గతంలో కూడా నయని పావని బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ద్వారానే ఎంట్రీ ఇచ్చింది. వచ్చీ రాగానే హడావిడి చేసింది, అంతలోనే ఎలిమినేట్ అయిపోయింది. ఈ సీజన్‌లో కూడా నయని పావనిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారానే తీసుకొచ్చారు. ‘డీల్’ ముగియగానే, హౌస్‌లోంచి పంపించేస్తున్నారట.!
ఎలిమినేషన్ వ్యవహారం ఈ రోజు ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో చూపించబోతున్నారని నిన్ననే లీకులు అందాయ్. నిజానికి, ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది, ఈ వారం ప్రారంభమవడానికి ముందే డిసైడ్ అయిపోతోందనుకోండి.. అది వేరే సంగతి.
అయితే, ఎనిమిదో సీజన్‌లో కొన్ని ట్విస్టులున్నాయి. చివరి నిమిషంలో ఎలిమినేషన్లు రద్దవుతున్నాయి, అనూహ్యంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. నయని పావని విషయంలో ఏం జరుగుతుందో సాయంత్రానికి తేలుతుంది.
కాగా, నయని పావని.. ఇన్ని రోజులు హౌస్‌లో వుండటానికి ముందుగానే రెమ్యునరేషన్ ఫిక్స్ చేసుకుందనీ, దానికి అనుగుణంగానే ఆమె హౌస్‌లో డ్రమెటిక్‌గా వ్యవహరించిందనీ అంటున్నారు. మరోపక్క, కొందర్ని హౌస్‌లో బలవంతంగా కొనసాగిస్తున్నారనే ఆరోపణలూ లేకపోలేదు.
ఎలిమినేట్ అవుతాడనుకున్న గౌతమ్, అనూహ్యంగా హౌస్‌లో కొనసాగాడు. సాగదీసి సాగదీసి మణికంఠను హౌస్ నుంచి బయటకు పంపారు. ముందు ఫిక్స్ చేసుకున్న డీల్ ప్రకారంగానే మెహబూబ్‌ని హౌస్ నుంచి బయటకు పంపినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.
కాగా, సినిమా ఛాన్సులతోపాటు కొన్ని వీడియో ఆల్బమ్స్ కూడా కమిట్ అయిన నయని పావని, కేవలం గ్లామర్ కోసమే బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిందనీ, నిర్వాహకులు ఆమెకు గట్టిగానే రెమ్యునరేషన్ సమర్పించుకున్నారనీ అంటున్నారు.
సీజన్ ముగింపుకి వస్తున్న దరిమిలా, ఒక్కో వికెట్ పడిపోవడంలో వింతేముంది.? కాకపోతే, హౌస్‌లో వుండటానికి అర్హత లేనివాళ్ళే కొనసాగుతున్నారు.. విషయం వున్నోళ్ళు బయటకు వెళుతున్నారు.