Switch to English

BIGG BOSS 9 TELUGU E95: తనూజనే కప్ కొట్టాలని కోరుకున్న ప్రేక్షకులు!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,201FansLike
57,764FollowersFollow

బిగ్ బాస్ సీజన్ 9 బుధవారం ప్రసారమైన 95వ ఎపిసోడ్ పూర్తిగా రచ్చ, టాస్క్ ట్విస్ట్‌లు, ఇంటి సభ్యుల మధ్య హీటెడ్ చర్చలతో అదిరిపోయింది. రోజు మొదటినుంచే టాస్క్‌ల పర్వం మొదలై… లీడర్‌బోర్డులో స్కోర్‌లు మారిపోతూ ప్రేక్షకులను సస్పెన్స్‌లో ఉంచాయి.

నిన్నటి ఎపిసోడ్‌లో సంజనను సభ్యులు తప్పించినందున, రాబోయే టాస్క్‌ల్లో ఆమె పాల్గొనలేరని బిగ్ బాస్ మరొకసారి స్పష్టం చేశాడు. దీనితో ఇంటి సభ్యుల ప్లానింగ్‌లో కొత్త మ్యాథమెటిక్స్ మొదలైంది.

ఈ రోజు మొదటి టాస్క్ “పట్టుకో పట్టుకో”:
జంబో పాంట్స్ వేసుకున్న సభ్యులు… సంచాలకులు అయిన సంజన, కల్యాణ్ విసిరిన బాల్స్‌ను పట్టుకోవాలి. ఎవరి పాంట్స్‌లో ఎక్కువ బాల్స్ పడితే వారికి ఎక్కువ స్కోర్లు.

సాధించిన స్కోర్లు:
తనూజ – 10
భరణి – 8
పవన్ – 7
ఇమ్మానియేల్ – 6
సుమన్ – 4

ఇంతలో బిగ్ బాస్ ఇచ్చిన మరో ట్విస్ట్ టాస్క్ “ఇది ఫెయిర్ కాదు బాస్!”:
సభ్యులు చర్చించుకుని, ఇద్దరిని ఆట నుంచి పూర్తిగా తప్పించాలి—ఇకపై వారు నామినేషన్ నుంచి సేవ్ అయ్యే అవకాశం కూడా ఉండదు. ఈ నిర్ణయం మీద ఇంట్లో భగ్గుమన్న వాదనలు జరిగాయి. చివరకు మెజారిటీ ఇమ్మానియేల్ మరియు పవన్‌ను తప్పించాలనే నిర్ణయానికి వచ్చింది. దీంతో వారు తదుపరి గేమ్స్‌కి దూరమయ్యారు.

అదే వెంటనే వచ్చిన మరో టాస్క్ “పట్టు వదలకు”:
ఇక్కడ పవన్, ఇమ్మానియేల్ సంచాలకులు. సాధించిన ప్లేస్ ఆధారంగా పాయింట్లు ఇలా…

స్కోర్లు:
భరణి – 100
తనూజ – 80
సంజన – 60
సుమన్ – 40

ఇప్పటికే లీడర్‌బోర్డు ప్రకారం టాప్ 2 అయిన భరణి, తనూజలకు ప్రేక్షకుల ముందు ఓటు అప్పీల్ చేసే అవకాశం లభించింది. బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన ఆడియెన్స్‌తో ఇంటి మధ్య వాతావరణం ఒక్కసారిగా ఫ్యాన్స్ హడావుడిలా మారిపోయింది.

భరణి తన రెండో అవకాశం ఎలా తనను మార్చిందో వివరంగా చెప్పగా, ప్రేక్షకుల ప్రశ్నలకు తనూజ చురుకైన సమాధానాలు ఇచ్చింది. హౌస్ కెప్టెన్ కావడం తన బెస్ట్ మూమెంట్ అని, హౌస్‌లో ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకోవడం ఎంత ముఖ్యమో చెప్పింది.

చివరగా జరిగిన ఆడియెన్స్ ఓటింగ్‌లో…
అందరి మనసులు దోచుకున్నది తనూజే!
ప్రేక్షకులు బిగ్గరగా ప్రకటించినట్టే — “తనూజే కప్ కొట్టాలి!” అని క్లారిటీగా చెప్పేశారు. ఇంటి లోపల,  బయట ప్రేక్షకుల్లో కూడా ఆమెకు భారీ సపోర్ట్ కనిపించింది.

తనూజ పెర్ఫార్మెన్స్‌కి ప్రేక్షకుల నుంచి వచ్చిన ఈ భారీ రెస్పాన్స్ ఈ సీజన్‌లో టైటిల్ రేసు ఇంకా రగిలించేలా చేసింది. ఇక హౌస్‌లోని గేమ్ ఎలా మలుపు తిరుగుతుందో చూడాల్సిందే!

సినిమా

8 రోజుల్లో రాజా సాబ్… ఇంకా దూరమే గమ్యం!

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ది రాజా సాబ్’ బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ మధ్య తన ప్రయాణాన్ని...

