బిగ్ బాస్ రియాల్టీ షోలో రియాల్టీ గురించి అస్సలు ఆలోచించకూడదు. రాజ్ ఎలిమినేట్ అయిపోయాడు.! కానీ, వికెట్ పడాల్సింది ఫైమాది. ఫైమా వద్ద ఎవిక్షన్ ఫ్రీ పాస్ వుండటంతో ఆమె గట్టెక్కింది. నిజానికి, ఇలాంటి సందర్భాల్లో ఇద్దరూ సేఫ్ అయిపోవాలి. ఎలిమినేషన్ వుండకూడదు ఈ వారం.
కానీ, రాజ్‌ని పంపించెయ్యాలని ముందే బిగ్ బాస్ నిర్వాహకులు డిసైడ్ అయిపోయారు. దాంతో అస్సలేమాత్రం మొహమాటపడకుండా సిల్లీ గేమ్‌కి తెరలేపారు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఫైమా వాడుకుంటే.. ఫైమా గనుక ఓటర్ల ఓట్లతోనే సేవ్ అయిపోతే, ఆ ఎవిక్షన్ ఫ్రీ పాస్ వృధా అయిపోతుందట. పోనీ, రాజ్ కోసం దాన్ని వినియోగిస్తే.. రాజ్ గనుక ఓటర్ల ఓట్లతో సేవ్ అయిపోతే.. అదెలాగూ వేస్ట్ అవుతుంది. అసలు పాస్ ఎవరి తరఫునా వాడకుండా వున్నా, అది వేస్టయిపోతుంది.
ఏంటి, అసలు ఈ మొత్తం తతంగమే వేస్ట్ అనుకుంటున్నారా.? ఇంత వేస్ట్ వ్యవహారాన్ని అదేదో సస్పెన్స్ డ్రామాలాగా నడిపించి, టైమ్ వేస్ట్ చేసేశారు. ఏం జరుగుతుందో ముందే అందరికీ తెలిసిపోయింది. పోనీ, నడిచిన డ్రామా అయినా రంజుగా వుందా.? అంటే అదీ లేదు. చెత్త లాజిక్కులు చెప్పాడు హోస్ట్ నాగార్జున. కాదు కాదు, అతనిలో అలా మాట్లాడించారు బిగ్ బాస్ నిర్వాహకులు.
‘బిగ్ బాస్ వీక్షకుల ఓట్లతో నేను సేఫ్ అవ్వాలి తప్ప.. ఎవిక్షన్ ఫ్రీ పాస్‌తో కాదు..’ అని చెప్పిన ఫైమా, చివరికి మాట మార్చి, దాన్ని వాడేసుకుంది. ఎలిమినేషన్‌లో తక్కువ ఓట్లు కూడా ఆమెకే వచ్చాయట. కానీ, ఫ్రీ పాస్ ఆమె దగ్గర వుంది గనుక, అది ఉపయోగపడిందట. భలే చెత్త కథ చెప్పారు కదా.?
అన్నట్టు, కీర్తి అలూ కూర వండింది.. దాన్ని నాగ్ టేస్ట్ చేశాడు. ‘నేను వారం రోజులపాటు తినే ఆయిల్.. ఒక్క రోజులోనే నువ్వు తినేస్తావా.?’ అంటూ నాగ్ సెటైరేశాడు. ఏవో పిచ్చి ఆటలు, అర్థం పర్థం లేని వ్యవహారాలతో ఈ వీకెండ్ కూడా వృధా అయిపోయింది.