సోషల్ మీడియా వేదికగా చాలామంది నెటిజనం సంధిస్తున్న ప్రశ్న ఇది. బిగ్ బాస్ రియాల్టీ షో ఇమేజ్ ఒక్కసారిగా పాతాళానికి పడిపోయింది. కాదు కాదు, పడేశారు.! ఇందులో బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున తప్పిదం ఏముంది.? ఏమీ లేకపోవడమేంటి.? నిర్వాహకులు ఏదో స్క్రిప్టు రాసిస్తే, అదే చదివెయ్యాలా.? కాస్తంత కామన్‌సెన్స్ వాడొద్దూ.?
గౌతమ్ – తేజ మధ్య ఓ టాస్క్ సందర్భంగా ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. తేజ ఓవరాక్షన్ చేశాడు. గౌతమ్ చాలా చాలా ఇబ్బంది పడ్డాడు. అది చూసి శివాజీ అలాగే సందీప్ పట్టించుకోనట్టు వ్యవహరించారు. సంచాలక్‌గా సందీప్ ఫెయిల్ అయ్యాడనీ, న్యాయం వైపు నిలబడాల్సిన శివాజీ కూడా మౌనం దాల్చాడనీ నాగార్జున బాగానే చెప్పాడు.
తప్పు జరిగింది. తప్పు చేసినోడ్ని శిక్షించాల్సిందే. తేజకి జైలు శిక్ష పడింది కూడా.! కానీ, ఆ తప్పుని చూస్తూ ఊరుకున్నోళ్ళకి ఇంకా పెద్ద శిక్ష విధించాలి కదా.? కానీ, అటు శివాజీనీ, ఇటు సందీప్‌నీ మందలించి వదిలేశాడు నాగార్జున. ఇంతకన్నా దారుణం ఇంకేముంటుంది.? గౌతమ్ గాయపడి వుంటే.. ప్రాణం పోయే పరిస్థితి అతనికి వచ్చి వుంటే.. ఊహించుకోవడానికే చాలా భయంకరంగా వుంది కదా.? నాగ్, దీన్ని ఎలా అంత లైట్ తీసుకున్నాడు.?
ఇంకో విషయానికొస్తే, శివాజీ – శుభశ్రీ మధ్య గొడవ. శివాజీ తనకు చాలా దగ్గరగా వచ్చేసి, ఇబ్బందికరంగా వ్యవహరించాడనీ, తాను చాలా ఇబ్బంది పడ్డానని శుభశ్రీ చెప్పింది. ఈ విషయమై కంటెస్టెంట్లు, హౌస్‌మేట్స్ అభిప్రాయాన్ని నాగార్జున తీసుకున్నాడు. శివాజీ చేసింది తప్పే.. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. కానీ, నాగ్ ఇక్కడా మాయ చేశాడు. పైగా, ఈ వ్యవహారంలో శివాజీకి శిక్ష పడాలని రతిక వాదిస్తే, ‘శుభశ్రీ లైట్ తీసుకుంది కదా.? నీకేంటి నొప్పి.?’ అంటూ నాగ్, ఇంకోసారి తన పైత్యాన్ని చాటుకున్నాడు.
మరో వ్యవహారంలో గౌతమ్ – శోభ మధ్య జరిగిన హీటెడ్ ఆర్గ్యుమెంట్‌కి సంబంధించి తప్పు గౌతమ్‌ది కాకపోయినా, అతనే తప్పు చేసినట్లు నాగార్జున తేల్చాడు. ఇక్కడా రతిక తన వాయిస్ బలంగా వినిపించింది. గౌతమ్‌కి అండగా నిలిచింది. ‘శుభశ్రీ విషయంలో తప్పు అన్నావ్.. శోభ విషయంలో తప్పు కాదంటున్నావ్..’ అంటూ నాగార్జున వింత వాదన వినిపించాడు.
ఈ మొత్తం వ్యవహారంలో అటు గౌతమ్‌ని ఇటు రతికనీ.. కంటెస్టెంట్లు, హౌస్ మేట్స్‌తోపాటు హోస్ట్ నాగార్జున కూడా టార్గెట్ చేసినట్లే కనిపిస్తోంది వ్యవహారం. ఈ రోజు ఎపిసోడ్ దెబ్బకి, బిగ్ బాస్ మీద చాలామందికి విరక్తి వచ్చేసింది. ఈ సీజన్ పతనం ఇక్కడి నుంచే ప్రారంభమయ్యిందనడం అతిశయోక్తి కాదేమో.!