ఫన్ ఓరియెంటెడ్ మూవీగా ఓ యూత్ ఫుల్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఆవారా జిందగి మూవీ. నేటితరం ఆడియన్స్ మెచ్చే కథ ఎంచుకొని దానికి కావాల్సినంత ఫన్ యాడ్ చేస్తూ థియేటర్స్ లో మజా చేసేందుకు సిద్ధమవుతోంది ఆవారా జిందగి టీమ్.
ఫన్ ఫిల్డ్ ఎంటర్ టైనర్ మూవీగా రాబోతున్న ఈ ఆవారా జిందగి చిత్రానికి దేప శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. విభా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు నిర్మాత నంద్యాల మధుసూదన్ రెడ్డి. ఈ చిత్రానికి కంభంపాటి విజయ్ కుమార్ సహ నిర్మాతగా వ్యవహరించగా.. ప్రతీక్ నాగ్ సంగీతం అందించారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలారు.
సినిమా కథను రిప్రెజెంట్ చేసేలా నలుగురు కుర్రాళ్లతో ఈ పోస్టర్ డిజైన్ చేశారు. పోస్టర్ లో కనిపిస్తున్న చార్మినార్, పిస్తోల్, 2000 రూపాయల నోట్లు అలాగే ఆ నలుగురి లుక్స్ ఈ సినిమాలో వైవిధ్యం ఉండనుందని స్పష్టం చేస్తున్నారు.
బిగ్ బాస్ శ్రీహాన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ ఆవారా జిందగి సినిమాను ఆడియన్స్ కోరుకునే విధంగా కామెడీ ప్రధానాంశంగా తెరకెక్కించారు. నలుగురు కుర్రోళ్ళ నడుమ నడిచే ఫుల్ లెంగ్త్ కామెడీతో ఈ సినిమాను గ్రాండ్ గా రూపొందిస్తున్నారు. జీరో లాజిక్ 100% ఫన్ అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా రానుండటం ఆసక్తికర అంశం. అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించేలా ఈ సినిమా కథ ఎంచుకొని ఇంట్రెస్టింగ్ లొకేషన్స్ లో తెరకెక్కించారు మేకర్స్. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.
చిత్రంలో బిగ్ బాస్ శ్రీహాన్, ముక్కు అజయ్, ఢీ చెర్రీ, జస్వంత్, షియాజీ షిండే, సద్దాం, టార్జాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. చిత్రానికి శ్యామ్ ప్రసాద్ V, ఉరుకుంద రెడ్డి S సినిమాటోగ్రాఫర్స్ గా పని చేయగా.. S B రాజు తలారి ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. అతిత్వరలో ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించనున్నారు.
690049 646569Hi. Cool post. Theres an concern with your site in chrome, and you may want to test this The browser could be the marketplace chief and a very good element of men and women will omit your excellent writing because of this difficulty. 810843
818812 343533A excellent clear cut answer and a terrific concept. But how do I post any function on this website is an additional question. The Foureyed Poet. 218721
804677 130944Maintain up the fantastic piece of work, I read couple of blog posts on this internet site and I believe that your web site is real interesting and has lots of fantastic info. 979625