బిగ్ బాస్ సీజన్ 9 మంగళవారం ప్రసారమైన 38వ ఎపిసోడ్ మొత్తం ఫుల్ డ్రామాతో నిండిపోయింది. ఈరోజు కూడా “బాల్ నామినేషన్” టాస్క్ కొనసాగుతూ, ప్రతి రౌండ్‌లో కొత్త ట్విస్ట్‌లు, కొత్త కాంబినేషన్లు ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేశాయి. నిన్న ఆల్రెడీ రెండు రౌండ్స్ పూర్తి అయ్యాయి. నిన్నటి రోజు పవన్, సుమన్ లు నామినేషన్ లో ఉన్నారు. అయితే.. ఈరోజు ఎవరు ఎవరిని నామినేట్ చేశారు? ఎవరు సేవ్ అయ్యారు? చివరికి ఎవరు నామినేషన్‌లో చిక్కుకున్నారు? ఒకసారి వివరంగా చూద్దాం!
🔥 3వ రౌండ్‌లో మాధురి షాక్ – రీతూ కదిలించిన ఆట!
మాధురి ఈ రౌండ్‌లో బాల్ దక్కించుకుంది. ఆ బాల్‌ను ఆమె రీతూ కి ఇచ్చింది. రీతూ తన పవర్‌ను ఉపయోగించి భరణి, దివ్య లను నామినేట్ చేసింది. రీతూ నామినేషన్ వల్ల భరణి, దివ్య ఇద్దరూ బాధతో కూర్చున్నారు. దివ్య తనకు ఫేవర్ చేసినా కూడా రీతూ నామినేట్ చేయడం చూసి షాక్ అయింది. కానీ మాధురి కి ఉన్న ప్రత్యేక పవర్‌తో ఆమె భరణి ని సేవ్ చేసి, దివ్య ను నామినేషన్‌లోనే ఉంచింది.
💥 4వ రౌండ్‌లో సంజన ఫైర్ – భరణి పై ఘాటు మాటలు!
తదుపరి రౌండ్‌లో గౌరవ్ బాల్ ను చేజిక్కించుకొని, సంజన కు ఇచ్చాడు. సంజన తన పవర్ ను ఉపయోగించి రాము మరియు భరణి లను నామినేట్ చేసింది. దీంతో ఇంట్లో హీటెడ్ ఆర్గ్యుమెంట్ మొదలైంది. భరణి వాయిస్ ఎగసి పడింది, రాము తో కూడా సంజనకు తగువే తగింది. చివర్లో గౌరవ్ తనకు ఉన్న పవర్ తో రాము ను సేవ్ చేసి, భరణి ను నామినేషన్‌లో ఉంచాడు.
🎭 5వ రౌండ్‌లో గౌరవ్ మళ్లీ అదరగొట్టాడు – ఆయేషా మూవ్ సర్ప్రైజ్!
తదుపరి రౌండ్ బాల్ ఫైట్‌లో మళ్లీ గౌరవ్ బాల్ ను సొంతం చేసుకున్నాడు. ఈసారి ఆయన బాల్ ను ఆయేషా అభ్యర్ధన మేరకు ఆయేషా కు ఇచ్చాడు. ఆయేషా ఈ పవర్ ను సుమన్ కు అందజేసింది. సుమన్, తన టర్న్ లో తనూజ మరియు సంజన ను నామినేట్ చేశాడు. కానీ ట్విస్ట్ ఇక్కడే – ఆయేషా కి ఉన్న పవర్ తో సంజన ను సేవ్ చేసి, తనూజ ను నామినేషన్‌లో ఉంచింది.
⚡ కెప్టెన్ కల్యాణ్ కడపటి ట్విస్ట్ – రాము పై బిగ్ బాస్ పవర్!
ఇన్ని రౌండ్ల తర్వాత బిగ్ బాస్ కెప్టెన్ కల్యాణ్ కు ప్రత్యేక సూచన ఇచ్చాడు. ఇప్పటివరకు నామినేషన్ లో లేని పాత సభ్యుడిని ఒకరిని నామినేట్ చేయమని చెప్పారు. ఆ పవర్ ను ఉపయోగించి కల్యాణ్, రాము ను నామినేట్ చేశాడు. ఈ నిర్ణయం హౌస్ లో అందరినీ ఆశ్చర్యపరిచింది.
📢 ఫైనల్ నామినేషన్ లిస్ట్ – ఈ వారం ఎవరు ఉంటారు ?
బిగ్ బాస్ చివరగా ప్రకటించిన నామినేట్ అయిన సభ్యుల జాబితా ఇలా ఉంది: సుమన్, పవన్, దివ్య, భరణి, తనూజ, రాము.
ఈ వారం ఎవరు సేఫ్ అవుతారు, ఎవరు బిగ్ బాస్ ఇంటి నుండి బై చెప్పబోతున్నారు అనే ఉత్కంఠ ప్రేక్షకులను వేధిస్తోంది. నామినేషన్ డ్రామా, ఫ్రెండ్‌షిప్ బ్రేక్‌లు, ఎమోషనల్ మోమెంట్స్ తో ఈ ఎపిసోడ్ సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
🎬 సమీక్ష:
38వ ఎపిసోడ్ బిగ్ బాస్ అభిమానులకు ఒక పర్‌ఫెక్ట్ మసాలా ప్యాకేజ్. డ్రామా ఉంది, ఫీలింగ్స్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి! రీతూ, భరణి, సంజన, మాధురి, గౌరవ్ — అందరి గేమ్ ప్లే కొత్త మలుపు తీసుకుంది. ఇక ఈ వారం ఎవరి ఫేట్ ఎలా తిరుగుతుందో చూడాలి!