మెగాస్టార్ అంటే ఏంటో మళ్లీ గుర్తు చేసిన “మన శంకర వర...

“చిరంజీవి సినిమా బాగుందంట…”ఈ మాట ఈ మధ్య మళ్లీ థియేటర్ నుంచి థియేటర్‌కి, మాట నుంచి మాటకి తిరుగుతోంది. మన శంకర వర ప్రసాద్ గారు సినిమా...

‘మన శంకర వర ప్రసాద్ గారు’ సెన్సేషన్… 5 రోజుల్లోనే ₹226...

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్రను లిఖిస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ...

ప్రేక్షకుల ప్రేమే మా అసలైన విజయం: ‘అనగనగా ఒక రాజు’ థాంక్యూ...

సంక్రాంతి కానుకగా విడుదలై థియేటర్లలో నవ్వుల పండగ సృష్టించిన చిత్రం ‘అనగనగా ఒక రాజు’ విజయోత్సాహంతో దూసుకుపోతోంది. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి కథానాయకుడిగా నటించిన...

మెగా 158లో చిరంజీవి సరసన ఐశ్వర్య రాయ్?

మెగాస్టార్ చిరంజీవి తాజా బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న మెగా 158 సినిమాను పూర్తి...

రాజకీయం

పవన్ కళ్యాణ్: పెట్టుబడిదారులకు భరోసా ఇచ్చే కూటమి ప్రభుత్వం… గ్రీన్ ఎనర్జీలో ఏపీకి కొత్త దిశ

పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచుతూ ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రభుత్వాలు మారినా విధానాల్లో స్థిరత్వం ఉండాలన్నదే తమ ప్రభుత్వ...

మాట నిలబెట్టుకున్న సీఎం… ఉద్యోగుల ఖాతాల్లో నగదు

సంక్రాంతి పండుగను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నిజమైన పండుగలా మార్చింది కూటమి ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు, ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను ఒకేసారి విడుదల...

Liquor Scam Case: విజయ్ సాయిరెడ్డికి ఈడీ నోటీసులు..

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ విజయ్ సాయిరెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22వ తేదీన...

మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ సందడి: సాహిత్యానికి సత్కారం, క్రీడలకు ఉత్సాహం, చేనేతకు ప్రోత్సాహం

మంగళగిరి నియోజకవర్గంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం వరుస కార్యక్రమాల్లో పాల్గొంటూ విస్తృతంగా సందడి చేశారు. సాహిత్య రంగానికి ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు, క్రీడలను ఉత్సాహపరిచి, స్థానిక వ్యాపారాలకు...

“స్వగ్రామం నుంచి స్వర్ణాంధ్ర దిశగా: సమసమాజమే లక్ష్యం”: చంద్రబాబు

నారావారిపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వ అభివృద్ధి దృక్పథం, పండుగల ప్రాధాన్యం, గ్రామీణ పునర్నిర్మాణం, ఆర్థిక అసమానతలపై తన ఆలోచనలను విస్తృతంగా వెల్లడించారు. గతంలో గ్రామాలకు వెళ్లడానికి...

ఎక్కువ చదివినవి

సంక్రాంతికి నవ్వుల రాజ్యం… ‘అనగనగా ఒక రాజు’తో క్యూట్ కామెడీ సర్‌ప్రైజ్ ఇస్తా: మీనాక్షి చౌదరి

ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించేందుకు ‘అనగనగా ఒక రాజు’ చిత్రం సిద్ధమవుతోంది. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ ఫెస్టివల్ ఎంటర్‌టైనర్‌లో మీనాక్షి చౌదరి కథానాయికగా కనిపించనుంది....

Daily Horoscope: మేషం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది – తులలో కీలక నిర్ణయాలు

జనవరి 15, 2026 గురువారం రాశిఫలాలు: మేషం (Aries): ఈ రోజు మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ముందడుగు వేయగలుగుతారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో ఒక మంచి ఆలోచన...

వాటర్‌ పాలిటిక్స్‌లో రాజకీయ ఆరోపణలు.. ఏపీపై ప్రభావం?

ఆంధ్రప్రదేశ్‌–తెలంగాణ రాజకీయాల్లో నీటి అంశం మరోసారి కేంద్రబిందువుగా మారింది. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ మధ్య సన్నిహిత రాజకీయ అవగాహన ఉందన్న ఆరోపణలు మళ్లీ తెరపైకి...

మూడో రోజు 183 కోట్లు.. ‘రాజా సాబ్’ బాక్సాఫీస్ దూకుడు

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్రెస్టీజియస్ మూవీ “రాజా సాబ్” బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన దూకుడు చూపుతోందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.183 కోట్లకు...

‘సుమతీ శతకం’ నుంచి ‘ఎక్కడే ఎక్కడే’ మెలోడి విడుదల…

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మలపాటి నిర్మాతగా, ఎంఎం నాయుడు రచన–దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా తెలుగు చిత్రం ‘సుమతీ శతకం’. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటిస్తున్న ఈ...