Switch to English

బిగ్ బాస్ 5: మొదటి ఫైనలిస్ట్ శ్రీరామ్, మరి సిరి పరిస్థితి?

బిగ్ బాస్ 5 లో మొత్తానికి టికెట్ టు ఫినాలే టాస్క్ ముగిసింది. ఈ టాస్క్ లో భాగంగా మొన్నటి ఎపిసోడ్ లో ముగ్గురు ఎలిమినేట్ అయిన విషయం తెల్సిందే. కాజల్, ప్రియాంక, షణ్ముఖ్ ఎలిమినేట్ అవ్వగా ఈ టాస్క్ లో తర్వాతి రౌండ్స్ లో సిరి, మానస్, సన్నీ, శ్రీరామ్ లు వెళ్లారు. నాలుగో రౌండ్ కు వారు నలుగురు కలిసి ఫోకస్ ను ఎంచుకున్నారు. ఇందులో భాగంగా బిగ్ బాస్ డిఫరెంట్ సౌండ్స్ ను మానిటర్ లో ప్లే చేస్తారు. దాన్ని గుర్తుపెట్టుకుని ఈ నలుగురు బోర్డ్స్ పై రాయాల్సి ఉంటుంది. ఈ టాస్క్ లో సిరి నాలుగో స్థానంలో నిలవగా శ్రీరామ్ మూడో స్థానంలో, మానస్, సన్నీ మొదటి స్థానంలో నిలిచారు. దీంతో పాయింట్స్ మానస్ కు 25, శ్రీరామ్ 21, సిరికు 19, సన్నీకి 17గా మారింది. ఈ టాస్క్ ఆడుతున్న సమయంలో కాజల్ పూర్తిగా ఇరిటేట్ చేసింది. సమాధానాలను ముందే చెప్పేయడం, గట్టి గట్టిగా మాట్లాడడం చేయడంతో తన ఫ్రెండ్ అయిన సన్నీకే చాలా కోపం వచ్చింది.

ఇక ఐదవ టాస్క్ గా యాక్యురసీని ఎంచుకోగా అందులో ఒక ఎలక్ట్రిక్ బోర్డ్ ఇచ్చి, దానికి చాలా బల్బ్స్ ను అమర్చారు. ఇద్దరు ఇద్దరుగా ఈ టాస్క్ లో పాల్గొనాల్సి ఉంటుంది. టాస్క్ లక్ష్యం ప్రత్యర్థి కంటే ముందుగా అన్నీ బల్బ్స్ వెలిగేలా చూడటం. ఈ టాస్క్ లో శ్రీరామ్, సిరి తరుపున షణ్ముఖ్ ఆడాడు. ఈ టాస్క్ లో మానస్ నాలుగో స్థానంలో నిలవగా, సిరి మూడవ స్థానంలో సన్నీ రెండవ స్థానంలో శ్రీరామ్ మొదటి స్థానంలో నిలిచాడు.

ఈ రౌండ్ పూర్తయ్యాక సిరి, సన్నీ కూడా ఎలిమినేట్ అయ్యారు. ఫైనల్ టాస్క్ శ్రీరామ్, మానస్ మధ్య జరిగింది. వీరిద్దరికీ ఒక సాండ్ బ్యాగ్ ఇచ్చి నిలువుగా పేర్చిన నాలుగు పలకలను ఆ సాండ్ బ్యాగ్ తో కుర్చీలో కూర్చునే పగలకొట్టాల్సి ఉంటుంది. ఈ టాస్క్ లో గెలిచిన వ్యక్తి ఇంటి ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతాడు. శ్రీరామ్ ఈ టాస్క్ ను కొంత తెలివితో ఆడాడు. అందులోనూ మానస్ సాండ్ బ్యాగ్ ఒక చోట స్ట్రక్ అయిపోవడంతో గేమ్ ఆగిపోతుంది. ఏదైతేనేం ఇంటి మొదటి ఫైనలిస్ట్ గా శ్రీరామ్ నిలిచాడు.

నిజానికి శ్రీరామ్ కు టికెట్ టు ఫినాలే అవసరం లేదు. ఎలాగైనా తను ఫైనల్స్ కు చేరుకుంటాడు. అది సిరి లేదా మానస్ కు వచ్చి ఉంటే వారికి ఉపయోగపడేది. దీని వల్ల ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ పరంగా సిరికి డేంజర్ ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లా మీరూ వాయిదా వేసుకోండి: పేర్ని నాని

కరోనా కేసుల నేపథ్యంలో ధియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. రామ్ గోపాల్ వర్మతో...

హిందీలో అస్సలు ‘తగ్గేదే లే’ పుష్ప

ఐకాన్ స్టార్ గా టైటిల్ మార్చుకున్న అల్లు అర్జున్ నిజంగా తాను ఆ టైటిల్ కు సరిపోతానని పుష్ప ది రైజ్ తో నిరూపించుకున్నాడు. ఈ...

ప్రభాస్ ప్రాజెక్ట్ కె రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన దత్

రెబెల్ స్టార్ ప్రభాస్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెల్సిందే. దాదాపుగా 2000 కోట్లకు పైన బిజినెస్ చేయగల చిత్రాలు ప్రభాస్...

