బిగ్ బాస్ రియాల్టీ షో ఏడో సీజన్, ఒకింత రసవత్తరంగానే సాగుతోంది. సోమవారం.. నామినేషన్స్ డే.! తొలి వీకెండ్ కిరణ్ రాథోడ్ ఎలిమినేషన్ నేపథ్యంలో హౌస్‌లో సీనియర్ మోస్ట్ కంటెస్టెంట్ షకీలా మీద అందరి దృష్టీ పడింది. బీ-గ్రేడ్ సెక్స్ ఫిలింస్‌లో నటించిన శంగార తార షకీలా.! కొన్ని తెలుగు సినిమాల్లోనూ వ్యాంప్ తరహా పాత్రల్లో కనిపించిందామె.
షకీలా అంటే, అందరికీ తెలిసిన వ్యవహారం వేరు.! ఇక్కడ బిగ్ బాస్ రియాల్టీ షోలో కనిపిస్తున్న షకీలా వేరు. స్మోకింగ్ రూమ్‌లో సిగరెట్ కాల్చుతూ కనిపిస్తున్నా, షకీలా మాటలు.. చాలామందిని ఆకట్టుకుంటున్నాయి. హౌస్‌లో అందరూ ఆమెని ‘షకీ అమ్మ’ అనే పిలుస్తున్నారు. అంతలా ఆమెకు ఇంత గౌరవం ఎందుకు ఇస్తున్నట్లు.?
నామినేషన్స్ సందర్భంగా, ‘మీరంతా నా పిల్లలు. నువ్వు నా పక్కన ఒకే బెడ్ మీద పడుకున్నా, నాకేమీ అనిపించదు. నువ్వు అలాంటివాడివి కాదు. నేనే కాదు, ఏ ఫిమేల్ కంటెస్టెంట్ పక్కన పడుకున్నా అంతే. మీరు మంచి అబ్బాయిలు. అమ్మాయిలు కూడా అంతే. ఇక్కడ గెలవడానికి వచ్చారు..’ అని షకీలా, ఓ మేల్ కంటెస్టెంట్ గురించి చేసిన వ్యాఖ్యలు, బిగ్ బాస్ మీద ఇప్పటిదాకా వున్న చెడ్డ పేరుని చెరిపేశాయ్.
ఇక, అదే సందర్భంలో, ‘అమ్మాయిలంతా ఒక రూమ్‌లో..’ అని షకీలా చేసిన కామెంట్స్ నచ్చలేదంటూ, కంటెస్టెంట్ గౌతమ్ చెప్పినప్పుడు, ‘ఆ కాంటెస్ట్ వేరు..’ అని షకీలా డిఫెండ్ చేసిన విధానం, చూస్తోన్న వ్యూయర్స్‌కి బాగా నచ్చింది. నామినేట్ చేసినందుకు సారీ చెప్పాల్సిన పరిస్థితి క్రియేట్ అయ్యిందక్కడ.
ఓవరాల్‌గా చూస్తే, ఈ సీజన్‌లో షకీలా నిజంగానే ఓ స్పెషల్ కంటెస్టెంట్ అయిపోయింది. హోస్ట్ నాగార్జున సహా అందరూ, షకీలాని రెస్పెక్ట్ చేస్తున్నారంటే.. సమ్‌థింగ్ స్పెషల్ కదా.!
ఇక, గౌతమ్ – రతిక మధ్య ఆర్గ్యుమెంట్ కావొచ్చు, అమర్‌దీప్ అగ్రెషన్ కావొచ్చు, శివాజీ సెటైర్లు, శోభా శెట్టి అసహనం.. ఇవన్నీ నామినేషన్ ఎపిసోడ్‌ని రసవత్తరంగా మార్చేశాయి. క్రమంగా టెలికాస్ట్ అవుతున్న డెయిలీ ఎపిసోడ్ కంటే, లైవ్ మీదకీ ఎక్కువగానే వ్యూయర్స్ దృష్టి వెళుతోంది.