సాధారణంగా ఫిజికల్ టాస్క్ అనగానే, అమ్మాయిలు – అబ్బాయిల మధ్య రచ్చ జరుగుతుంటుంది. అక్కడ టచ్ చేశావ్.. ఇక్కడ చెయ్యి పెట్టావ్.. అంటూ ఫిమేల్ కంటెస్టెంట్లు నానా యాగీ చేస్తుంటారు. మొదటి సీజన్ నుంచీ ఈ ఛండాలం నడుస్తూనే వుంది.
కానీ, అనూహ్యంగా ఆరో సీజన్‌లో అందునా, కెప్టెన్సీ కోసం జరిగిన టాస్క్‌లో పెద్దగా వివాదాల్లేవ్. అమ్మాయిలు.. అబ్బాయిలు.. బంతితో తలపడ్డారు. బంతిని హోల్డ్ చేసే క్రమంలో అబ్బాయిలు బలప్రదర్శన చేస్తే, అమ్మాయిలూ గట్టిగానే పోటీ పడ్డారు. చివరికి ముగ్గురు అమ్మాయిలు నిలవడగా, కీర్తిని ఇనాయా తొలుత బయటకు పంపింది. ఆ తర్వాత శ్రీ సత్యని ఓడించింది.
తద్వారా ఇనాయా కెప్టెన్ అయ్యింది. ‘అమ్మా, నీకిచ్చిన మాట నిలబెట్టుకున్నా..’ అంటూ ఇనాయా తన తల్లిని ఉద్దేశించి వ్యాఖ్యానించింది ఇనాయా. ‘నేను కెప్టెన్‌ని అయినా, నా రూల్స్ ఏమీ వుండవు.. బిగ్ బాస్ రూల్స్‌ని పక్కాగా ఫాలో అవుదాం..’ అంటూ కెప్టెన్ అయ్యాక హౌస్‌మేట్స్‌ని ఉద్దేశించి వ్యాఖ్యానించింది ఇనాయా.
మరోపక్క, కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా ఇనాయా చేతిలో ఓడిన శ్రీసత్య, తన ఓటమికి కారణం ఫైమా.. అంటూ గుస్సా అయ్యింది. తన చేతి వేలికి గాయమవడానికి కారణం ఇనాయా అనీ, ఆ ఇనాయా తనను పోటీలోంచి బయటకు పంపడం దారుణమని కీర్తి మండిపడింది.
అంతకుముందు హౌస్‌లోకి రేవంత్ తల్లి వచ్చారు. తల్లిని చూసి రేవంత్ ఎమోషన్ అయ్యాడు. ఆమె కోరిక మేరకు అప్పటికప్పుడు గడ్డం తీసేశాడు.. స్మార్ట్‌గా తయారైపోయాడు. కాగా, హౌస్‌లో వున్న టీవీ ద్వారా తన భార్యతో మాట్లాడాడు రేవంత్. అయితే, పర్సనల్‌గా మాట్లాడేందుకు అవకాశం దొరక్కపోవడంతో పదే పదే ఆ అవకాశమివ్వాలని బిగ్‌బాస్‌ని రేవంత్ అడిగాడుగానీ ప్రయోజనం లేకుండా పోయింది.
‘నీకు ఎవరూ లేరని ఎప్పుడూ బాధపడొద్దు.. ఈ అమ్మ వుంది. నిన్ను కూడా నా కూతురిలానే చూసుకుంటా..’ అంటూ రేవంత్ మాతృమూర్తి, కీర్తిని ఉద్దేశించి చెప్పడం గమనార్హం.
I cherished up to you’ll receive carried out right here. The comic strip is attractive, your authored subject matter stylish. nevertheless, you command get got an nervousness over that you want be handing over the following. sick no doubt come further previously again as exactly the similar nearly very frequently inside case you defend this hike.