శ్యామ్ సింగ రాయ్ డైరెక్టర్ పై చరణ్ ఆసక్తి

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్, ఆచార్య చిత్రాల రిలీజ్ ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్...

సంక్రాంతి సినిమాల లిస్ట్ ఫైనల్ అయిందిగా

ఎప్పుడైతే ఆర్ ఆర్ ఆర్, రాధే శ్యామ్ లు సంక్రాంతి రేసు నుండి పక్కకు తప్పుకున్నాయో ఇక అదే అదునుగా చాలా చిన్న చిత్రాలు సంక్రాంతి...

రాజకీయం

ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లా మీరూ వాయిదా వేసుకోండి: పేర్ని నాని

కరోనా కేసుల నేపథ్యంలో ధియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. రామ్ గోపాల్ వర్మతో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు....

’13న నర్సాపురం వస్తున్నా.. ఫిబ్రవరి 5లోపు అనర్హత వేయించండి..’ రఘురామ సవాల్

ఏపీ సచివాలయ ఉద్యోగులకు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మద్దతు తెలిపారు. ‘ఏపీ సచివాలయ ఉద్యోగుల డిమాండ్లలో న్యాయముంది. సచివాలయ ఉద్యోగులకు నా మద్దతు తెలుపుతున్నాను. విజయసాయిరెడ్డి అండమాన్ దీవుల్లో తిరగడం మానేసి...

కరోనా తీవ్రమవుతోంది.. అప్రమత్తంగా ఉండండి: పవన్ కల్యాణ్..

దేశంలో రోజురోజుకీ తీవ్రమవుతున్న కరోనా పరిస్థితులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న తరుణంలో యావత్ ప్రజానీకం అప్రమత్తమవ్వాల్సిన అవసరం...

ఫలిస్తున్న జగన్ ఢిల్లీ టూర్: ప్రత్యేక హోదా వచ్చేస్తోందా.?

కలిసొచ్చే అంశమేదన్నా వుందంటే, దానికి తమ ‘పేరు’ తగిలించేసుకోవడం అధికారంలో వున్నవారికి సర్వసాధారణమే. ఏదన్నా తేడా కొడితే మాత్రం, ‘మా ప్రయత్నం మేం చేశాం..’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కడం కూడా మామూలే. ముఖ్యమంత్రి...

అన్నీ ఒమిక్రాన్ కేసులే.. కానీ, లెక్క నాలుగు వేలే.!

దేశంలో కోవిడ్ 19 యాక్టివ్ కేసుల సంఖ్య ఏడు లక్షలకు పైగానేనని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. రోజువారీ కొత్త కోవిడ్ 19 పాజిటివ్ కేసుల సంఖ్య నిన్న లక్షా ఎనభై వేలు. చిత్రమేంటంటే,...

ఎక్కువ చదివినవి

వ్యాక్సిన్ మాయాజాలం: కోవిడ్ కేసులు మళ్ళీ పైపైకి.!

‘200 మందికి కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సోకితే, అందులో ఒకరికి మాత్రమే ఆక్సిజన్ అవసరమవుతోంది..’ అంటూ ఓ అధ్యయనం ఇటీవల వెలుగు చూసింది. ఇందులో నిజమెంత.? అన్నదానిపై మళ్ళీ భిన్న వాదనలున్నాయి....

జనసేనపై ముద్రగడాస్త్రం.! కోవర్టు ఆపరేషన్ లాంటిదే.!

జనసేన పార్టీ మీద ‘కాపు’ ముద్రని బలవంతంగా వేసేస్తున్నాయి అధికార వైసీపీ, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ. అదే సమయంలో, ‘కాపు’ నేతలతోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని తిట్టిస్తుండడం ద్వారా వైసీపీ, తెలుగుదేశం......

రాజమౌళి కోసం రామాయణాన్ని వదులుకున్న మహేష్?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫెవరెట్ దర్శకులలో దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఒకడు. రాజమౌళితో పనిచేయడం పట్ల పలు మార్లు ఆసక్తిని కనబరిచాడు. నిజానికి బాహుబలి తర్వాత మహేష్ తోనే జక్కన్న...

మింగలేక కక్కలేక.. ఏపీ ఉద్యోగుల అంతర్మధనమిదీ.!

ఎగేసుకుంటూ వెళ్ళారు.. నీరసంగా బయటకొచ్చారు.. కానీ, మొహాన నవ్వు పులుముకోక తప్పలేదు. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల నేతల పరిస్థితి ఇదీ.! లోపల ఏమయ్యింది.? అంటే, ‘ఆల్ ఈజ్ వెల్..’ అనలేంగానీ.. అంటూ సన్నాయి...

జస్ట్ ఆస్కింగ్: ఓటుకు నోటు.! ఎందుకు పెరుగుతోంది రేటు.?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సినీ పరిశ్రమ వైపుకు ప్రశ్నాస్త్రాలు దూసుకెళుతున్నాయి సినిమా టిక్కెట్ల వ్యవహారానికి సంబంధించి. వినియోగదారుడికీ, ఉత్పాదకుడికీ మధ్యన ప్రభుత్వ ప్రమేయమెందుకు.? అంటూ వివాదాస్పద ఫిలిం మేకర్ రామ్ గోపాల్ సంధించిన...