మంగళ వారం ప్రసారం అయిన బిగ్ బాస్ ఎపిసోడ్ 24లో గొప్ప సంఘటనలు ఏమీ లేవు. ఉక్కు హృదయం టాస్క్ విషయమై మరోసారి అభిజిత్ మరియు సోహెల్ ల మద్య మాటల యుద్దం సాగింది. అఖిల్ ఇప్పటికే మోనాల్ తో పులిహోర కలుపుతన్న విషయం తెల్సిందే. కొత్తగా వచ్చిన స్వాతి దీక్షిత్ తో కూడా ఆయన చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో అఖిల్, మోనాల్, స్వాతిలు కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో అఖిల్.. స్వాతిలు మాట్లాడుకుంటూ ఉండగా మోనాల్ అక్కడ నుండి లేచి వెళ్లందుకు ప్రయత్నించింది. అప్పుడు స్వాతి ఆపి మరీ కూర్చో అంది. ఆ తర్వాత అఖిల్ ను టీజ్ చేస్తూ మోనాల్ అక్కడ నుండి వెళ్లింది. ఆ తర్వాత కూడా అఖిల్ మరియు స్వాతిల మద్య చర్చ జరిగింది.బిగ్ బాస్ 4:
ఇక అభిజిత్, సోహెల్ల గొడవ విషయానికి వస్తే టాస్క్ లో నాగార్జున గారు మా ప్రదర్శణ బాగుందన్నారు అంటూ అభిజిత్ అన్నాడు. అప్పుడు సోహెల్ స్పందిస్తూ మా ప్రదర్శణ కూడా బాగుందని బిగ్ బాస్ స్వయంగా ప్రకటించాడు. ఆడవారిని అడ్డు పెట్టుకుని ఆడవారితో గేమ్ ఆడటం కాదు దమ్ముంటే మగాడిలా ఆడు అంటూ సోహెల్ చాలా సీరియస్ గా అభిజిత్ పై వ్యాఖ్యలు చేశాడు. ఆ సమయంలో అభిజిత్ సీరియస్ గా స్పందిస్తూ ఆడవారితో గీరించుకుని రక్కించుకునేంత అగ్రసివ్ అవ్వను అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఇద్దరి మద్య మాటకు మాట పెరుగుతుంటే ఇంటి సభ్యులు కూల్ చేశారు.
ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా కాయిన్స్ గేమ్ ను పెట్టారు. పై నుండి పడే కాయిన్స్ ను ఇంటి సభ్యులు పట్టుకోవాల్సి ఉంటుంది. ఎవరి వద్ద ఎక్కువ కాయిన్స్ ఉంటే వారు కెప్టెన్సీకి పోటీ దారుడు అవుతాడు అంటూ బిగ్ బాస్ ప్రకటించారు. నిన్నటి ఎపిసోడ్ లో కాయిన్స్ గేమ్ ఇంకా పూర్తి అవ్వలేదు. నేడు ఆ గేమ్ పూర్తి అయ్యి కెప్టెన్సీ టాస్క్ ఉండే అవకాశం ఉంది. కాయిన్ గేమ్ లో కూడా సోహెల్ కాస్త ఎగ్రసివ్ అయ్యాడు. ఇక ఎవరికి వారు తమ కాయిన్స్ ను దాచి పెట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. మొదట ఇద్దరు ముగ్గురుగా కలిసి గేమ్ ఆడుతుండటంతో బిగ్బాస్ ఎవరి గేమ్ వారే ఆడాలి. ఎవరి కాయిన్స్ వారే చివరకు చెప్పాలంటూ బిగ్బాస్ హెచ్చరించారు.
306206 741737You created some decent points there. I looked on the internet for the problem and located most individuals will go along with along with your site. 138444