర్రో..’ అంటున్నారు ఓ ఎంపీ.. ‘ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమే కష్టమైపోతోంది మహాప్రభో..’ అంటూ వాపోయారో మరో ఎంపీ.. ‘బ్యాంకుల్ని ముంచేశారు..’ అంటూ తమ పార్టీకి చెందిన ఎంపీ...

సిరివెన్నెలపై జగన్ పెద్ద మనసు.! సొంత సొమ్ములిచ్చారా.?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా పెద్ద మనసు చేసుకున్నారు. ప్రముఖ సినీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్యంతో ఇటీవల తుది శ్వాస విడువగా, ఆయనకు ఆసుపత్రిలో వైద్య చికిత్స కోసం...

ఆంధ్రప్రదేశ్‌పై నీతి అయోగ్ ప్రశంసలట.. నమ్మేద్దామా.?

నీతి అయోగ్, ఆంధ్రప్రదేశ్ మీద ప్రశంసలు గుప్పించేసింది. రాష్ట్రంలో వైఎస్ జగన్ పాలన అత్యద్భుతంగా వుందంటూ కితాబులిచ్చేసింది. గ్రామాలు అద్భుతంగా అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయట. సంక్షేమ పథకాల అమలు అద్భుతంగా వుందట. రైతు...

పోలవరం ప్రాజెక్టు ప్రారంభోత్సవమట.. ఎక్కడ.? ఎలా.?

నిన్న సాయంత్రం నుంచీ సోషల్ మీడియాలో పోలవరం ప్రాజెక్టు గురించి విపరీతమైన చర్చ జరుగుతోంది. డిసెంబర్ 1న పోలవరం ప్రాజెక్టు ప్రారంభోత్సవమట.. మేం వెళుతున్నాం చూడటానికి.. మీరూ వస్తారా.? అంటూ మీమ్స్ హోరెత్తుతున్నాయి. అసలు...

ఎక్కువ చదివినవి

తుది శ్వాస విడిచిన లెజండరీ రచయిత సిరివెన్నెల

ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక లేరు. కొద్దిసేపటి క్రితం ఆయన తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా ఆయన గత కొన్ని రోజులుగా హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నవంబర్ 24న...

త్రివిక్రమ్ నన్ను లేడీ పవన్ కళ్యాణ్ అన్నారు: నిత్యా మీనన్

సెన్సిబుల్ సినిమాలతో తన న్యాచురల్ యాక్టింగ్ తో తనకంటూ విశిష్టమైన పేరుని తెచ్చుకున్న నిత్యా మీనన్, భీమ్లా నాయక్ లో పవన్ కళ్యాణ్ కు పెయిర్ గా నటిస్తోన్న  విషయం తెల్సిందే. మలయాళ...

బాలీవుడ్ లో పాగా వేస్తోన్న రాధే శ్యామ్!

రెబెల్ స్టార్ ప్రభాస్ కు బాహుబలి తర్వాత నార్త్ లో భారీ క్రేజ్ ఏర్పడింది. సాహో చిత్రం ఇక్కడి అభిమానులను ఆకట్టుకోలేదు కానీ నార్త్ లో విశేష ఆదరణ సంపాదించుకుంది. ఏకంగా 150...

ఒమిక్రాన్ వస్తోంది.. మెడికల్ మాఫియా సర్వసన్నద్ధంగానే వుంది.!

కోవిడ్ మొదటి వేవ్ పుణ్యమా అని మెడికల్ మాఫియా చెలరేగిపోయింది.. కోవిడ్ రెండో వేవ్ దెబ్బకి మెడికల్ మాఫియా మరో లెవల్‌కి ఎదిగింది. ఇప్పుడు మూడో వేవ్ వస్తోందట. ఇంకేముంది.? మెడికల్ మాఫియా...

సిగ్గులేని రాత: చంద్రబాబు ప్రభుత్వమేంటి.? జగన్ ప్రభుత్వమేంటి.?

చంద్రబాబు హయాంలో.. వైఎస్ జగన్ హయాంలో.. అనాల్సింది పోయి.. చంద్రబాబు ప్రభుత్వం, వైఎస్ జగన్ ప్రభుత్వం.. అనే స్థాయికి జర్నలిజం ఏనాడో దిగజారిపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో అందరూ ఆ విధానాన్నే ఫాలో అవ్వాల్సి...